In-Depth

గుడ్‌బై చెబుతున్న నేతలు గులాబీలో గుబులు పుట్టిస్తున్నారా?

Submitted by santosh on Wed, 11/21/2018 - 16:04

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయిన విశ్వేశ్వర్‌రెడ్డి..గులాబీ పార్టీపై విమర్శలు గుప్పించారు. అయితే త్వరలోనే పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరతారంటూ టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా మరో బాంబు పేల్చారు.
 

బాలయ్య షెడ్యూల్‌ ఏంటి.. తారక్‌ వచ్చే ఛాన్స్‌ ఉందా? 

Submitted by santosh on Wed, 11/21/2018 - 15:59

ఒకవైపు కేసీఆర్‌ ప్రచార దూకుడు పెంచారు. మహాకూటమి మాత్రం క్యాంపెయిన్‌లో వేగం పెంచలేదు. అటు కాంగ్రెస్‌ ఏమో సోనియా గాంధీ సభతో చెలరేగిపోవాలని ప్రణాళిక వేస్తోంది. ఇక టీడీపీ కూడా స్టార్‌ క్యాంపెయినర్స్‌తో, తెలంగాణ గట్టుపై సత్తా చాటాలని ఆలోచిస్తోంది. మరి టీడీపీ స్టార్  క్యాంపెయిన్స్ ఎవరు....బాలయ్య షెడ్యూల్ ఏంటి...తారక్‌ వస్తాడా? తెలంగాణ‌ అసెంబ్లీ పోరులో 13 స్థానాల్లో పోటీ చేస్తోంది తెలుగుదేశం. మ‌హాకూట‌మిలో భాగంగా గ‌తంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీతో క‌లిసి టీడిపి ప్రచార వేదిక‌ల‌ను పంచుకోనుంది.

వీరంతా లోకల్‌ అనుకుంటున్నారా? కాస్త మనసుపెట్టండి!!

Submitted by santosh on Wed, 11/21/2018 - 14:27

కమిషనర్లు వస్తుంటారు...పోతుంటారు...చంటిగాడు లోకల్‌. పక్కా లోకల్ అంటాడు ఓ సినిమాలో రవితేజ. కానీ తెలంగాణ ఎన్నికల్లో చాలామంది చంటీలు నాన్‌లోకల్. పక్కా స్థానికేతలు. తాము పుట్టింది ఒకచోటయితే, మరో నియోజకవర్గంలో పోటీపడుతున్నారు. సీఎం నుంచి పీసీసీ చీఫ్‌ దాకా ఎందరో, మరెందరో నాన్‌‌లోకల్స్. 

కమలం ఎందుకు కమిలిపోతోంది... అసంతృప్తులు నీళ్లు చల్లారనా?

Submitted by santosh on Wed, 11/21/2018 - 13:31

తెలంగాణ బిజేపి ఆశలపై ఇతర పార్టీల అసంతృప్తులు నీళ్లు చల్లారా.....? మొదటి నుంచి తమవైపు చాలా మంది వస్తరని ఆశించిన కమలం పార్టీ బంగపడిందా.....? చివరి వరకు వస్తామని ఆశ చూపిన నేతలు సైతం వెనుకడుగు వేశారా.....? ఇతర పార్టీల అసంతృప్తుల కోసం కాషయపార్టీ లిస్టులను ఆలస్యం చేసినా ఎవ్వరూ రాకపోవడంతో  పార్టీ నేతలు నిరాశ చెందారా.....? అవుననే అనిపిస్తుంది తాజ పరిణామాలు గమనిస్తే.

Tags

టీ-20 మహిళా ప్రపంచకప్‌లో ఇక సెమీస్ సమరం

Submitted by santosh on Tue, 11/20/2018 - 15:27

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 మహిళా ప్రపంచకప్ లో...సెమీఫైనల్స్ నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. సెయింట్ లూషియా స్టేడియం వేదికగా జరిగే సెమీఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ విండీస్ తో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా, గ్రూప్ -బీ టాపర్ భారత్ తో ఇంగ్లండ్ తలపడనున్నాయి. 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ లో ...తొలిదశ గ్రూప్ లీగ్ సమరానికి తెరపడటంతోనే....సెమీఫైనల్స్ నాకౌట్ ఫైట్స్ కు...కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

తెలంగాణలో సమస్యలేంటి? దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి?

