Just In

2019 సెలవులు ఇవే..

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 20:46

వచ్చే  సంవత్సరానికి(2019) కి ప్రభుత్వ సెలవులను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుతం. ఈ మేరకు సాధారణ, ఇచ్చిక సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో 23 సాధారణ సెలవులు, 15 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రకటించిన ఈ సెలవుల్లో ఏడు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. పండుగల్లో శ్రీరామనవమి, దీపావళి, దుర్గాష్టమి, ఈద్‌ మిలాద్‌ నబీ ఆదివారం రోజున వచ్చాయి. ఇక రిపబ్లిక్‌ డే, శ్రీ కృష్ణాష్టమి నాలుగో శనివారం వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ సెలవుల జాబితా ఇలా ఉంది. 

వెయ్యి కిలోల కుక్క మాంసం పట్టుకున్న అధికారులు

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 20:12

తమిళనాడులో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ పార్శిల్‌ లో దాదాపు 1000 కిలోల కుక్కమాంసం బయటపడింది. ఈ ఘటన ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో వెలుగుచూసింది. రైల్వే స్టేషన్ లోని ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఓ భారీ అనుమానాస్పద పార్శిల్‌ ను ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులతో రైల్వే స్టేషన్ కు వచ్చిన పోలీసులు ఆ పార్సిల్ ను తెరచి చూశారు. అందులో మాంసం కనిపించేసరికి వారు షాక్ కు గురయ్యారు. దాదాపు 1000 కిలోల కుక్క మాంసంగా భావించిన ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులు పరీక్షల నిమిత్తం దానిని ల్యాబ్‌కు తీసుకువెళ్లారు.

ఇండో-పాక్ యుద్ధ వీరుడు కుల్దీప్ సింగ్ కన్నుమూత

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 19:53

1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాక్ సైన్యంపై వీరోచిత పోరాటం చేసిన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చంద్రపురి (78) మృతి చెందారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ చికిత్స కోసం కుల్దీప్ సింగ్ పంజాబ్‌ మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించి మృతిచెందారని వైద్యులు వెల్లడించారు. అయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు ఆయన ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నారు. రాజస్థాన్‌లోని లాంగేవాలా బోర్డర్ పోస్టును పాక్ సైనికుల నుంచి కాపాడారు.

కాక మీదున్నా కాంగ్రెస్ నేతలు.. రెబల్స్ గా బరిలో

Submitted by chandram on Sat, 11/17/2018 - 19:40

కాంగ్రెస్ నేతలు కాక మీదున్నారు. సీట్లు దక్కకపోవడంతో అసంతప్తితో రగిలిపోతున్నారు. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండిచ్చింది. మహాకూటమి అభ్యర్థులకు పోటీగా రెబల్స్ గా బరిలో నిలిచేందుకు నేతలు సిద్ధమయ్యారు. నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం పెద్దలను రంగంలోకి దించబోతుంది. మహాకూటమితో జోరుమీదున్న కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కూటమి పొత్తులో పలువురి కాంగ్రెస్ నేతల సీట్లు గల్లంతయ్యాయి. చివరి వరకు టికెట్ వస్తుందని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పలేదు. సీటు దక్కించుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు.

ఫేస్‌బుక్‌ సీఈఓకు మళ్ళీ తలనొప్పి

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 19:26

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు సంబంధించిన ఓ వార్త తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. సీఈఓ పదవి నుంచి జుకర్ బర్గ్ తప్పుకోవాలని సంస్థ పెట్టుబడిదారులు కోరుతున్నారని తెలుస్తోంది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ, పబ్లిక్‌ అఫైర్స్‌తో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెట్టుబడిదారులు జుకర్‌బర్గ్‌ తప్పుకోవాలని పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

రేపటి నుంచి యాగాలు చేయనున్న కేసీఆర్..

Submitted by chandram on Sat, 11/17/2018 - 19:23

తిరిగి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టాలని, ఘనమైన మేజరీటీ రావాలని, రాజయోగం రావాలని రేపటి నుంచి కేసీఆర్ యాగాలు చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల పాటు రాజా శ్యామల చండీహోమం, చండీ సహిత రుద్ర హోమంను చేయనున్నారు. యాగ కార్యక్రమాలల్లో భాగంగా ఇప్పటికే, ఎర్రవెల్లి గ్రామస్థులు గ్రామ దేవతలకు పూజలు చేశారు. రేపు ఉదయం నుండి కెసిఆర్ దంపతులు పూజలు నిర్వహించనున్నారు.
 

టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు ఝలక్

Submitted by chandram on Sat, 11/17/2018 - 19:06

విజయవాడలో స్వాతంత్ర సమరయోధుడి భూకబ్జా కేసు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయింది. బోండా ఉమపై కేసు నమోదు చేయాలని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.  పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడాన్నితప్పుబట్టిన హైకోర్టు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐకి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. బోండా ఉమ వల్ల తనకు ప్రాణహాని ఉందని గతంలో బాధితుడు కోటేశ్వరరావు  పోలీసులను ఆశ్రయించాడు. బోండా ఉమ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోటేశ్వరరావు కోర్టును ఆశ్రయించాడు.

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మోడీ, అమిత్ షా..

Submitted by chandram on Sat, 11/17/2018 - 18:54

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో అమిత్ షా. డిసెంబర్ 3,5 తేదీల్లో ప్రధాని మోడీ తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మోడీ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనే విధంగా తెలంగాణ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఎట్టకేలకు టీజేఎస్‌ తొలి జాబితా

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 18:45

వారాలతరబడి చర్చల అనంతరం మహాకూటమిలో భాగస్వామి అయిన తెలంగాణ జనసమితి పార్టీ ఎట్టకేలకు అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియాతో భేటీ అయిన కోదండరాం తుది చర్చలు జరిపారు. అనంతరం నలుగురుతో కూడిని తొలి జాబితాను విడుదల చేశారు.  వారిలో 

టీజేఎస్‌ తొలి జాబితా ఇదే.. మల్కాజిగిరి : దిలీప్‌ కుమార్‌ కపిలవాయి, మెదక్‌: జనార్ధన్‌ రెడ్డి దుబ్బాక: చిందం రాజ్‌ కుమార్‌, సిద్దిపేట: భవాని రెడ్డి.

తెలిసీ తెలియకుండా మాట్లాడకూడదని వెళ్ళిపోయా : జగన్

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 18:39

గతనెల 25న విశాఖ ఎయిర్పోర్టులో ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు ఈ దాడి గురించి వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. తాజగా పాదయాత్రలో భాగంగా పార్వతీపురం బహిరంగసభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్బంగా తనపై జరిగిన దాడి విషయంపై మొదటిసారి స్పందించారాయన.. విశాఖ ఎయిర్పోర్టులో తనపై హత్యా యత్నం జరిగింది. ఈ దాడిని నేనే చేయించుకున్నానని, దాడి చేసిన వ్యక్తి(శ్రీనివాసరావు) వైసీపీకి చెందిన వ్యక్తేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడం బాధేసిందని అన్నారు.