Just In

మహాకూటమిలో పట్టుబట్టి 14 సీట్లు దక్కించుకున్న టీడీపీ చివరకు...

Submitted by arun on Mon, 11/19/2018 - 17:50

మహాకూటమిలో పట్టుబట్టి 14 సీట్లు దక్కించుకున్న టీడీపీ చివరకు 13 స్ధానాలకే పరిమితమైంది. చివరి నిమిషం వరకు అభ్యర్ధులను ప్రకటించకపోవడంతో  పఠాన్ ‌చెరుకు అభ్యర్ధి ఖరారు కాలేదు. దీంతో 13 స్ధానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇదే స్ధానం నుంచి కాంగ్రెస్ బరిలోకి దిగింది. పొత్తులో భాగంగా స్ధానం కేటాయించిన పోటీ చేయక పోవడంపై  స్ధానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి నందీశ్వర్ గౌడ్ పార్టీ టికెట్ ఆశించారు. ఇందుకోసమే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అయినా ఫలితం దక్కలేదు. అయితే ప్రజా కూటమి ప్రయోజనాల కోసమే పోటీ చేయలేదని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు.

Tags

మహాకూటమికి కేటాయించిన స్ధానాల్లో కాంగ్రెస్ పోటీ

Submitted by arun on Mon, 11/19/2018 - 15:52

కాంగ్రెస్‌లో ఓ వైపు  బుజ్జగింపులు కొనసాగుతుండగానే మరో వైపు స్నేహపూర్వక పోటీలను నేతలు సిద్ధమయ్యారు . మహాకూటమి పొత్తుల్లో 94 స్ధానాల్లో పోటీ చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు 99 మంది నామినేషన్లు దాఖలు చేసింది. మహాకూటమిలోని ఇతర పక్షాలు పోటీ చేస్తున్న ఐదు స్ధానాల్లో అభ్యర్ధులను పోటీకి దించింది.  దుబ్బాక, మిర్యాలగూడ, వరంగల్‌ ఈస్ట్‌లో కాంగ్రెస్‌ వర్సెస్‌ టీజేఎస్‌గా పరిస్ధితి మారింది. మరో వైపు టీజేఎస్ తనకు కేటాయించిన ఎనిమిది స్ధానాలకు అదనంగా మరో 5 చోట్ల అభ్యర్ధులకు బీఫాంలు జారీ చేసింది.  

సిరిసిల్లలో నామినేషన్ వేసిన కేటీఆర్

Submitted by arun on Mon, 11/19/2018 - 14:59

సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సీనియర్ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. సిరిసిల్ల నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కేటీఆర్ నామినేషన్ పత్రాలను నియోకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావుకు అందజేశారు. అంతకుముందు సిరిసిల్లలో మంగళవారం సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మార్పులు చేర్పులపై స్థానిక నేతలకు సూచనలు చేశారు. కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

Tags

మళ్లీ నామినేషన్ వేసిన వేణుమాధవ్!

Submitted by arun on Mon, 11/19/2018 - 14:43

సూర్యాపేట జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా కమెడియన్‌ వేణుమాధవ్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం నామినేషన్‌ వేయడానికి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి రాగా ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో సోమవారం మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతు దారులతో వచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను ఆయన సమర్పించారు. కోదాడ తన స్వస్థలం కావడంతో ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నట్లు వేణుమాధవ్‌ తెలిపారు. గురువారం వేణుమాధవ్ నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. సరైన వివరాలు లేవని, నామినేషన్ చెల్లదని తెలిపారు.

బండ్ల గణేశ్‌కు కీలక పదవి!

Submitted by arun on Mon, 11/19/2018 - 14:01

పవన్‌ కల్యాణ్‌ వీరాభిమానిగా చెప్పుకునే సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. పలు టీవీ చానళ్లలో హడావుడి చేస్తూ ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, రాజేంద్ర నగర్‌ టికెట్‌ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హస్తం పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బండ్ల గణేష్‌కు ఆ పార్టీ మొండిచెయ్యి చూపింది. రాజేంద్రనగర్ సీటు ఆశించిన బండ్ల గణేష్‌కు మహా కూటమి రూపంలో నిరాశ ఎదురైంది. పొత్తులో భాగంగా రాజేంద్ర నగర్ టికెట్ టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తాకు దక్కింది.

‘తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదు’

Submitted by arun on Mon, 11/19/2018 - 13:43

జేఏసీగా ఉన్న రోజుల్లోనే రాజకీయ పార్టీపై సమాలోచనలు చేశామన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన అనేక మంది మేధావులతో తమ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పారు. నిరంకుశ పాలనను అంతమొందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదని, అది తొలిమెట్టని అన్నారు. తెలంగాణలో తాము ఆశించేది సామాజిక మార్పు అని కోదండరామ్‌ స్పష్టం చేశారు. ప్రజలకోసం పోరాడగలిగే కొత్తతరం నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థుల గెలుపుపై పూర్తి విశ్వాసం ఉందని కోదండరాం ఆశాభావం వ్యక్తం చేశారు.

మటన్ పేరుతో కుక్క మాంసాన్ని అమ్ముతున్న కల్తీగాళ్లు

Submitted by arun on Mon, 11/19/2018 - 13:33

మాంస ప్రియులకు మటన్ అంటే మక్కువ ఎక్కవ సండే వచ్చినా, ఇంటికి నలుగురు చుట్టాలొచ్చినా తినాలన్న కోరికి పుట్టినా, తినే అవకాశం వచ్చినా ఏమాత్రం ఆలోచించరు మటన్ షాపుల ముందు క్యూలు కడతారు హోటళ్లలో బిర్యానీలు లాగించేస్తారు ఇక రోడ్డు పక్కన నలబైకి, అరవైకి దొరికే మటన్ కర్రీలను కూడా కుమ్మేస్తుంటారు. 

Tags

అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చిన రాజకీయ పార్టీలు

Submitted by arun on Mon, 11/19/2018 - 13:22

రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చాయని ఇప్పటివరకు జరిగిన టికెట్ల కేటాయింపు లెక్కలు చెపుతున్నాయి. ఒక్క బహుజన లెఫ్ట్‌ పార్టీ, సీపీఎం కూటమి బీఎల్‌ఎఫ్‌ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తాము ప్రకటించిన స్థానాల్లో అత్యధికం ఓసీలకే ఇచ్చాయి. అధికార టీఆర్‌ఎస్‌ 119 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, అందులో 58 అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇక, మహాకూటమి పక్షాన ప్రకటించిన 118 స్థానాల్లో 49 సీట్లు ఓసీలకు ఇచ్చారు. బీజేపీ కూడా 118 స్థానాల్లో 46 ఓసీలకే కేటాయించింది.

నేడు కోల్‌కతాకు ఏపీ సీఎం చంద్రబాబు

Submitted by arun on Mon, 11/19/2018 - 12:54

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కోల్‌కతా వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే పలువురు జాతీయ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు వెళ్లనున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు, సానుకూలతపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. జనవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న భారీ ర్యాలీ, ఢిల్లీలో ఈనెల 22న నిర్వహించనున్న బీజేపీయేతర పక్షాల విందు సమావేశంపైనా భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

నామినేషన్ల ఘట్టం.. నేటితో సమాప్తం..

Submitted by arun on Mon, 11/19/2018 - 12:36

ఉత్కంఠను అంతకుమించి ఆసక్తిని రేపిన తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం అయిన నామినేషన్ల పర్వం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నెల 12 న మొదలైన నామినేషన్ల పర్వం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడానికి భారీగా అభ్యర్థులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

నిన్న రాత్రి వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధాన పార్టీలన్నీ తలమునకలయ్యాయి. ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎవరిని దించాలన్న దానిపైనా ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. చివరి నిమిషంలో బీ ఫామ్స్‌ ఇచ్చే అవకాశాలుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.