android-oreo’s-rollback-protection-required-phones-launching-android-pie

గూగుల్ ఆండ్రాయిడ్‌ 'పై' వచ్చేసింది

Submitted by nanireddy on Wed, 08/08/2018 - 07:59

టెక్నాలజీ ప్రియులకు గూగుల్‌ శుభవార్త అందించింది. తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)లో కొత్త వెర్షన్‌ ‘పై’ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ సిరీస్‌లో ఇది తొమ్మిదవది. ఈ వర్షన్లోని స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడుతున్నారు, ఎంత సేపు వాడుతున్నారు, మితిమీరిన వాడకాన్ని నియంత్రించడానికి ఈ “Digital Wellbeing” అందుబాటులో ఉంది కొన్ని అప్లికేషన్లపై రోజుకు ఎంత సమయం వెచ్చిస్తున్నారో ఈ “Digital Wellbeing Dashboard” ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ ను ఇంత సమయం కన్నా ఎక్కువసేపు వాడకూడదనుకుంటే అలా కూడా సమయాన్నివ్ కూడా సెట్ చేసుకోవచ్చు.