In-Depth

మూడు ఆయుధాలకు కాంగ్రెస్‌ పదును... ఏంటవి?

Submitted by santosh on Tue, 11/20/2018 - 14:57

అస‌లైన ఎన్నిక‌ల బరిలోకి దిగిన త‌రువాత, ఆ ముడు అస్త్రాలను ప్రయోగించాలన్నది కాంగ్రెస్ ప్లాన్. ఇప్పటికే కూట‌మి కట్టి త‌న బ‌లానికి మ‌రింత బ‌లాన్ని పెంచుకుంది కాంగ్రెస్. అయినా ఎక్కడో అనుమానం పీడిస్తోంది. గులాబీదళాన్ని ఎదుర్కొనేందుకు త‌మ బ‌లం స‌రిపోతుందా అని, ఆలోచిస్తోంది. అందుకే మ‌రో 3 ఆయుదాల‌ను సిద్దం చేసుకుంది. అదే గుజరాత్‌ ఫార్ములా. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన ఫార్ములానేే, తెలంగాణలోనూ అప్లై చేయాలనుకుంటోంది టీపీసీసీ. ఈ ఫార్ములాతో గుజ‌రాత్‌లో కాంగ్రెస్ గెల‌వ‌కపోయినా, బీజేపీని ముచ్చెమటలు పట్టించింది. బీజేపీని ఓడించి, గెలిచినంత పని చేసింది.

మహాకూటమికి వీరి ప్రచారం ప్లస్ పాయింట్ అవుతుందా?

Submitted by santosh on Mon, 11/19/2018 - 17:41

రాజకీయాలలో ఏమైనా జరగొచ్చు గెలుపే టార్గెట్ గా రాజకీయ పార్టీలు రంగంలోకి దిగితే సిద్ధాంతాల రాద్ధాంతాలూ మాయమైపోతాయి. ఉమ్మడి ప్రత్యర్ధిని జయించడమే వ్యూహమైతే శతృవులూ మిత్రులుగా మారిపోతారు ప్రజాస్వామ్య అనివార్యత పేరుతో తెలుగు దేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇద్దరు ప్రత్యర్ధులను ఒకే వేదికపైకి తెస్తోంది. మహాకూటమి రోడ్ షోలలో ఒక అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించబోతోంది. 

వరంగల్‌లో ఆ 4 సీట్లు ఎందుకు హాట్‌ ఫేవరేట్‌?

Submitted by santosh on Mon, 11/19/2018 - 17:31

ఈ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆ నాలుగు స్దానాల్లో హోరాహోరీ తప్పదా కాంగ్రెస్, టీఆర్ఎస్, ఢీ అంటే ఢీ అంటున్నాయా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠపై బెట్టింగ్‌లు సైతం జోరు మీద సాగుతున్నాయా అసలు టఫ్‌ వార్‌కు కారణమేంటి ఎలాంటి సమీకారణాలు సమరాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి వరంగల్ జిల్లాలో అ రెండు పార్టీల మద్య నాలుగు సీట్ల ఫైట్‌పై స్పెషల్‌ స్టోరి. 

వైఎస్‌ ఆత్మకు చెక్‌ పడిందా?

Submitted by santosh on Mon, 11/19/2018 - 17:19

ఆయన ఒకప్పుడు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ను కనుసైగతో శాసించారు బలమైన సీఎంకే, బలమైన స్నేహితునిగా మెలిగారు ఆ‍యన కోరితే హైకమాండ్‌ కాదనలేదు. ఆయన కన్నెర్రజేస్తే స్టేట్‌ లీడర్‌ ఎవరైనా షేక్‌ అవ్వాల్సిందే. కానీ తెలంగాణ ఎన్నికల సమరంలో మాత్రం, ఆయన ఊసు వినిపించడం లేదు ఆయన హడావుడి కనిపించడం లేదు ఇంతకీ ఎవరాయన?

ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. అయితే ప్రస్తుతం ఆయన మాట కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద చెల్లుబాటు కావడంలేదనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఆయనపై గత కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ పార్టీలో ఉంది. 

ఏపీలో పొలిటికల్‌ జంగ్... జగన్‌ వర్సెస్‌ పవన్‌

Submitted by santosh on Sat, 11/17/2018 - 11:50

జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జగన్‌ టార్గెట్‌గా పవన్‌ చేసిన కామెంట్స్‌కు వైసీపీ నేతలకు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇంతకీ జనసేనానికి జగన్‌ను ఎందుకు టార్గెట్‌ చేశారు? జనసేనాని వైసీపీని టార్గెట్‌ చేశారు. ఇంతకాలం ప్రభుత్వాన్ని ఏకి పారేసిన పవన్‌... ఇప్పుడు జగన్‌పై మాటల దాడి తీవ్రతరం చేశారు. కోడికత్తి దాడితో పాటు హోదా విషయంలో వైసీపీ పారిపోయిందని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ, జనసేనల మధ్య సంధి రాయబేరం బెడిసి కొట్టిందా ? 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం సాధ్యం కాదని తెలిసి పోయిందా ? పొత్తుల కోసం మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చాయా ?

బాబు కోపం... మోడీపైనా... బీజేపీపైనా... సీబీఐపైనా?

