Just In

ఇందారంలో ఉద్రిక్తత...బాల్కసుమన్, ఓదేలు వచ్చి, గట్టయ్య కుటుంబాన్ని...

Submitted by arun on Wed, 09/19/2018 - 11:01

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. ఓదేలుకు టికెట్‌ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న టీఆర్‌ఎస్‌ నేత గట్టయ్యకు ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే, బాల్కసుమన్, ఓదేలు వచ్చి.. గట్టయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టమైన హామీ వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేదిలేదని బంధువులు అంటున్నారు. గట్టయ్య ఇద్దరు పిల్లలకు చెరో ఇరవై లక్షలు ఇవ్వడంతో పాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.   

ప్రణయ్‌ హత్య తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్న ప్రేమజంటలు

Submitted by arun on Wed, 09/19/2018 - 10:52

తీవ్ర సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణ‍య్‌ హత్యతో ప్రేమజంటలు భయాందోళనలకు గురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకొచ్చారు. ప్రణయ్ మర్డర్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రేమజంటలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రణయ్‌ హత్య తర్వాత ఆందోళనకు గురైన ఓ ప్రేమజంట మీడియా ముందుకొచ్చింది. కులాంతర వివాహం చేసుకున్నందుకు మూడు నెలలుగా తమ బంధువులు బెదిరిస్తున్నారంటూ నవ దంపతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

న్యాయం కోసం పోలీస్ స్టేష్టన్ కు వెళ్లిన మహిళను ట్రాప్ చేసిన సీఐ

Submitted by arun on Wed, 09/19/2018 - 10:37

లైగింకగా వేధింపు ఆరోపణలు ఎదుర్కోంటున్న వాల్మీకిపురం సీఐ సిద్ధ తేజమూర్తిపై సస్పెన్షన్ వేటు పడింది. న్యాయం కోసం పోలీస్ స్టేష్టన్ కు వెళ్లిన తనను ట్రాప్ చేసిన సీఐ.. వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. తిరుమల కొండపై రూం బుక్ చేశానని తన వద్దకు రావాలంటూ ఫోన్ లో వేధింపులకు గురిచేశాడని బాదితురాలు ఫిర్యాదు చేసింది. సీఐ ఫోన్ కాల్ ను రికార్డు చేసింది. దీంతో  విచారణ జరిపిన కర్నూలు డీఐజీ సీఐను సస్పెండ్ చేశారు.

Tags

తేల్చి చెప్పిన అధిష్ఠానం.. రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించనున్న రాధా

Submitted by arun on Wed, 09/19/2018 - 10:29

బెజవాడలో మరోసారి పొలిటికల్‌ హీట్ పెరిగింది. విజయవాడ సెంట్రల్‌ సీటుపై ఆశలు పెట్టుకున్న వంగవీటిని కాదని మల్లాది విష్ణుకు కేటాయించడంతో వైసీపీలో అసమ్మతి మళ్లీ భగ్గుమంది. అయితే సెంట్రల్‌ వద్దంటున్న పార్టీ తూర్పును ఆఫర్‌ చేసింది. మరి వైసీపీపై తిరుగుబావుటా ఎగురవేస్తారా..? లేక అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతారా..? వంగవీటి రాధా భవిష్యత్‌ ప్రణాళిక ఏంటి..? 

హత్య కేసులో కొత్త కోణాలు

Submitted by arun on Wed, 09/19/2018 - 10:18

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యకేసు మిస్టరీ వీడింది. ప్రణయ్ హత్యకు ప్లాన్ చేసిన ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. నిందితులు దొరకడంతో హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. ప్రణయ్ హత్యకు రెండు సార్లు యత్నించి విఫలమైనట్లు పోలీసులు తేల్చారు. అంతేకాదు..అమృతకు అబార్షన్ చేయించేందుకు కూడా ఆమె తండ్రి విఫలయత్నం చేశాడు.

ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి మారుతీరావు మాస్టర్ ప్లాన్...దృశ్యం సినిమా తరహా ...

Submitted by arun on Wed, 09/19/2018 - 10:03

ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి అమృత తండ్రి మారుతీరావు మాస్టర్ ప్లానే వేశాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. మారుతీరావు తమ్ముడు, కారు డ్రైవర్‌కు త్వరగా బెయిల్ వచ్చేఅవవాశముందని పోలీసులు చెప్పడంపై అమృత అభ్యంతరం వ్యక్తం చేసింది. బాబాయ్ బయటికి వస్తే తనకు ప్రాణహాని ఉందని అంటోంది. 

నాకు తప్పుడు వాగ్థానాలు ఇచ్చే అలవాటు : రాహుల్ గాంధీ

Submitted by nanireddy on Wed, 09/19/2018 - 09:53

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న(కర్నూల్) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చేతకాని హామీలతో అధికారంలోకి వచ్చిన మోడీ.. ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. తనకు అలాంటి తప్పుడు వాగ్థానాలు ఇచ్చే అలవాటు లేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలతో పోల్చితే తమ ప్రభుత్వంలో ప్రజలకు చాలా  మేలు జరిగిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు సవసరమైన సంక్షేమ పథకాలు వచ్చాయని అన్నారు. విభజన నిందను తమపై రుద్ది అధికార టీడీపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు…అలాగే రాష్ట్రంలో బాధ్యతలేని ప్రతిపక్షం ఉందని పరోక్షంగా వైసీపీ ని ఉద్దేశించి విమర్శించారు.

చిత్తూరులో భూకంపం..

Submitted by nanireddy on Wed, 09/19/2018 - 09:43

చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. ఐరాల మండలం ఐకె రెడ్డిపల్లిలో అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించడంతో  ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే భారీ శబ్దాలు రావడంతో గ్రామస్థులు భయాందోళనతో ఎక్కడెక్కడికో పరుగులు తీశారు. అర్ధ రాత్రి వేళ ఓ పక్క వర్షం,మరో పక్క భూకంపం భయంతో గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.  మరలా మరోసారి భూకంపం వస్తుందేమోనని గ్రామస్థులు హడలిపోతున్నారు. కాగా ఈ ఘటనపై అధికారులు స్పందించినట్టు తెలుస్తోంది. ఇది సాధారణమైనదేనని పెద్దగా భయాందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. 

సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 19:14

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. నగరి నియోజకవర్గం కల్లూరులో పర్యటించిన రోజా.. 'రావాలి జగన్, కావలి జగన్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలుచేస్తామని ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. నిత్యం ప్రజలను మోసం చేస్తూ అధికార దుర్వినియోగంతో చంద్రబాబు ప్రజల జీవితాల్లో చీకట్లు నింపారని ఆరోపించారు. కుమారుడు లోకేష్ ఆస్తులు పెంచుకుంటూ.. రాష్ట్రాన్ని 2.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆమె విమర్శించారు.

ప్రణయ్ హత్య కేసు : హంతకుడిని పట్టుకున్న పోలీసులు

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 19:04

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు హంతకుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ ను చంపింది బీహార్ కు చెందిన సుభాష్ శర్మగా పోలీసులు గుర్తించారు. మారుతీరావు దగ్గర 15 లక్షలు సుపారీ తీసుకుని ప్రణయ్ ను సుభాష్ శర్మ అంతమొందించినట్లు విచారణలో  వెల్లడైంది. ప్రణయ్ హత్య కేసును కుట్రను ఛేదించిన నల్లగొండ పోలీసులు నిందితుడు సుభాష్ శర్మను బీహార్ లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పాట్నా నుంచి నల్గొండకు తరలిస్తున్నారు. రేపు సుభాష్ శర్మను హైదరాబాద్ తీసుకువచ్చి అక్కడి నుంచి నల్లగొండకు తీసుకెళ్తారని తెలుస్తోంది.