In-Depth

పెద్దన్నకు చుక్కలు చూపించిన పసికూన... వాహ్‌ హాంకాంగ్‌ టీమ్‌ స్పిరిట్‌

Submitted by santosh on Wed, 09/19/2018 - 12:34

క్రికెట్ పసికూన టీమిండియాకు చుక్కలు చూపించింది.. చిన్నదేశం అని లైట్ తీసుకుంటే.. ఏమౌతుందో భారత టీమ్‌కు బాగా తెలిసొచ్చేలా చేసింది.. తొలిత బౌలింగ్ లోనూ.. పరుగుల వేటలోనూ విజయానికి దగ్గరై భారత్ కు ముచెమటలు పట్టించింది.. మరో పరాభవం తప్పదనుకున్న సమయంలో.. బౌలర్లు రాణించడంతో.. ఏదోలా విజయం సాధించి అమ్మయ్య అనుకుంది రోహిత్ గ్యాంగ్.. 

అందరి దృష్టి బాన్సువాడపైనే? బాద్‌షా ఎవరో మరి!!

Submitted by santosh on Wed, 09/19/2018 - 12:20

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ వీఐపీ నియోజకవర్గం.. ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణతీర్పుతో నేతలకు చుక్కలు చూపిస్తారు.. వరుసగా రెండుసార్లు గెలిపించి మూడోసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారు. ఈ నియోజవర్గం నుంచి గెలిస్తే మంత్రి పదవి ఖాయం అన్నట్లుగా.. నేతలకు అదృష్టం తలుపు తడుతుంటుంది. 

మ్యానిఫెస్టో ఎలా వండుతారు? ఎవరికి ఎంత వడ్డిస్తారు?

Submitted by santosh on Wed, 09/19/2018 - 11:46

ఒక్కో పార్టీది ఒక్కో దిక్కు. ఒక్కో సిద్దాంతం. ఒకే ఒక్క టార్గెట్‌తో ఏకమవుతామంటున్నాయి. మరి మేనిఫెస్టో మాటేంటి...ఎవరికి వారే, మ్యానిఫెస్టోలు సిద్దం చేస్తున్నామంటున్న పార్టీలు, వాటితోనే జనంలోకి వెళ్తే గందరగోళం తలెత్తదా...అందుకే ఉమ్మడి మ్యానిఫెస్టోకి రూపకల్పన చేస్తున్నామంటున్నాయి మహాకూటమి పార్టీలు. అమరవీరుల ఆశయ ఎజెండా, ప్రజా కూటమి, గెలిచేవారికే సీట్లు ఈ మూడు అంశాల ప్రాధాన్యంగా మహాకూటమి ముందుకెళ్తుందని తెలుస్తోంది. అమరవీరుల ఆశయాలే ఉమ్మడి అజెండాగా  మహాకూటమి అడుగులు వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ అంశంలో చాలా సీరియస్ గా ముందుకెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

మా ప్రాంతంలో మాదే రాజ్యం... గోండుల గోడిదే!!

Submitted by santosh on Wed, 09/19/2018 - 11:41

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు-లంబాడాల గొడవ, మరో మలుపు తిరిగింది. ఎస్టీ రిజర్వ్‌ స్థానాల్లోని రెండింటిలో, లంబాడా అభ్యర్థులనే ప్రకటించడంపై ఆదివాసీలు రగిలిపోతున్నారు. ఆదివాసీల రాజ్యంలో, లంబాడాలను నిలబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. మా రాజ్యం మా ఓట్లు మా సీట్లు మావేనంటూ, ఎన్నికల శంఖారావం పూరించారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీల ఐక్యత సదస్సు నిర్వహించి, నినాదాలు హోరెత్తించారు. ఈ సభకు భారీ ఎత్తున ఆదివాసీలు హాజరయ్యారు.

గులాబీ గూటిలో టెన్షన్‌... ఆశావహుల మాటేమిటి మరి?

Submitted by santosh on Wed, 09/19/2018 - 11:36

టీఆర్ఎస్ పార్టీ మొదటి జాబితాలో టికెట్టు లభించిన వారు  ప్రచారంలో దూసుకుపోతుంటే...ఇప్పటికీ పేర్లు ప్రకటించని 14 నియోజకవర్గాల్లోని నేతలు, తమపేరు ఎప్పుడు ప్రకటిస్తారా అని టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. అసలు టికెట్టు వస్తుందా రాదా అనే మీమాంసంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,105 నియోజక వర్గాల్లో అభ్యర్దులను ఒకేసారి ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు. ప్రతిపక్షాలు తేరుకోకముందే ప్రచారంలో దూసుకుపోవాలని ఆదేశించారు.

