Crime

హిజ్రా గొంతుకోసి పరారైన ప్రియుడు

Submitted by nanireddy on Wed, 10/24/2018 - 18:06

హిజ్రాతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ యువకుడు.. హిజ్రాపై దారుణానికి పాల్పడ్డాడు.  గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ లో జరిగింది. గార్ల మండలం అంజనాపురానికి చెందిన బానోత్‌ రాధిక (హిజ్రా), కొత్తతండాకు చెందిన దారావత్‌ సురేశ్‌ మహబూబాబాద్ లోని రాధిక అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. వీరు మూడేళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. అయితే సంవత్సరం కిందట రాధిక కట్నం పేరుతో రూ. 2 లక్షలు సురేష్ కు ఇచ్చింది. దాంతో సంతృప్తిపడని సురేష్ మరో మూడు లక్షలు కావాలని రాధికను వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి గొడవ తీవ్రమైంది. కోపోద్రిక్తుడైన సురేష్..

వ్యక్తిపై నుంచి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

Submitted by nanireddy on Sun, 10/21/2018 - 09:00

విజయవాడ కృష్ణ లంక హై వే పై ప్రమాదం చోటుచేసుకుంది. మహిళను తప్పించబోయి స్కూటీ మీద నుంచి కింద పడిన వ్యక్తి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అంబులెన్స్‌ కూడా సకాలంలో రాకపోవడంతో క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బాలాజీ నగర్‌కి చెందిన వెంకటేశ్వర్‌రావుగా పోలీసులు గుర్తించారు.  జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం కారణంగా దాదాపుగా గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.

బేగం పేట పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఉన్మాదం

Submitted by nanireddy on Thu, 10/18/2018 - 17:48

బేగంపేటలో పోలీస్ స్టేషన్ లో దారుణం వెలుగుచూసింది. రెహ్మాన్‌ అనే వ్యక్తి.. పోలీస్‌స్టేషన్‌లో చొరబడి…. ఆయన కుటుంబసభ్యులైన ఐదుగురిపై విచక్షణారహితంగా కొబ్బరిబోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతకొంతకాలంగా  రెహమాన్‌ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న అతని కుటుంబసభ్యులు అతనిపై ఫిర్యాదు చేశారు.  ఈ క్రమంలోనే ఆయన భార్య, అత్తమామ లు పోలీస్ స్టేషన్ కు రావడంతో రెహ్మాన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఆసుపత్రి నుంచి మాధవి డిశ్చార్జ్

Submitted by nanireddy on Wed, 10/17/2018 - 17:55

ప్రేమ పెళ్లి చేసుకుని, తండ్రి చేతిలో దారుణంగా గాయపడ్డ మాధవి ఎట్టకేలకు కోలుకుంది. ఇవాళ (బుధవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. బోరబండకు చెందిన మాధవి అదే ప్రాంతానికి చెందిన సందీప్ ను ప్రేమ వివాహం చేసుకుంది. దాంతో మాధవిపై కక్ష పెంచుకున్న తండ్రి మనోహరాచారి గత నెల 19న విచక్షణా రహితంగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మాధవి తీవ్రంగా గాయపడింది. ఆమె భర్త సందీప్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మాధవి చెవి, కుడిచేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగు పడిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

మరో పరువుహత్య వెలుగులోకి.. కూతురిని దారుణంగా చంపి..

Submitted by nanireddy on Wed, 10/17/2018 - 15:50

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు సంఘటన మరవకముందే మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన ఎర్రమ్మ, నారాయణ స్వామి దంపతుల కూతరు హేమశ్రీ.. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని హేమాశ్రీ తల్లిదండ్రులు ఆమెను అంతమొందించాలని అనుకున్నారు. పెళ్లిచేసుకుని ఊళ్లోకి వచ్చిన హేమశ్రీని కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అదే రోజు ఆమెను హత్యచేసి కెనాల్‌లో పడేసి… ఊరు విడిచి పరారయ్యారు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. ఘటన వెలుగులోకి వచ్చింది.

