online-fraud

పార్సిల్ పంపించి.. రూ.36,900కు నామం పెట్టింది..

Submitted by nanireddy on Fri, 08/17/2018 - 18:32

రోజు రోజుకు ఆన్ లైన్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఫోన్లకు సందేశాలు పంపి మీకు బహుమతి తగిలింది.. సొంతం చేసుకోవాలంటే పలానా అకౌంట్ కు కొంత నగదు పంపించాలని చెబుతారు. తీరా చూస్తే అందులో బహుమతి ఉందదు.. ఈ తరహా మోసాలు అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం.. దాంతో  మోసగాళ్లు రూటు మార్చారు. ప్రస్తుతం సామజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌ లతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో లండన్‌కు చెందిన యువతి పరిచయమైంది. దాంతో  ఒకరికొకరు సందేశాలు పంపుకున్నారు. తరువాత ఆ  వ్యక్తిని విదేశీ యువతి ఫోన్‌ నంబర్‌ అడిగింది.