british-airways-deplanes-indian-family-over-crying-3-year-old

పిల్లాడు ఏడుస్తున్నాడని బలవంతంగా విమానం నుంచి..

Submitted by nanireddy on Fri, 08/10/2018 - 08:34

కొత్త ప్లేసుకి వెళ్లినా, జన సందోహాన్ని చూసినా పిల్లలు ఏడుస్తారు. ఒక్కోసారి వారిని ఊరుకోబెట్టడం ఎవరి తరం కాదు. అలాగే ఆపకుండా ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు కూడా పిల్లాడ్ని, తల్లిని మార్చి మార్చి చూస్తుంటారు. అంతగా ఏడుస్తుంటే ఏం చేస్తున్నావు తల్లి అన్నట్లు ఉంటాయి వారి లుక్స్. విమానంలో కూర్చున్న పిల్లాడు ఏడుస్తుంటే సిబ్బంది ఏడుపు ఆపకపోతే క్రిందకు పడేస్తానంటే.. బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ లండన్-బెర్లిన్ విమానంలో ఓ భారతీయ కుటుంబం ప్రయాణిస్తోంది. ఫ్లైట్ క్రిందకు దిగుతున్న సమయంలో వారి మూడేళ్ల పిల్లాడు బెదిరిపోయి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడు. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని సముదాయించే ప్రయత్నం చేస్తోంది.