viral-video-electric-scooter-explodes-inside-a-house-in-china

పేలిన స్కూటర్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Submitted by nanireddy on Thu, 08/09/2018 - 10:14

పాప ఆడుకునే స్కూటర్‌కి చార్జింగ్ పెట్టాడు ఓ తండ్రి. ఇంతలో చిన్న శబ్దం. తీరా చూస్తే ఛార్జింగ్ పెట్టిన ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయింది. ఈ ఘటన చైనాలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైనా రాజధాని బీజింగ్‌లోని ఓ ఇంట్లో ఎవరి పనిలో వారు బిజీగా వున్నారు. పాప ఆడుకోవడానికని ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టాడు పాప తండ్రి. ఆ తరువాత హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు తండ్రీ కూతుళ్లు. మొదట చిన్న శబ్ధం రావడంతో అక్కడే ఉన్న పెంపుడు కుక్క భయపడి అరవడం మొదలు పెట్టింది. అనంతరం స్కూటర్ నుంచి పొగలు వస్తుండడంతో వెంటనే చార్జింగ్ ప్లగ్ తీసేసారు.