news about pnb scam neerav modi

నీరవ్‌ మోదీ ఇక్కడే ఉన్నాడు.. అధికారులకు సమాచారం

Submitted by nanireddy on Mon, 08/20/2018 - 16:48

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేల కోట్ల రూపాయలకు మోసగించి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ యూకేలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని యూకే అధికారులు కూడా ధ్రువీకరించారు. నీరవ్‌ మోదీ తమ దేశంలోనే ఉన్నట్లు యూకే అధికారులు వెల్లడించారని సీబీఐ అధికారులు స్పష్టంచేశారు. దీంతో అతన్ని తిరిగి భారత్‌కు పంపించాలని కోరుతూ సీబీఐ అధికారులు యూకేను కోరారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన మామ మెహు్‌ల్‌ ఛోక్సీలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.13వేల కోట్ల మోసాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కుంభకోణం బయటపడడానికి కొద్ది రోజుల ముందే ఈ ఏడాది జనవరిలో వీరు దేశం విడిచి పారిపోయారు.