Submitted by santosh on Sat, 11/17/2018 - 11:47

దేశంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఆ రెండు చోట్లా అధికారంలో ఉండే పార్టీలను బట్టి మారుతూ ఉంటాయి. రెండు చోట్ల ఒకే పార్టీ లేదా కూటమి ఉన్నప్పుడు పెద్దగా వివాదాలు రాలేదు. రెండు చోట్లా వేర్వేరు పార్టీలు ఉన్నప్పుడు మాత్రం ఆ సంబంధాలు ఉప్పు, నిప్పులా ఉంటున్నాయి. స్థూలంగా చూస్తే రాష్ట్రాల కన్నా కేంద్రానికి అధికారాలు ఎక్కువే. ఆ అధికారాలను తమకు వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని రాష్ట్రాల లోని ప్రభుత్వాలు భావించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో జీఎస్టీ, పెట్రో ధరలు లాంటి ఆర్థిక అంశాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు నడిచాయి. ఇక ఇప్పుడు ఈ ప్రభావం కేంద్ర దర్యాప్తు సంస్థల పై కూడా పడుతోంది.

పొన్నాల పంతం నెగ్గింది... కోదండ ఎందుకు తప్పుకున్నారు మరి!!

Submitted by santosh on Sat, 11/17/2018 - 11:41

హస్తినలో జనగామ ఎపిసోడ్‌కు తెరపడింది. పట్టువిడువని విక్రమార్కుడిలా పోరాడిన, పొన్నాల లక్ష్మయ్యకు దాదాపు లైన్‌ క్లియరైంది. జనగామ నుంచి కోదండరాం తప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. .ఇంతకీ కోదండరాం తప్పుకున్నారా....తప్పుకోవాల్సి వచ్చిందా...పొన్నాల లక్ష్షయ్య హస్తిన బలం ముందు కోదండరాముడు తట్టుకోలేకపోయాడా...జనగామ బరి నుంచి ప్రొఫెసర్‌ తప్పుకోవడానికి మూడు కారణాలున్నాయి...అవేంటి?

ఎవరీ సుహాసిని... కూకట్‌పల్లిలో బాబు వ్యూహమేంటి?

Submitted by santosh on Sat, 11/17/2018 - 11:34

సుహాసిని. నందమూరి తారక రామారావు మనవరాలు. నందమూరి హరికృష్ణ పెద్ద కూతురు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ల అక్క. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు. నందమూరి కుటుంబానికి చెందిన సుహాసినిని కూకట్‌పల్లి నుంచి పోటీకి దింపడం వెనక చంద్రబాబుకు చాలా వ్యూహాలున్నాయి. అందులో ఒకటి, కూకట్‌పల్లిలో సీమాంధ్రులు ఎక్కువ. కూకట్‌పల్లిలో సెటిటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. మినీ ఆంధ్రాగా చెబుతారు. అందులోనూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే అధికంగా ఉన్నారు. దీంతో కూకట్‌పల్లిలో ముందు నుంచి తెలుగుదేశానికి పట్టుంది. 2014లోనూ టీడీపీ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు గెలిచారు.

కేసీఆర్‌ విసిరే సమ్మోహనాస్త్రాలు... ఆ ఆరు ఆయుధాలేంటి?

Submitted by santosh on Sat, 11/17/2018 - 11:28

గులాబీ దళాధిపతి మొదటి అస్త్రంగా తెలంగాణ సెంటిమెంట్‌ను సంధించబోతున్నారు. 2014 ఎన్నికల తరహాలోనే తెలంగాణ అనుకూల, వ్యతిరేక విభజనవాదాన్ని, ఇప్పటికే గట్టిగా వినిపిస్తున్నారు. మహాకూటమి ఏర్పడుతుందన్న వార్తలొస్తున్న టైంలోనే, దీనికి ప్రాతిపదిక సిద్దం చేసుకుని, గ్రౌండ్‌లెవల్‌లోనే కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజాకూటమిని తెలంగాణ వ్యతిరేక కూటమిగా, జనంలోకి బలంగా తీసుకెళ్లబోతున్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడానికి తెలుగుదేశం భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టాలని డిసైడయ్యారు. ఆంధ్రా పార్టీ అయిన టీడీపీతో ఎలా పొత్తుపెట్టుకుంటారని, కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాలని భావిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో చక్రం తిప్పేదెవరు? 

Submitted by santosh on Fri, 11/16/2018 - 12:37

అధికారం కోసం నువ్వా, నేనా అన్న రీతిలో తలపడుతున్న ఛత్తీస్ గఢ్ లో విజయం ఎవరిని వరిస్తుంది?అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ఎవరికి వారు ప్రచారంలో దూసుకు పోతున్నా.. ఫలితంపై మాత్రం ఉత్కంఠ రేగుతోంది. కారణం అక్కడ అజిత్ జోగీ, మాయాల కూటమి బరిలోకి దిగడంతో ఏ పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం కలుగుతుందన్నది పజిల్‌గా మారింది. తొలి విడత ఎన్నికలు పూర్తి చేసుకున్న ఛత్తీస్ గఢ్ లో పోలింగ్ బహిష్కరించమన్న నక్సల్స్ పిలుపును పక్కన పెట్టి మరీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నారు.