Just In

టీడీపీ తొమ్మిది మందితో తొలి జాబితా ఇదే..!

Submitted by nanireddy on Tue, 11/13/2018 - 06:42

ఎట్టకేలకు మహాకూటమిలో భాగస్వామి అయిన టీడీపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. 
మొదటినుంచి కూకట్ పల్లి అసెంబ్లీ బరిలో ఉన్నారని భావించిన పెద్దిరెడ్డి పేరు ఇందులో లేదు. అలాగే ఖైరతాబాద్ పేరు కూడా లేకపోవడం గమనార్హం. 


మహబూబ్‌నగర్‌:    ఎర్ర శేఖర్‌
ఉప్పల్‌:               తూళ్ల వీరేందర్‌ గౌడ్‌
శేరిలింగంపల్లి:       భవ్య ఆనంద్‌ ప్రసాద్‌
మలక్‌పేట:          ముజఫర్‌ అలీ ఖాన్‌ 

బ్రేకింగ్ : 65 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా ..కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..

Submitted by nanireddy on Tue, 11/13/2018 - 06:37

1. సిర్పూర్‌    – డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు  
2. చెన్నూరు(ఎస్సీ)    – డా. వెంకటేశ్‌ నేత బోర్లకుంట
3. మంచిర్యాల     – కె.ప్రేమ్‌సాగర్‌రావు
4. ఆసిఫాబాద్‌(ఎస్టీ)    – అత్రం సక్కు
5. ఆదిలాబాద్‌    – సుజాత గండ్రాత్‌
6. నిర్మల్‌    – ఆలేటి మహేశ్వర్‌రెడ్డి
7. ముథోల్‌    – రామారావ్‌ పటేల్‌ పవార్‌
8. ఆర్మూర్‌    – ఆకుల లలిత
9. బోధన్‌    – పి.సుదర్శన్‌రెడ్డి
10. జుక్కల్‌ (ఎస్సీ)    – ఎస్‌.గంగారాం
11. బాన్సువాడ    – కాసుల బాల్‌రాజు
12. కామారెడ్డి    – షబ్బీర్‌ అలీ
13. జగిత్యాల    – జీవన్‌ రెడ్డి

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి

Submitted by chandram on Mon, 11/12/2018 - 18:02

ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం రణక్షేత్రంలా మారింది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడంతో సీట్ల సర్దుబాట్లు, చర్చలు జరుగుతున్న సమయంలోనే పార్టీ ఆఫీస్‌ దగ్గర మాత్రం సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ను తలపిస్తోంది. నినాదాలు, గొడవలతో దద్దరిల్లుతోంది. దీంతో వరుసగా ఐదో రోజు కూడా గాంధీభవన్‌కు తాళాలు వేయాల్సి వచ్చింది. గాంధీభవన్‌ దద్దరిల్లుతోంది. ఆశావహుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. టిక్కెట్ల కోసం జరుగుతున్న నిరసనలతో హోరెత్తుతోంది. గత ఐదు రోజుల నుంచి గాంధీభవన్‌ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి.

అభివృద్ధిని చూసి ఓటెయ్యాలంటూ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపు

Submitted by chandram on Mon, 11/12/2018 - 17:52

నాయకులను కాకుండా అభివృద్ధిని చూసి ఓటెయ్యాలంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి లక్ష్మారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజాపూర్‌ మండలం పొట్లపల్లి, గుండ్లపొట్లపల్లి, కల్లేపల్లితో పాటు గిరిజన తండాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డప్పు వాయిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకే ఓటెయ్యాలని మంత్రి లక్ష్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 
 

వైసీపీ కోడికత్తి పార్టీగా మారింది

Submitted by arun on Mon, 11/12/2018 - 17:32

వైసీపీ కోడికత్తి పార్టీగా మారిపోయిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. కోడికత్తి దాడి నుంచి సానుభూతి పొందాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. చిన్న గాయం కాబట్టే ట్రీట్మెంట్‌ చేయించుకోకుండా జగన్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా... ప్రజలు మాత్రం చంద్రబాబు వెంటే ఉన్నారని అన్నారు.

ఉమ్మడి అజెండాపై మహా కూటమి ఫోకస్‌

Submitted by chandram on Mon, 11/12/2018 - 17:31

అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి మహాకూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టారు. ఉమ్మడి అజెండాతోనే కూటమి పార్టీలన్నీ ప్రచారం చేయాలని నిర్ణయించాయి. ఎన్నికల మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై చర్చించిన కూటమి పార్టీలు ముసాయిదాపై అంగీకారానికి వచ్చాయి. మరోసారి చర్చించి రేపే ఉమ్మడి అజెండాను ప్రకటించనున్నట్లు కూటమి నేతలు తెలిపారు. సీట్ల సర్దుబాటు అంశం ప్రాథమికంగా ఓ కొలిక్కి రావడంతో కూటమి పార్టీలు ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టాయి.

'మేడే' రోజున సెలవెందుకు?

Submitted by chandram on Mon, 11/12/2018 - 17:18

వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి సంచలనంగా నిలిచాడు త్రిపుర సిఎం విప్లవ్ దేవ్. ప్రపంచకార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా 'మేడే1' నిర్వహించుకుంటాం. అయితే మేడే దినోత్సవం సందర్భంగా ప్రపంచదేశాలు, కార్మికులకు, ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటిస్తారు, కాగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విప్లవ్ మాట్లాడుతూ మేడే రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు, మీరేమీ కార్మికులు కాదు, కార్మాగాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే కూలీలకు మాత్రమే ఈ మేడే సెలవు దినం వర్తిస్తుందన్నారు. ఈఏడాది నుండి సర్కార్ ఉద్యోగులకు మేడే రోజు సెలవు ఉండదని స్ఫష్టం చేశారు.

బాలికను గర్భిణిని చేసిన సూపరింటెండెంట్‌..

Submitted by arun on Mon, 11/12/2018 - 17:15

తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం సూపరిండెంట్ నందగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వసతి గృహంలోని బాలికపై అత్యాచారం చేసినట్టు నిర్దారణ కావడంతో అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కడప జిల్లాకు చెందిన బాలిక వసతి గృహంలో ఉంటూ చదువుకుంటూ ఉండగా నందగోపాల్ అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగుచూసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు  వైద్య పరీక్షల అనంతరం 58 ఏళ్ల నందగోపాల్‌ను నిందితుడిగా చేర్చారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  
 

11 స్థానాలకు టీటీడీపీ అభ్యర్ధులు దాదాపు ఖరారు

Submitted by arun on Mon, 11/12/2018 - 17:01

11 స్థానాలకు టీడీపీ అభ్యర్ధులు దాదాపు ఖరారు అయ్యారు. అయితే అభ్యర్ధులను రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మచ్చ నాగేశ్వర్రావు, వరంగల్‌ వెస్ట్‌ నుంచి రేవూరి ప్రకాష్‌రెడ్డి పోటీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే మక్తల్‌ నుంచి కొత్తకోట దయాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి ఎర్ర శేఖర్, ఉప్పల్ నుంచి వీరేందర్‌ గౌడ్‌, శేరిలింగంపల్లి నుంచి భవ్య ఆనంద్ ప్రసాద్‌, కూకట్‌పల్లి నుంచి పెద్దిరెడ్డి, నిజామాబాద్‌ రూరల్ నుంచి మండవ వెంకటేశ్వర్రావు పోటీ చేస్తారని అంటున్నారు.

తెలంగాణలో మొదలైన నామినేషన్ల పర్వం

Submitted by chandram on Mon, 11/12/2018 - 16:51

తెలంగాణలో నోటిఫికేషన్‌ వెలువడిన తొలి రోజే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇందిరాపార్క్ సమీపంలోని  గణపతి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్‌కు బయలుదేరారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, సీనియర్ నేతలు, ఎంపీల నడుమ ర్యాలీకి వెళ్లి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో గడచిన నాలుగున్నరేళ్లలో బీజేపీయే ప్రతిపక్ష పాత్ర పోషించిందని ప్రజలు తమ వైపే ఉన్నారని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.