collections

అమెరికాలో అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టిన ‘మహానటి’

Submitted by arun on Tue, 05/29/2018 - 16:22

అమెరికాలో ‘మహానటి’ వసూళ్ల హవా కొనసాగుతోంది. అలనాటి తార సావిత్రి జీవితం ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై మాహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మాహానటి’ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రిగా కీర్తి సురేష్ చూపిన అభినయానికి ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అజ్ఞాతవాసి సినిమా క‌లెక్ష‌న్లు

Submitted by lakshman on Sun, 01/14/2018 - 14:49

సంక్రాతి బ‌రిలో విడుద‌లైన అజ్ఞాతవాసి సినిమా క‌లెక్ష‌న్లు దారుణంగా ఉన్న‌ట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమా విడుద‌లైన తొలిరోజు నుంచి  అజ్ఞాతవాసి అభిమానుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో వ‌సూళ్లు త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. తొలిరోజు నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రాస్ చేస్తే రెండో రోజు నుంచి సినిమా వ‌సూళ్ల ప‌రంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. దీంతో  తెలుగు రాష్ట్రాల్లో, రెస్టాఫ్ ఇండియాలో పాతిక కోట్లు,  యూఎస్ ప్రీమియర్స్ లో ఫస్ట్ డే కలుపుకుని దాదాపు పది కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా రెండో రోజున ఇండియాలో ఐదు కోట్లు,  ఓవర్సీస్ లో మరో ఐదు కోట్లు రూపాయల వచ్చిన‌ట్లు టాక్ .

'న్యూట‌న్' క‌లెక్ష‌న్ వివ‌రాలు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 12:59

ఈ ఏడాదికిగానూ ఆస్కార్‌కి ఎంపికైన భార‌తీయ చిత్రం 'న్యూట‌న్‌'. రాజ్‌కుమార్ రావ్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ హిందీ చిత్రం శుక్ర‌వారం వెండితెర‌పైకి వ‌చ్చింది. రిలీజ్ అయిన రోజు క‌లెక్ష‌న్లు వీక్‌గా ఉన్నా.. మౌత్ టాక్‌తో ఈ సినిమా ఆ త‌రువాత మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. శుక్ర‌వారం రూ.96 ల‌క్ష‌లు, శ‌నివారం రూ.2.52 కోట్లు, ఆదివారం రూ.3.42 కోట్లు, సోమ‌వారం రూ.1.31 కోట్లు రాబ‌ట్టిందీ సినిమా. నాలుగు రోజుల‌కిగానూ.. రూ.8.21 కోట్లు న‌మోద‌యిందన్న‌మాట‌.