Kerala floods

కేరళ కోలుకుంటున్న వేళ!

Submitted by arun on Mon, 08/20/2018 - 11:07

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ,

అత్యవసర సర్వీసులను ప్రారంబించల్సిన వేళ ,

దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను రిపేర్లు చేయాల్సిన నేల,
 
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తిసుకుంటున్నారు చాల. శ్రీ.కో. 

కేరళ వరదల సాయంలో రియల్ హీరో...

Submitted by arun on Mon, 08/20/2018 - 10:15

కేరళ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మత్స్యకారులు ప్రత్యేక బృందాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్‌డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బందికి మత్స్యకారులు వెన్నంటే ఉంటున్నారు. తమవంతు సహకారం అందిస్తూ బాధితులకు సాయం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షిస్తూ సహాయక శిబిరాలకు తరలించడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

చరిత్రలో తొలిసారి భక్తులు లేకుండా...

Submitted by arun on Mon, 08/20/2018 - 09:46

భూతల స్వర్గాన్ని కకావికలం చేసిన పెను ఉప్పెన  అనాదిగా వస్తున్న ఆచారాలపై ప్రభావం చూపింది. శబరిమల ఆలయంలో ఏటా నిర్వహించే నిరపుతిరి వేడుకలు ఈ ఏడాది అత్యంత సాదాసీదగా నిర్వహించారు. ఆలయానికి వచ్చే దారుల్లోని నదులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఈ ఏడాది భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఆలయ చరిత్రలోనే తొలిసారి భక్తులు లేకుండా ప్రతిష్టాత్మక పూజలు జరిగాయి.          

ఏడేళ్ల క్రితమే కేరళను హెచ్చరించిన గాడ్గిల్‌...ఇప్పుడు కేరళ..తర్వాత గోవా..?

Submitted by arun on Mon, 08/20/2018 - 09:08

గత వందేళ్లలో ఎన్నడూలేని జల ప్రళయాన్ని కేరళ చవిచూసింది. వరుణుడి ధాటికి వందల మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ స్థాయి వర్షాలు గతంలోనూ కురిసినా ఇంతపెద్దన వరదలు రావడానికి మాత్రం స్వయంకృతాపరాధమేనంటున్నారు పర్యావరణవేత్తలు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ప్రతి రాష్ట్రం మరో కేరళ కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. 

కేరళకు గుడ్‌న్యూస్‌‌

Submitted by arun on Mon, 08/20/2018 - 08:50

జల దిగ్బంధంతో అల్లాడుతోన్న కేరళకు ఐఎండీ ఊరట కలిగించే వార్త చెప్పింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే సహాయక చర్యలు ఊపందుకోగా మరో నాలుగైదు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదని భారత వాతావరణశాఖ ప్రకటించింది. అయితే ఇంతటి మహా విషాదంలోనూ వ్యాపారులు విచ్చలవిడిగా నిలువ దోపిడీకి పాల్పడుతున్నారు.

అయ్యప్ప ఆగ్రహించాడా...అందుకే కేరళను...

Submitted by arun on Mon, 08/20/2018 - 08:43

శబరిమలై అయ్యప్పకు ఆగ్రహం వచ్చిందా..? హరి హరుల సుపుత్రుడికి కోపం వచ్చిందా..? అందుకే కేరళను జలప్రళయం ముంచెత్తిందా..? వందేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా మలయాలీ సీమను అల్లకల్లోలం చేసిన వరదలకు కారణం మణికంఠుడి శాపమా..? 

శబరి కొండల్లో కొలువైన అయ్యప్పస్వామి కోరి వచ్చిన వారికి కొంగు బంగారం. క్షీరసాగర మధనం తర్వాత మోహినీ అవతారంలో వచ్చిన విష్ణువును శివుడు మోహించడం ద్వారా అయ్యప్ప అవతరించాడని పురాణగాధలు చెబుతున్నాయి. మహిశాసురుని వధించేందుకు అవతరించిన అయ్యప్ప జ్యోతిస్వరూపంలో భక్తులకు అభయమిస్తాడు. 

ముంపు తెచ్చిన ముప్పు...వైపరీత్యాన్ని అంచనా వేయలేదా?

Submitted by arun on Sat, 08/18/2018 - 16:28

కేరళలో జల విలయానికి కారణాలేంటీ ? ఎడతెరపి లేని వర్షాలకు వరద నీరు తోడయిందా ? నదులు, డ్యాంలు నిండిపోయి నీళ్లు రావడమే కారణమా ? వరదలను ప్రభుత్వం ముందే అంచనా వేయలేకపోయిందా ? సర్కార్‌ ముందే మేల్కొని ఉంటే ఇంతలా ప్రాణ నష్టం జరిగేది కాదా ? భారీగా నదులు, ఉప నదులు ఉన్నా కేరళ అతలాకుతలమైంది ? కేంద్రం కూడా సకాలంలో స్పందించలేదా ? ఎందుకిలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.

కేరళలో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే...తక్షణ సాయం కింద ఐదు వందల కోట్లు విడుదల

Submitted by arun on Sat, 08/18/2018 - 13:27

గడచిన వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కకావికలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది.  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ  తక్షణ సాయం కింద రాష్ట్రానికి ఐదు వందల కోట్ల సాయాన్ని ప్రకటించారు.  దీంతో పాటు  వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 2లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు  50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని వెల్లడించారు.  రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అరగంట పాటు హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన వరద నష్టంపై  సమీక్ష  సమావేశం నిర్వహించారు.

వరద నీటితో ఇళ్లంతా నిండిపోయింది..దయచేసి నన్ను కాపాడండి...

Submitted by arun on Sat, 08/18/2018 - 11:02

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ కకావికలమైంది. ఇప్పటికే 4వందల మందికి పైగా మృతి చెందారు. 3లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న వారిలో ఇప్పటి 3వేల మందిని రక్షించాయ్ ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ, నేవీ బృందాలు. 80 డ్యామ్‌లకు భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్‌ అధికారులు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో 14 జిల్లాలుంటే 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. NDRF టీమ్స్ సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ మరికొందరు నీటిలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.

కేరళలో జల విలయం...4వందల మందికిపైగా మృతి

Submitted by arun on Sat, 08/18/2018 - 08:47

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ కకావికలమైంది. ఇప్పటికే 4వందల మందికి పైగా మృతి చెందారు. 3లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న వారిలో ఇప్పటి 3వేల మందిని రక్షించాయ్ ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ, నేవీ బృందాలు. 80 డ్యామ్‌లకు భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్‌ అధికారులు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో 14 జిల్లాలుంటే 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు.