farmer

బోరు విద్య గురించి మీకు తెలుసా? ఇదిగో చూడండి

Submitted by arun on Mon, 11/12/2018 - 12:06

మీ ప్రాంతాల్లో బోర్లు వేసి..వేసి నీరు పడక విసిగి వేజారి పోయారా వేల అడుగుల లోతుల్లో డ్రిల్ చేసినా చెమ్మనీరు పడటం లేదా. అయితే యూ డోన్ట్ వర్రీ మీకు అండగా మేమున్నామంటున్నారు అక్కడివారు. తమచేతిలో భూ తంత్రమాయ ఉందంటూ తమ మాయాజాలంతో భూమిలో ఉండే జలపాతాన్ని ఇట్టే కనిపెట్టాస్తామంటున్నారు. పెట్టిన పాయింట్స్ లలో కొన్ని సక్సెస్ కావడంతో అక్కడి రైతులు ఆ ఆచారాన్నే పాటిస్తుండగా విషయం పక్క గ్రామాలకు పాకిపోవడంతో ఇప్పుడు ఆ విద్యకు యమా డిమాండ్  ఏర్పడింది.

రియల్‌ బాహుబలి...ప్రాణాలకు తెగించి అడవి పందితో పోరాడిన రైతు

Submitted by arun on Mon, 07/23/2018 - 13:07

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ గిరిజనుడు బాహుబలిలా విరుచుకుపడి అడవి పందిని మట్టికరిపించాడు. బోథ్‌ మండలం సంపత్‌నాయక్‌ తండాలో తన పత్తి పంటను పరిశీలించేందుకు వెళ్లిన రైతు కటక్వార్‌ జైసింగ్‌‌పై సడన్‌గా అడవి పంది దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన జైసింగ్‌ అడవి పంది నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అడవి పంది పదేపదే రైతుపై విరుచుకుపడటంతో మరో దారిలేక తిరగబడ్డాడు.

చేతినిండా పంటనిచ్చిన కాజల్ ఫోటో

Submitted by arun on Sat, 06/30/2018 - 16:03

హీరోయిన్ల ఫోటోలు వాల్ పోస్టర్లుగా చూసుంటారు థియేటర్ల దగ్గర ప్లెక్సీలుగా చూసుంటారు ఇంకొన్ని చోట్ల కటౌట్లుగా చూసుంటారు. కానీ దిష్టిబొమ్మలుగా చూశారా.? చూడకపోతే ఇప్పుడు చూడండి.

అన్నదాతను వెంటాడిన దురదృష్టం... రూ.33 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు

Submitted by arun on Mon, 05/28/2018 - 14:56

ఖరీఫ్ సీజన్ వస్తున్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ రైతు తల్లడిల్లిపోయాడు. ఇప్పటికే అప్పులు పెరిగిపోవడంతో పొలం బీడు కావాల్సిందేనంటూ కంటతడి పెట్టుకున్నాడు.  అయితే ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు  ఆ బక్కచిక్కిన రైతుకు కొండంత అండగా నిలిచింది.  కాని విధి వక్రీకరించి ... ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము దొంగల పాలు కావడంతో మహబూబ్ నగర్ జిల్లాలో ఓ పేద రైతు గుండె పగిలింది. తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆ రైతుకొచ్చిన కరెంట్ బిల్లు రూ.76.73 కోట్లు!

Submitted by lakshman on Mon, 09/25/2017 - 21:45

రాయ్‌పూర్: అతనో సాధారణ రైతు. ఎప్పటిలానే ఆ రైతు ఇంటికి కరెంట్ బిల్లు వచ్చింది. ఆ కరెంట్ బిల్లుపై ఉన్న ఫిగర్ చూసి రైతుకు మూర్ఛ వచ్చినంత పనైంది. వేలల్లో, లక్షల్లో కాదు కోట్లలో వచ్చిన ఆ బిల్లు చూసి ఆ రైతు కుటుంబం అవాక్కైంది. సెప్టెంబర్‌లో గృహావసరాలకు కరెంట్ వినియోగించినందుకు గానూ రూ.76 కోట్లు కట్టాలనేది ఆ బిల్లు సారాంశం. రెక్కలుముక్కలు చేసుకుని రేయింబవళ్లు కష్టపడ్డా ఆ బిల్లును తన జీవిత కాలంలో తీర్చలేనని బాధిత రైతు రామ్ ప్రసాద్ వాపోయాడు. ఈ విషయమై రామ్ ప్రసాద్ విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాడు. కరెంట్ బిల్లు చూసిన అధికారులకు అసలు విషయం అర్థమైంది.