రెచ్చిపోయిన ప్రేమోన్మాది… ఒంటికి నిప్పంటించుకొని యువతి ఇంట్లోకి

Submitted by nanireddy on Sat, 10/06/2018 - 16:31

హైదరాబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. యువతి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఏకంగా అమ్మాయి ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ఇంట్లో ఉన్న యువతి కుటుంబసభ్యులకు ఆ నిప్పంటుకుని తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే ఈ దారుణానికి పాల్పడింది ఇబ్రహీం అనే పెళ్ళైన వ్యక్తి అని తెలుస్తోంది. అతనికి ఇదివరకే ఇద్దరు సంతానం. గతకొంత కాలంగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటూ బార్కస్ లో నివసించే ఓ యువతి వెంటపడుతున్నాడు. .ఈ విషయం సదరు యువతి కుటుంబసభ్యులకు తెలిసి అతడిని మందలించారు.

పవన్ కళ్యాణ్ ఫాంహౌస్‌ సమీపంలో మహిళ దారుణ హత్య?

Submitted by nanireddy on Fri, 10/05/2018 - 20:23

పవన్ కళ్యాణ్ ఫాంహౌస్‌ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులెవరో ఆమెను హత్య చేసి వెళ్లినట్టు సమాచారం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ శివారులో జరిగింది.  సమీపంలోనే సినీనటుడు పవన్ కళ్యాణ్ ఫాంహౌస్‌ ఉంది.  గుర్తుతెలియని మహిళ  హత్యకు గురైందని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దారుణ హత్యకు గురైన మహిళ ఎవరు..? ఏ ప్రాంతానికి చెందారు.. అసలు ఆమెను హత్య చేయాల్సినంత అవసరం ఎవరికుంది..? అన్న అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ముగ్గురు పిల్లలతో సహా కాలువలోకి దూకిన తల్లి.. పిల్లలు మృతి..

Submitted by nanireddy on Fri, 10/05/2018 - 18:29

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు.  అనుముల మండలం హాలియా సమీపంలోని సాగర్‌ ఎడమ కాలువలో ఈ ఘటన జరిగింది.. కాలువలో దూకిన తల్లి స్వాతిని స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండటంతో విసిగిపోయిన స్వాతి… భర్త మోహన్‌తో గొడవ పడి తన ముగ్గురు పిల్లలతో కలిసి నీటి కాలువలోకి దూకింది. అయితే పక్కననుంచే వెళ్తున్న స్థానికులు వారిని గమనించి రక్షించబోయేలోపే ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కాగా..స్వాతి భర్త పెద్దపూర పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

కర్ణాటకలో వింత శిశువు జననం

Submitted by nanireddy on Wed, 10/03/2018 - 16:11

కర్ణాటకకు చెందిన ఓ మహిళ వింత శిశువుకు జన్మించింది, అయితే కానీ వెనుక తోక ఆకారంలో జన్మించిన ఆ వింత శిశువు జన్మించిన కొద్దిసేపటికే కన్నుమూసింది. కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేటకు చెందిన భవననిర్మాణ కార్మికుడు జీకే మూర్తి భార్య చిన్నమ్మకు సోమవారం రాత్రి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువుకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం పుట్టింది. ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు లేవని వైద్యులు తెలిపారు. కాగా జన్మించిన కొద్దిసేపటికే ఆ శిశువు మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.

అనుమానాస్పదరీతిలో జంట మృతి

Submitted by nanireddy on Tue, 10/02/2018 - 21:19

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ జంట అనుమానాస్పదరీతిలో మృతిచెందింది. పట్టణంలోని ఓ లాడ్జిలో బసచేసిన ఈ జంట… ఆదిలాబాద్‌ జిల్లా లింగాపూర్‌కు చెందినవారుగా తెలిసింది. ఆధార్‌కార్డు ఆధారంగా అందులో ఒకరు విష్ణువర్దన్‌గా గుర్తించారు. వారి నోట్లోంచి నురగలు వస్తుండడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వాళ్లిద్దరూ ప్రేమికులా, దంపతులా అనే విషయం ఇంకా తెలియలేదు.