Just In

హత్యకు ముందు కిడారి కారును రౌండప్ చేసిన మావోయిస్టులు...

Submitted by arun on Tue, 09/25/2018 - 13:07

కిడారి సర్వేశ్వర్రావ్‌, సివేరి సోమ హత్యలకు ముందు ఏం జరిగిందనే దానిపై ప్రత్యేక అధికారుల దర్యాప్తు బృందం కీలక ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటికే ఓ వీడియోను విడుదల చేసిన పోలీసులు.. తాజాగా మరో వీడియో ఫూటేజిని మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలో కిడారి కారును.. మావోయిస్టులు చుట్టుముట్టి రౌండప్‌ చేశారు. అదేసమయంలో ఆయన్ని కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది.  ఆయన వాహనాన్ని సుమారు 20 మంది మావోయిస్టులు నిలిపి, దాని చుట్టూ నిలబడటం ఇందులో కనిపిస్తోంది. ఆపై ఆయన్ను కారు నుంచి బలవంతంగా దించి లాక్కెళ్ళారు. 

గులాబీ గూటిలో గుబులు...105 మంది అభ్యర్థుల్లో మార్పులు?

Submitted by arun on Tue, 09/25/2018 - 12:45

ఏకబిగిన 105 మంది అభ్యర్ధుల‌ను ప్రక‌టించిన గులాబీబాస్... కొందరిని మార్చబోతున్నారా? అందుకే అంతర్గత సర్వేలు చేయిస్తున్నారా? అభ్యర్ధుల ప‌నితీరు తెలుసుకునేందుకు కొంత‌మంది ముఖ్య నేత‌ల‌కు బాధ్యత‌లు అప్పగించారా? తాజాగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ఎమ్మెల్సీ ప‌ల్లా మాట్లాడిన మాట‌ల వెనుక అసలు మర్మమేంటి? 

కేసీఆర్ కు కొండా సురేఖ బహిరంగ లేఖ...

Submitted by arun on Tue, 09/25/2018 - 12:22

టీఆర్ఎస్‌లో తాము హరీశ్‌రావు వర్గం అని కొండా సురేఖ దంపతులు తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌ పై తిరుగుబావుటా ఎగురవేసిన కొండా దంపతులు పార్టీ అధినేత కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనపై ఆమె డైరెక్ట్‌ అటాక్‌ చేసింది. తీవ్ర విమర్శలు చేసిన ఆమె వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించాలని తెలంగాణ ప్రజలను కోరింది. తాము హరీశ్‌రావు వర్గం అని చెప్పుకొచ్చిన ఆమె పార్టీలో ఆయన పరిస్థితి ఏంటో ఇటీవలే చూశారంటూ వ్యాఖ్యానించింది. 

నేర చరిత్ర ఉన్న నేతలకు సుప్రీం ఝలక్

Submitted by arun on Tue, 09/25/2018 - 12:16

నేరారోపణలు, ఆర్థిక నేరాభియోగాలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సుప్రీం ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తెలిపారు. వచ్చే నెల 2 న పదవీ విరమణ చేయనున్న దీపక్ మిశ్రా కీలక కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆ రెండు పథకాలు ఆగిపోతాయా?

Submitted by arun on Tue, 09/25/2018 - 11:52

తెలంగాణలో ఆ రెండు పథకాలకు బ్రేక్‌ పడనుందా? ముందస్తు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్కీమ్‌లకు స్కెచ్‌ వేయనుందా? అన్ని సర్కారీ పథకాల మాదిరిగానే ఈ రెండింటికి కూడా ఎన్నికల కోడ్ అడ్డొవస్తోందా? ఎన్నికల ముందు ఆ పథకాలపై అపద్ధర్మ ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది? ఇంతకీ ఆ రెండు పథకాలేంటి? అడ్డొచ్చే అంశాలేంటి?

ఏపీలో కలిపిన 7 మండలాల ఓటర్లపై క్లారిటీ

Submitted by arun on Tue, 09/25/2018 - 11:32

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాల ఓటర్లపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక, బూర్గంపాడు మండలాలను ఏపీలో కలుపుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఈ ఏడు మండలాల ఓటర్లపై రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనంటూ కాంగ్రెస్‌ పార్టీ కోర్టును ఆశ్రయించంతో ఉమ్మడి హైకోర్టు నిన్న తీర్పు వెలువరించనుంది.

అరకు దాడిలో పారిపోయిన ఆ ఇద్దరు ఎవరు...కీలక ఆధారాలను సేకరించిన దర్యాప్తు బృందం

Submitted by arun on Tue, 09/25/2018 - 11:16

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావ్‌, మాజీ ఎమ్మెల్యే శివారి సోమ హత్యలపై ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. కీలక ఆధారాలను సేకరించిన అధికారులకు.. ఓ వీడియో ఫూటేజ్‌ లభించింది. దీంట్లో జంట హత్యల తర్వాత ఇద్దరు వ్యక్తులు పారిపోతున్నట్లు కనిపించింది. దీంతో ఆ ఇద్దరు ఎవరన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట హత్యల్లో కీలక పాత్ర పోషించారా..? లేక మావోయిస్టు దళ సభ్యులా అని విచారిస్తున్నారు. 

ఏ అమరుడు చెప్పాడని కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు: కేటీఆర్‌

Submitted by arun on Tue, 09/25/2018 - 11:04

ఢిల్లీ గులాములుగా ఉండాలా? అమరావతి బానిసల్లా ఉండాలా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన తరుణమిదన్నారు మంత్రి కేటీఆర్‌. అమరవీరుల గురించి మాట్లాడుతున్న కోదండరామ్‌... ఏ అమరుడు చెప్పాడని కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. రైతులను కాల్చి చంపిన రాబందులు ఒక్కటయ్యాయన్న కేటీఆర్‌... టీఆర్‌ఎస్‌... మోడీకో, రాహుల్‌కో భయపడే పార్టీ కాదన్నారు.

మహాకూటమిలో భగ్గుమన్న విభేదాలు...ఆదిలోనే తప్పుకునే ప్రయత్నంలో ...

Submitted by arun on Tue, 09/25/2018 - 10:55

కేసీఆర్‌కు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న మహాకూటమిలో అప్పుడే విభేదాలు భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పొత్తును ముఖ్యంగా తెలంగాణ జనసమితిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మహాకూటమి సమావేశాలకు కోదండరామ్‌ దూరంగా ఉంటూ వస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కూటమిలోకి టీడీపీ రావడానికి వ్యతిరేకిస్తున్న టీజేఎస్‌ పెద్దలు చర్చల్లో పాల్గొనేందుకు ముఖం చాటేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌ సైతం ఎటూ తేల్చకపోవడంతో మరో ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరిన పెట్రోల్ ధర...సెంచరీ దిశగా దూసుకుపోతున్న...

Submitted by arun on Tue, 09/25/2018 - 10:31

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. త్వరలోనే సెంచరీ దాటనున్నాయి. గత కొంత కాలంగా సామాన్యుడి నడ్డివిరుస్తున్న పెట్రోల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొదటిసారిగా లీటర్‌ పెట్రోల్‌ ధర 90 రుపాయిల మార్క్‌ను దాటి రికార్డ్‌ సృష్టించింది. ముంబైలో ఐవోసీ ఔట్‌లెట్లలో లీటర్‌ పెట్రోల్‌ ధర 90రూపాయిల 8పైసలకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 5 పైసలు పెంచాయి.