mla

మార్చి23న క‌ల్యాణ్ రామ్ కొత్త సినిమా

Submitted by lakshman on Sun, 03/11/2018 - 13:01

క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తాజా సినిమా ఎంఎల్ఎ. ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా రూపొందించిన సినిమా ఎంఎల్ఎ మర్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టి.జి విశ్వప్రసాద్ సమర్పణ లో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ,  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.

కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

Submitted by arun on Thu, 01/11/2018 - 13:20

వైసీపీ అధినేత జగన్‌ దూకుడు పెంచారు. సార్వత్రిక ఎన్నికలకు సై అంటూ కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేశారు. జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హఫీజ్‌ఖాన్‌ను ఖరారు చేస్తున్నట్లు ఆ పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి బుధవారం ప్రకటించారు. నగరంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీ మేరకు తమ నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో నియోజకవర్గంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలని వైఎస్‌ జగన్‌ సూచించినట్లు తెలిపారు.

పౌరసత్వ కేసు నుంచి చెన్నమనేనికి తాత్కాలిక ఊరట

Submitted by lakshman on Tue, 09/12/2017 - 17:48
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2009లో కేంద్రం ఆయనకు కేటాయించిన భారత పౌరసత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని...