In-Depth

శ్రీరస్తు.. శుభమస్తు... ముందస్తు!! గెలుపు ధీమాపై ఇదీ అసలు లెక్క!

Submitted by santosh on Sat, 09/15/2018 - 11:54

ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో కేసీఆర్‌కు తనదైన వ్యూహముంది. తప్పనపరిస్థితుల్లో కాంగ్రెస్సూ సిద్దమైంది. మిగతా రాజకీయ పార్టీలూ సై అంటున్నాయి. కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకూ, ఈ ఎన్నికలపై పక్కాగా ఓ లెక్కుంది. ఏంటది? మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌‌లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. అయితే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓ రేంజ్‌లో వెల్లువెత్తుతోంది. ఉప ఎన్నికల ఫలితాలే కాదు, తాజా సర్వేలు కూడా కమలానాథులకు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పెద్దల్లో జోష్‌ నింపుతున్నాయి. త్వరలో జరగనున్న ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి, లోక్‌సభ పోరుకు సమరోత్సాహంతో వెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

అధ్యయనం తర్వాతే అసలు కథ!! ఈసీ సీక్రెట్‌ ఇదే!

Submitted by santosh on Sat, 09/15/2018 - 11:50

ఎన్నికల సన్నద్ధతపై పూర్తి సంతృప్తి చెందాకే షెడ్యూల్ ఖరారు చేస్తామంటోంది ఎన్నికల కమిషన్. అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్న తర్వాతే, తేదీలను ప్రకటిస్తామంటోంది. అలాగే, రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టో విడుదల చేసేముందు డ్రాఫ్ట్ ను, ఎన్నికల సంఘానికి ఇవ్వాలంటోంది. ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామంటోంది ఈసీ. తెలంగాణలో ఎన్నిక నిర్వహణ, ఏర్పాట్లపై ఎప్పటికప్పడు సమీక్షలు చేస్తోంది ఎన్నికల కమిషన్. ఈసారి ధన,మద్యం ప్రవాహంను అడ్డుకునేందుకు గట్టి నిఘా పెత్తామని అంటోంది.

అభ్యర్థులు వర్సెస్ అసమ్మతి నేతలు... ఇదీ గులాజీ రాజకీయం

Submitted by santosh on Sat, 09/15/2018 - 11:42

అభ్యర్ధులను ప్రకటించింది టిఆర్ఎస్. దీంతో అభ్యర్ధులు భారీ ర్యాలీలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే అటు అసమ్మతి నేతలు కూడా, వారికి వ్యతిరేకంగా, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా, సొంత పార్టీ నేతలకే సవాల్ విసురుతున్నారు. అభ్యర్థులను మార్చాలి, తమ పేరును ప్రకటించాలి, లేదంటే ఇండిపెండెంట్లుగా పోటీకి సై అంటున్నారు. నల్లగొండ, మిర్యాలగూడలో ఎమ్మెల్యే అభ్యర్థులు వర్సెస్ అసమ్మతి నేతల పోటాపోటీర్యాలీలు, సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.

వారెవ్వా.... రాజకీయానికి చెంపదెబ్బ అంటే ఇదీ!!

Submitted by santosh on Fri, 09/14/2018 - 15:36

ఆ గ్రామంలో అంబేడ్కర్‌ సూక్తి ఆలోచింపజేస్తుంది. ఎన్నికల వేళ సరికొత్త ఆలోచనను రేకెత్తిస్తోంది. రాజకీయ నాయకుల వక్రబుద్ధికి బెండ్‌ కావొద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ... ఓటు పట్ల ప్రజల్లో ఉన్న అవగాహనను, ఇతరులకు చైతన్యాన్ని కలిగిస్తోంది.తెలంగాణలో ఎలక్షన్ల లొల్లి మొదలైంది. ఒక్కొక్క పార్టీ నుంచి ముడుపులు, మద్యం బాటిళ్ళు. కానుకలు ఓటర్లకు ముట్టజెబుతుంటారు రాజకీయ నాయకులు. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని లేని లేని జిమ్మిక్కులకు పాల్పడుతుంటారు వివిధ పార్టీలవాళ్ళు. ఈ క్రమంలో ఎవరికి ఓటు వెయ్యాలి ? అనే డైలమాలో ఓటర్లు వుంటారు. 

ఓదేలును కేసీఆర్‌ ఎలా ఒప్పించాడబ్బా!!?

