Geetha Govindam

మిమ్మల్ని సతాయిస్తే బాగుంటుంది కదా

Submitted by arun on Fri, 08/24/2018 - 10:48

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. 'గీత గోవిందం' చిత్ర బృందాన్ని అభినందించారు. గురువారం కవిత ఈ సినిమా చూశారట. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌లను కలిశారు. ఈ సందర్భంగా తాను గీతగోవిందం సినిమాను రెండు సార్లు చూసినట్టు కవిత వెల్లడించారు. సినిమా చూశారా? ఎలా ఉంది? అని కవితను విజయ్ దేవరకొండ అడగ్గా.. ‘మస్తుంది సినిమా.. మిమ్మల్ని సతాయిస్తే బాగుంటుంది కదా’ అని నవ్వుతూ తెలిపారు. ‘సినిమా రెండు సార్లు చూశాను. ఫస్ట్ నేను చూశాను. తరువాత మా వదినా వాళ్లు చూద్దాం అంటే వెళ్లాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలనుకుంటున్నారు’’ అని తెలిపారు కవిత.

‘గీత గోవిందం’ హవా.. ఇద్దరు స్టార్ హీరోలను వెనక్కి నెట్టేసిన విజయ్

Submitted by arun on Mon, 08/20/2018 - 12:08

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు.. సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ క్లబ్‌లో చేరిన గీత గోవిందం, ఆస్ట్రేలియాలో ఈ చిత్రం ‘గోల్డ్’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో పోటీ పడి అగ్రస్థానంలో ఉంది.

యూఎస్‌లో దూసుకెళ్తోన్న ‘గీతగోవిందం’

Submitted by arun on Thu, 08/16/2018 - 11:31

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు.. సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇక్కడి మార్కెట్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ గోవిందుడు భారీగా కలెక్షన్లు రాబడుతున్నాడు. ఇప్పటికే యూస్‌లో హాఫ్‌ మిలియన్‌ డాలర్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. గోపిసుందర్‌ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఛలో ఫేమ్‌ రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటించింది. పరుశురామ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.  
 

‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ

Submitted by arun on Wed, 08/15/2018 - 12:47

టైటిల్ : గీత గోవిందం
జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : పరశురామ్‌
నిర్మాత : బన్నీ వాస్‌

‘గీత గోవిందం’ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టేనా?

Submitted by arun on Wed, 08/15/2018 - 10:42

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రంపై యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ట్రైలర్ ఆకట్టుకోవడం, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో యూత్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మాతలు. ప్రీమియర్ షోలని బట్టి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్లు ప్రదర్శితమయ్యాయి.

పైరసీ కోరల్లో భారీ చిత్రం : అల్లు అరవింద్‌

Submitted by arun on Tue, 08/14/2018 - 11:35

ఏయూలోని కాన్వొకేషన్‌ హాల్‌లో ఆదివారం గీత గోవిందం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ తమ బ్యానర్‌లో దర్శకుడు పరుశరాం రెండు సినిమాలు చేశారని, మూడో సినిమా కూడా చేయబోతున్నట్టు వెల్లడించారు. గీత గోవిందం సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు లీకైయ్యాయని, అందుకు కారణమైన 17 మంది విద్యార్థులు అరెస్టు అయ్యారని చెప్పారు. అయితే ఈ విషయంపై గీత గోవిందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్‌ మరో షాక్‌ ఇచ్చారు. గీత గోవిందం తో పాటు మరో మూడు సినిమాలు కూడా పైరసీ బారిన పడినట్టుగా వెల్లడించారు అరవింద్.

గోవింద గోవిందా...గీత మార్చవా గోవింద

Submitted by arun on Mon, 08/13/2018 - 13:47

ఆగష్టు 15న మన ముందుకు రాబోతున్న

గీతా గోవిందం సినిమాకి పైరసీ రాత పడింది,

సినిమాకి  ముందే గుంటూరులో లీక్ కొత పడింది, 

నిర్మాత చొరవతో ఆ లింక్కి  డిలిట్ బటన్ పడింది,

దీనితో ఈ కథకి  సుఖాంతం కార్డు పడిందో మరి. శ్రీ.కో 

‘గీత గోవిందం’ సీన్లు లీక్.. సూత్రధారి అరెస్ట్

Submitted by arun on Mon, 08/13/2018 - 10:14

అంతా ఓకే అనుకుంటున్న టైంలో.. టాలీవుడ్‌లో మళ్లీ ప్రకపంనలు రేగాయ్. రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌కు మళ్లీ లీక్ షాక్ తగిలింది. సినిమా హాల్‌లో కంటే ముందే లీకు వీరుల సెల్‌లో ఆడేస్తోంది స్టార్ హీరోల మూవీ. ఈ కొంత లీకేజ్ ఇండస్ట్రీకి ఎంతో డ్యామేజ్ చేస్తోంది. అలా లీకుల లిస్ట్‌లో ఈసారి గీత గోవిందం సినిమా వంతొచ్చింది.