Costly Saree

దొరికిన దుర్గమ్మ చీర దొంగ

Submitted by arun on Tue, 08/07/2018 - 15:11

రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బెజవాడ దుర్గమ్మ చీర మాయం కేసు ఓ కొలిక్కి వచ్చింది. ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలు సూర్యలతే చీరను దొంగలించినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఆలయ ఈవో పద్మ నివేదికను సిద్ధం చేశారు. నివేదికను రూపొందించే క్రమంలో ఈవో పద్మ పోలీసులను కూడా సంప్రదించారు. సీసీ టీవీలో రికార్డ్‌ కాకపోయినా ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలు సూర్యలతే ఈ చర్యకు ఒడిగట్టినట్లు తేలింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేయడంతో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని..