Priyanka Chopra

సల్మాన్ ఖాన్ చెల్లికి వెయ్యి సార్లు ఫోన్ చేసిన ప్రియాంక...

Submitted by arun on Sat, 09/08/2018 - 15:58

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారత్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపిక చేశారు.. కానీ ఆమె కొద్దీ రోజుల క్రితం ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. దీనికి కారణం ప్రియాంకకు తన ప్రియుడు నిక్ జోనాస్ తో పెళ్లి నిశ్చయం అవడం.  నిశ్చితార్ధం, పెళ్లి వెంటవెంటనే ఉండటంలో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు సల్మాన్ కు చెప్పారట. ఈ ప్రాజెక్టు లో  ప్రియాంక స్థానంలో  కత్రినా కైఫ్ నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ప్రియాంకను కథానాయికగా తీసుకోమని డైరెక్టర్ అబ్బాస్ కు చెప్పారట సల్మాన్, సల్మాన్ చెప్పడంతో ఒకే చెప్పేశాడట డైరెక్టర్.

ప్రియాంక విషయంలో పప్పులో కాలేసిన కాంగ్రెస్!

Submitted by arun on Fri, 07/13/2018 - 15:59

భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్‌ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను ట్యాగ్‌ చేసింది. రైతులకు భూసారంపై నివేదికలు ఇచ్చే భూసార పరీక్షా కేంద్రాలపై మోదీ అబద్ధాలు చెబుతున్నారంటూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘‘భూసార పరీక్షా కేంద్రాలపై కూడా మోదీ అబద్ధాలు చెబుతున్నారు. యూపీఏ హయాంలో మొత్తం 1141 భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి...’’ అంటూ ప్రియాంక చతుర్వేది బదులు ప్రియాంక చోప్రా చెబుతున్నట్టుగా ట్యాగ్ చేశారు.

పీకల్లోతు ప్రేమలో మునిగిన హాట్ కపుల్

Submitted by arun on Wed, 06/27/2018 - 17:08

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు  ఎక్స్ పోర్ట్ అయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తన ప్రియుడు నిక్ జోనాస్ తో సాగిస్తున్న ప్రేమాయణానికి ముగింపు పలకబోతోందా..? త్వరలోనే ఓ ఇంటి పక్షులవుతారా..? పీకల్లోతు ప్రేమలో ఉన్న వారిద్దరూ ఒక్కటయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? ప్రస్తతం గోవా వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంట వచ్చే నెలలోనే నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప‌ద్ద‌తిగా ట్యాక్స్ క‌ట్టేయ‌మ్మా

Submitted by lakshman on Wed, 01/31/2018 - 09:14

 కోట్లు ఖ‌ర్చుపెట్టి కార్ల‌ను కొనుగోలు చేస్తారు. కానీ ప్ర‌భుత్వానికి ప‌న్నుక‌ట్టే విష‌యంలోనే అతి తెలివిని ప్ర‌ద‌ర్శిస్తారు. అలా అతి తెలివి ప్ర‌ద‌ర్శించేవారిలో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులే ఉండడం గ‌మ‌నార్హం. కొద్దిరోజుల క్రితం కేర‌ళ‌లో రూ. కోటి రూపాయ‌ల విలువ చేసే కారు కొనుగోలు చేసిన హీరోయిన్ అమ‌లాపాల్ రిజ‌స్ట్రేష‌న్ మాత్రం పాండిచ్చేరిలో చేయించింది. స‌మాచారం తెలుసుకున్న కేర‌ళ  ట్రాన్స్ పోర్టు అధికారులు 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో భాగంగా  ఆమె సుమారు. 20ల‌క్ష‌ల ప‌న్ను ఎగ్గొట్టిన‌ట్లు తెలుస్తోంది.

హాట్‌ టాపిక్‌గా మారిన ప్రియాంక చోప్రా పారితోషకం

Submitted by arun on Sun, 12/17/2017 - 15:14

ఎవరూ ఏ స్థాయిలో  పోటీ పడినా దీ  బెస్ట్‌గా నిలుస్తోంది. అలా కనిపిస్తే చాలు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు. హాలీవుడ్‌ రేంజ్‌లో  ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న బ్యూటీ  ఓ న్యూస్‌తో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ మ్యాటరేంటో తెలియాలంటే ఈ స్టోరి చూడాల్సిందే. 

'డాన్' హీరోయిన్స్ ఒకే చోట‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 17:18

1978లో అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా న‌టించిన హిందీ చిత్రం 'డాన్' ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ సినిమా అప్ప‌ట్లోనే తెలుగులోనూ, త‌మిళంలోనూ రీమేక్ అయ్యింది. ఇక‌, 2006లో 'డాన్' సినిమాని అదే పేరుతో షారుఖ్ రీమేక్ చేశాడు. అందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా న‌టించింది. అలాగే త‌మిళంలో 2007లో ఆ సినిమాని 'బిల్లా' పేరుతో రీమేక్ చేస్తే హీరోయిన్ పాత్ర‌ని న‌య‌న‌తార చేసింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించాయి.

హృతిక్‌.. 'క్రిష్ 4' విల‌న్‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 16:52

హృతిక్ రోష‌న్ సూప‌ర్ హీరోగా న‌టించిన 'క్రిష్‌'కి అభిమానులు కాని వారు ఉండ‌రు. 2006లో వ‌చ్చిన ఆ చిత్రం హిందీలోనే కాదు.. తెలుగులోనూ అనువాద రూపంలో మంచి విజ‌యం సాధించింది. ఇక 'క్రిష్' కంటే ముందు వ‌చ్చిన 'కోయ్ మిల్ గ‌యా' (2003).. 'క్రిష్' త‌రువాత వ‌చ్చిన 'క్రిష్ 3' (2013) కూడా మంచి విజ‌యాలే సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో భాగం రానుంది.