Rajya Sabha Deputy Chairman

డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై వైసీపీ అనూహ్య నిర్ణయం...

Submitted by arun on Thu, 08/09/2018 - 11:26

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది... ఇప్పటి వరకు ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతూ వచ్చిన ఆ పార్టీ... ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించింది. నిన్నటివరకూ విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పిన ఆ పార్టీ, నేడు అనూహ్యంగా తన మనసు మార్చుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఓటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నామని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ షాక్

Submitted by arun on Tue, 08/07/2018 - 13:51

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో  ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకు  వైసీపీ మద్దతిచ్చింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల అంశంపై వైసీపీ తన వైఖరి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.