Submitted by santosh on Tue, 11/20/2018 - 15:16

ఎన్నికల ప్రచారం స్పీడందుకుంది. పార్టీలన్నీ ఓట్ల వేటలో బిజీ అయిపోయాయి. కీలకమైన నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ప్రచారం పదును తేరుతోంది. నామినేషన్ల ఘట్టం పూర్తయిపోయింది కాబట్టి ఇక ప్రచారం స్పీడందుకుటోంది. అయితే ఏ పార్టీ ప్రచారం దేనిపై ఫోకస్ చేస్తుంది  అన్నది కీలకం..  ముందస్తు ఎన్నికలకు కారణమైన టిఆరెస్ అసలెందుకు  ముందస్తు కోరుకుంటోందో ప్రజలకు సమూలంగా వివరించాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. అంతేకాదు. గత ఎన్నికలలో చేసిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చారో కూడా టిఆరెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలలో కొన్ని  నేటికీ నెరవేర్చలేదు.

మహాకూటమి ఐక్యత ఎండమావేనా?

Submitted by santosh on Tue, 11/20/2018 - 15:13

తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరపడింది.. అదే నామినేషన్లు, టిక్కెట్ల కేటాయింపు ఘట్టం.. ఇక పార్టీల ముందు మిగిలినది ప్రచార పర్వం.. టిఆరెస్, వర్సెస్ మహాకూటమి మధ్య హోరా హోరీ యుద్ధంగా మారిన ఈ ఎన్నికల పర్వంలో అన్ని పార్టీలు చివరి వరకూ తమ అవకాశాలకు పదును పెట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. ముందస్తు ఎన్నికలకు పిలుపిచ్చి అందరికంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన టిఆరెస్ పార్టీ ప్రచారంలో కూడా అందరికన్నా ఓ అడుగుముందే ఉంది.. సంకల్పానికి తోడు దైవబలం ఉండాలన్న లక్ష్యంతో కేసిఆర్ ఫామ్ హౌస్ లో రెండు రోజులుగా భారీ ఎత్తున శత చండీ యాగాలు, హోమాలు నిర్వహించారు.

రాజకీయాల్లో మహిళలకిచ్చే గౌరవం ఇదేనా?

Submitted by santosh on Tue, 11/20/2018 - 15:07

స్త్రీలు-పురుషులు ఇద్దరూ సమానమే కానీ. పురుషులు కాస్త ఎక్కువ సమానమని, సినిమాలో ఓ డైలాగ్‌ ఉంది. కానీ తెలంగాణలో దాదాపు 50 నియోజకవర్గాల్లో, పురుషుల కంటే మహిళల కాస్త ఎక్కువ సమానం. కానీ రాజకీయ పార్టీలు మాత్రం మహిళా సూత్రాన్ని పాటించలేదు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు స్త్రీలకు కేటాయించిన స్థానాల్లో అతి తక్కువ స్థానాలు దక్కించుకున్నది మహిళామణులే.

కేసీఆర్‌ అమ్ములపొదిలో సంక్షేమ అస్త్రాలు

Submitted by santosh on Tue, 11/20/2018 - 15:04


తెలంగాణ ఎన్నికల సమరంలో అసలుసిసలు యుద్ధానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. యాగాల తర్వాత యోగం కలిసి వస్తుందన్న నమ్మకంతో ఖమ్మం నుంచి ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రచారక్షేత్రాన్ని పరుగులుపెట్టించారు. మహాకూటమి, చంద్రబాబు లక్ష్యంగా కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. విపక్షాలపై విమర్శల ఆయుధాలను ప్రయోగించి... అస్త్రాలకు పదునుపెట్టారు. 

లక్కుబాబులం మేము.. లక్కుబాబులం...

Submitted by santosh on Tue, 11/20/2018 - 15:00

ఆశించారు. భంగపడ్డారు. నిరీక్షించారు. నీరసపడ్డారు. ఇక చేసేదేమీ లేక గోడ దూకేద్దామని డిసైడయ్యారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీల నుంచి జంపింగ్‌ జపాంగ్‌లను ఫాలో అయిన నాయకులు చివరి నిమిషంలో టికెట్లు సాధించారు మరి గెలిచి లక్కున్న నేతలవుతారా? అందరికంటే ముందుగా గేర్లు మార్చి హైస్పీడ్‌లో దూసుకెళ్లింది కారు. వెహికల్‌ ఫుల్‌ అయ్యిందని హౌస్‌ఫుల్‌ బోర్డు కూడా పెట్టేసింది. మహాకూటమి పొత్తుల్లో, సీటు గల్లంతు అవ్వడం ఖాయమని భావించిన కొందరు కాంగ్రెస్, టీడీపీ ఆశావహులు... ప్రయత్నిస్తి పోయేదేముందని లాస్ట్‌ మినట్‌లో లక్కును పరీక్షించుకున్నారు.