kanna lakshminarayana

పురందేశ్వరి, కన్నా ఇద్దరు రాష్ట్ర ద్రోహులు

Submitted by arun on Wed, 08/15/2018 - 16:56

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. బుధవారం ఉదయం కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అంటూ మండిపడ్డారు. కాగా.. ఆయన వ్యాఖ్యలను ఆయనకే తిప్పి కొట్టారు ఎంపీ కేశినేని నాని. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్ర ద్రోహి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. నగరంలోని తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.