సర్వేల భయం కూటమిని కుదిపేస్తోందా?

Submitted by santosh on Tue, 09/18/2018 - 13:13

మహాకూటమిని సర్వేల భయం వెంటాడుతంది. ఇంకా తెగని పొత్తుల చర్చలతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇంకా తేలని సీట్ల పంపకాలతో కూటమి పార్టీలు ఆలోచనల్లో పడ్డాయి. అంతర్గత సర్వేల తర్వాతే ఒప్పందం అంటున్న నేతలు... బలమైన స్థానాలు తమవంటే తమవంటూ పట్టుపడుతున్నారు. బలమున్న స్థానాలను వదులకోవద్దన్న రాహుల్‌ దిశానిర్దేశంతో కాంగ్రెస్‌ శ్రేణులు త్యాగాలు చేయలేమంటున్నాయి. దీంతో సీట్ల పంచాయతీతో కూటమి పార్టీలు ఎవరికీ భరోసా ఇవ్వలేకపోతున్నాయి.

రంగా రక్తం ఎందుకిలా ఉడికిందసలు?

Submitted by santosh on Tue, 09/18/2018 - 12:16

విజయవాడ వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించారంటూ వచ్చిన వార్తలతో వంగవీటి రాధా వర్గం తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వాలంటూ ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. ఒక దశలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీకి!! ముందస్తులో ముందుచూపా?

Submitted by santosh on Tue, 09/18/2018 - 12:06

ముందస్తులో చాలామంది నేతలు ముందుచూపుతో ముందుకెళుతున్నారు. ముందు మందు పార్లమెంట్‌ ఎన్నికల్లో టిక్కెట్‌ వస్తుందని తెలిసినా, ముందొచ్చిన ముందస్తులో అదృష‌్టం పరీక్షించుకుందామని అనుకుంటున్నారు. కొందరు మాజీ ఎంపీలు ఎందుకైనా మంచిదని, అసెంబ్లీ పోరులో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరి ముందస్తు ఆలోచన వెనక చాలా ముందు చూపు ఉంది. ఇంతకీ ఎవరా నేతలు?

కారులో బేజారు... కాంగ్రెస్‌లో కాక! చొప్పదండిలో బాజా మోగించేదెవరు?

Submitted by santosh on Tue, 09/18/2018 - 11:59

తెలంగాణలో అన్ని నియోజవర్గాలది ఒకదారి అయితే చొప్పదండి మాత్రం మరోదారి..ప్రతిచోట టిఆర్‌ఎస్ ప్రచారం ప్రారంభించి దూసుకుపోతుంటే..ఇక్కడ మాత్రం టికెట్ కేటాయించకపోవడంతో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. టికెట్లపై క్లారిటీ లేక కాంగ్రెస్‌లోనూ కాక రేగుతోంది. అయితే ఆశావహులంతా ఎవరికివారే ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. చొప్పదండి నియోజవర్గంలో రాజకీయ పరిస్దితులపై స్పెషల్ స్టోరి.

నిఘా ఉంది.. నివేదికలొస్తున్నాయి!! హుషార్‌ తగ్గొద్దు... బేజారు కావొద్దు!!

Submitted by santosh on Tue, 09/18/2018 - 11:55

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ అభ్యర్ధులు, బలమైన ప్రత్యర్ధుల ప్రచార శైలిని గమనిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి. అభ్యర్ధుల బలాలు బలహీనతలను బేరీజు వేసి నివేదికలు సమర్పిస్తున్నాయి. అనుగుణంగా పలువురు అభ్యర్ధులు తమ ప్రచార వ్యూహన్ని మార్చుకునేలా ఆదేశాలు అందుతున్నాయి. రాష్టంలో ముందస్తు ఎన్నికల వేడి పెరిగింది. టీఆర్ఎస్ అభ్యర్ధులు ప్రచారంలో వేగం పెంచారు. విపక్షాలు ఇంకా అభ్యర్ధులను ప్రకటించకపోవడంతో ప్రచారం మొదలు కాలేదు. కాని నిఘా వర్గాలు మాత్రం తమ పనిని మొదలుపెట్టాయి.