Submitted by santosh on Fri, 09/14/2018 - 13:25

టీఆర్‌ఎస్‌లో వారంరోజులుగా రగులుతున్న చెన్నూరు టికెట్‌ వ్యవహారం కొలిక్కి వచ్చింది. కేసీఆర్ బుజ్జగింపులతో ఓదేలు మెత్తబడ్డారు. తన జీవితాంతం కేసీఆర్‌తోనే కలిసి పనిచేస్తానన్న ఓదేలు... చెన్నూరులో బాల్క సుమన్‌ గెలుపు కోసం కృషిచేస్తామంటూ ప్రకటించారు. టీఆర్ఎస్‌లో చెన్నూరు టికెట్‌ లొల్లి ముగిసింది. హ్యాట్రిక్‌ విజయం సాధించిన తనను కాదని, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూరు టికెట్‌ ఇవ్వడంతో రగిలిపోతున్న నల్లాల ఓదేలు... టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ తర్వాత మెత్తబడ్డారు. బాల్క సుమన్‌ పర్యటనలో ఓదేలు అనుచరుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, తీవ్ర సంచలనమవడంతో... గులాబీ బాస్‌‌...

ఇప్పుడే బాబుపై బాబ్లీ బాంబు ఎందుకు పడింది?

Submitted by santosh on Fri, 09/14/2018 - 13:21

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కావడంతో తీవ్ర సంచలనమైంది. ఎనిమిదేళ్ల క్రితం కేసులో సడన్‌‌గా ఎన్బీడబ్ల్యూ ఇష్యూ చేయడంపై తెలుగుదేశం శ్రేణులు అవాక్కయ్యాయి. ఇదంతా కుట్ర అంటూ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ బాబ్లీ ఉద్యమం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. చంద్రబాబుతోపాటు మొత్తం 16మందికి నోటీసులు జారీ చేసిన మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టు... ఈనెల 21న విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది.

ఉత్తమ్‌పై కత్తి దూసే బాహుబలి ఎవరు?

Submitted by santosh on Fri, 09/14/2018 - 13:15

వెన్నుచూపని వీరులను ఎన్నుకుని మరీ పంపమను అంటున్న పీసీసీ చీఫ్‌పై, గులాబీదండు ఎవరిని బరిలోకి దింపాలనుకుంటోంది...105 మంది అభ్యర్థులను ప్రకటించినా, హుజూర్‌ నగర్‌ సామ్రాజ్యంపై ఎందుకు దండెత్తడం లేదు...టఫ్‌ పోటీనిచ్చే గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తుందా....లేదంటే ఉన్నవారిలోనే అసమ్మతి సెగలతో వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా? ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు. కాంగ్రెస్‌ సీఎం రేసులో వినిపిస్తున్న పేరు. హుజూర్‌ నగర్‌ నుంచి రెండు సార్లు గెలిచారు ఉత్తమ్. దీంతో అందరి దృష్టి హుజూర్‌ నగర్‌పై పడింది.

సీటు మారితే ఫేటు మారుతుందా? ఎల్‌.రమణ పోటీ ఎక్కడి నుంచి!!

Submitted by santosh on Fri, 09/14/2018 - 13:12

మహాకూటమి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీట్లు పోయినా పర్వాలేదు, సమిష్టిగా విజయం సాధిద్దామంటున్నారు. ఇన్ని అంటున్న ఆయన సీటుకే ఎసరు పడుతోంది...ఇంతకీ ఆయన ఎవరు...ఆయన సీటు కథేంటి?

కక్ష సాధింపా? వ్యూహంలో భాగమా? అరెస్టుల వెనుక అసలు కథ!!

Submitted by santosh on Fri, 09/14/2018 - 13:09

ఎన్నికల వేళ, కేసులు-అరెస్టులతో అలజడి రేగుతోంది. నకిలీ పాస్‌ పోర్ట్ కేసుల్లో, జగ్గారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు,  హౌసింగ్‌ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌ పోలీసుల నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. కేవలం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే, పాత కేసులు తిరగతోడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తుంటే, చట్టం తన పని తాను చేసుకుపోతోందని టీఆర్ఎస్‌ నేతలంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో పాస్ పోర్టు తీసుకుని.. అమెరికాకు మనుషులను అక్రమంగా తరలించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం, తెలంగాణలో కలకలం రేపింది.

గల్లంతయ్యాయి సరే... గల్లంతు కాని ఓట్లైనా గట్టెక్కిస్తాయా?

Submitted by santosh on Fri, 09/14/2018 - 13:05

రాష్ట్రంలో ముందస్తూ ఎన్నిలకు వేడి రాజుకుంటన్నావేళ 30 లక్షల ఓట్లు గల్లంతు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుంది. అనేక సాంకేతిక కారణాల వల్ల ఓట్ల తొలగింపు జరిగిందని ఈసీ అంటుంటే కావాలనే ఓట్ల తొలగింపు చేశారని రాజకీయపార్టీలు అంటున్నాయి.80 లక్షల వరకు ఓట్ల తొలగింపు జరిగిందని తక్షణం ఓట్ల జాబితా సవరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూన్నారు.