Satellite record

భారీ ధర పలికిన 'అరవింద సమేత' శాటిలైట్ హక్కులు.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్!

Submitted by arun on Tue, 08/07/2018 - 12:47

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'అరవింద సమేత'.  ప్రకటన రోజు నుండే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తొలిసారి త్రివిక్రమ్, తారక్ లు కలిసి సిసినిమా చేస్తుండటంతో బిజినెస్ సర్కిల్స్ లో కూడా చిత్రంపై హైప్ బాగానే ఉంది. ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ ఏకంగా రూ.23.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏ చిత్ర శాటిలైట్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోలేదు.