Amitabh Bachchan

బిగ్ బి బండారం త్వరలోనే బయటకు..: సప్నా భవ్నానీ

Submitted by arun on Sat, 10/13/2018 - 10:52

హాలీవుడ్ లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం భారత్ లో అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఎంతో మంది ప్రముఖలు పేర్లు మీటూ వ్యవహారంలో బయటకు వస్తుండటం, ఇది ఉద్యమ రూపం దాల్చడంతో ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆరోపణలపై నలుగురు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం రెడీ అయినట్టు కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పష్టం చేశారు. మీటూ వ్యవహారంలో నమోదయ్యే కేసులన్నింటినీ కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. 

అమితాబ్ బచ్చను చేతి కథ

Submitted by arun on Sat, 09/01/2018 - 15:06

బిగ్ బి అమితాబ్ బచ్చను అద్బుతంగా నటించి.. రెండు చేతులతో సంపాదించడమే కాదు... మరో ప్రత్యకమైన ప్రతిభ కూడా ఉందట, అతను ఒక  ambidextrous. అంటే ఏమిటి?  అని మీరు అడగవచ్చు. సింపుల్ బాషలో చెప్పాలంటే.. మన బిగ్ బి ... తన రెండు చేతులను ఉపయోగించి సులభంగా రాయగలడు. కుడి చేయ్యయిన..ఎడమ చేయ్యయిన.. రాస్తూనే ఉంటాడట.. బహుశ చిన్నప్పుడు స్కూల్ ఇచ్చె హోం వర్క్.. రెండు చేతులతో చేసేవడేమో. శ్రీ.కో.

అమితాబ్ బచ్చన్ టైం

Submitted by arun on Mon, 08/13/2018 - 16:48

అమితాబ్ బచ్చన్ టైం విషయంలో చాల క్రమశిక్షణ తో ఉండేవాడట, అతను చాలాసార్లు ఫిలింస్టాన్ స్టూడియోస్ గేట్ కీపర్ రాక ముందు ఈ ప్రదేశానికి చేరుకోవటం వల్ల, అతను ఎన్నోసార్లు గేటు యొక్క ద్వారాలను తెరిచే వాడట. అతను వచ్చినప్పుడు తమ గడియారంలో సమయం సెట్ చేసుకునేవారట. శ్రీ.కో 

బిగ్ బీ అమితాబ్ ఇంట విషాదం..  

Submitted by arun on Mon, 08/06/2018 - 16:02

బాలీవుడ్ సూపర్ స్టార్ వియ్యంకుడు, ఎస్కార్ట్స్ గ్రూప్ అధినేత రాజన్ నందా ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ ఘటన తో బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా రాజన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్రహ్మాస్త్ర షూటింగ్ కోసం ప్రస్తుతం బల్గేరియాలో ఉన్నారు అమితాబ్. వియ్యంకుడి మృతి విషయం తెలుసుకోగానే హుటాహుటిని ఇండియాకు బయలు దేరారు. 

చిరుపై అమితాబ్ తెలుగు ట్వీట్.. చూశారా?

Submitted by arun on Thu, 03/29/2018 - 11:22

నట శిఖరం అమితాబ్ బచ్చన్.. హైదరాబాద్ చేరుకున్నారు. చిరంజీవి తాజా సినిమా సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటించబోతున్న బిగ్ బీ.. తన పార్ట్ షూటింగ్ కు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా.. అమితాబ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “సూపర్ స్టార్ చిరంజీవి.. అదే ఫ్రేమ్ లో ఓ గౌరవం ఉండాలి”.. అంటూ చిరుపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

కోడలిని మందలించిన అమితాబ్‌

Submitted by arun on Sun, 12/17/2017 - 14:11

తన కోడలు ఐశ్వర్యారాయ్ ని సున్నితంగా మందలిస్తున్న అమితాబ్ బచ్చన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో రెండు సంవత్సరాల క్రితం జరిగిన స్టార్ డస్ట్ అవార్డుల ప్రోగ్రామ్ లోదని తెలుస్తుండగా, అదిప్పుడు చక్కర్లు కొడుతోంది. 2015 స్టార్‌డస్ట్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో తీసిన వీడియో ఇది. ఈ కార్యక్రమంలో ఐష్‌ ‘జజ్బా’ చిత్రానికి గానూ ఉత్తమ నటి అవార్డు అందుకొన్నారు. అమితాబ్‌.. ‘పీకూ’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.

'డాన్' హీరోయిన్స్ ఒకే చోట‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 17:18

1978లో అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా న‌టించిన హిందీ చిత్రం 'డాన్' ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ సినిమా అప్ప‌ట్లోనే తెలుగులోనూ, త‌మిళంలోనూ రీమేక్ అయ్యింది. ఇక‌, 2006లో 'డాన్' సినిమాని అదే పేరుతో షారుఖ్ రీమేక్ చేశాడు. అందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా న‌టించింది. అలాగే త‌మిళంలో 2007లో ఆ సినిమాని 'బిల్లా' పేరుతో రీమేక్ చేస్తే హీరోయిన్ పాత్ర‌ని న‌య‌న‌తార చేసింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించాయి.