Chhattisgarh

ఛత్తీస్ గఢ్ లో 15 ఏళ్ల తర్వాత హస్తం హవా

Submitted by chandram on Tue, 12/11/2018 - 20:24

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సన్నాహకంగా సెమీఫైనల్స్ పేరుతో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పుంజుకొంది. అధికార బీజెపీకి దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. కమలనాథులు అధికారంలో ఉన్న మూడురాష్ట్రాలలో పాగా వేసింది. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని హస్తగతం చేసుకొంది.  దేశంలోని ఐదురాష్ట్రాల ఓటర్లతో పాటు కోట్లాదిమంది భారతీయులను గత కొద్దివారాలుగా కదిపి కుదిపేసిన ఎన్నికల ఫలితాలు విశ్లేషకులు ఊహించిన విధంగానే ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే వచ్చాయి.

భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 8 మంది న‌క్స‌ల్స్ బలి

Submitted by chandram on Mon, 11/26/2018 - 15:02

నేడు చ‌త్తీస్‌ఘ‌డ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలోని స‌క్లార్ గ్రామంలో జ‌రిగిన హోరాహోరీ  ఎదురుకాల్పుల్లో 8 మంది న‌క్సల్స్ మృత్యుఒడికి చేరారు. డిస్ట్రిక్ రిజ‌ర్వ్ గార్డ్స్‌, కోబ్రా ద‌ళాలు, సీఆర్‌పీఎఫ్ పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. కాగా ఈ ఎదురుకాల్పుల్లో కూడా ఇద్దరు డీఆర్‌జీ పోలీసులు మృతి చెందారు. ఎన్‌కౌంట‌ర్‌లో మ‌రో న‌క్సల్ గాయ‌ప‌డ్డాడు. గాయపడిన వ్యక్తి నుండి ఒక తుపాకిని జప్తు చేసుకున్నారు. కాగా హ‍ోరాహ‍ోరి కాల్పుల్లో వీరమరణం పొందిన న‌క్సల్స్‌, పోలీసుల శవాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఎలక్షన్ సీజన్లో జోరుగా బెట్టింగ్స్...గెలుపోటములను ముందే చెప్పేస్తున్న బుకీలు

Submitted by arun on Thu, 11/22/2018 - 17:23

ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ పవర్ లోకి వస్తుందా..? ప్రసుత్తం అధికారంలో ఉన్న పార్టీనే మళ్లీ పగ్గాలు చేపడతాయా..? లేక అధికార మార్పిడి తప్పదా..? అధికార పార్టీ గెలిస్తే, ఎన్ని సీట్ల మెజార్జీతో గెలుస్తుంది.. విపక్షాలు గెలిస్తే, సీఎం అభ్యర్థి ఎవరు..? ఈ లెక్కలు వేస్తోంది రాజకీయ నేతలు కాదు.. బెట్టింగ్ రాయుళ్లు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.  
  

పోలింగ్ కేంద్రంలో పూజలు చేసిన బీజేపీ అభ్యర్థికి ఈసీ నోటీసు

Submitted by arun on Thu, 11/22/2018 - 11:44

ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ఎమ్మెల్యే ఒకరికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పోలింగ్‌ కేంద్రంలో పూజలు నిర్వహించడంమే ఇందుకు కారణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నవగఢ్‌లో చోటు చేసుకుంది. చత్తీస్ ఘడ్ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి దయాళ్ దాస్ భాగేల్ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. నవాఘడ్ పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన దయాళ్ దాస్ అగర్ బత్తీలు వెలిగించి, ఈవీఎం ఉన్న టేబుల్ పై కొబ్బరికాయ కొట్టి తాను రెండో సారి విజయం సాధించాలని పూజలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్...

Submitted by chandram on Mon, 11/12/2018 - 11:17

ఓపక్క మహాకూటమిలో తేలని లెక్కలతో రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నవిషయం తెలిసిందే. కాగా తాజాగా ఛత్తీస్‌గఢ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌కు పార్టీకు ఉహించని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గనారామ్ సాహూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. తొలి దశ ఎన్నికలకు ముందే సాహూ పార్టీ వీడడంతో

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కుట్ర భగ్నం

Submitted by chandram on Sun, 11/11/2018 - 10:26

మరో 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పొలింగ్‌ ఉండగా మావోయిస్టులు భారీ విధ్వంసానికి సిద్ధమయ్యారు. కూంబింగ్ బలగాలే లక్ష్యంగా దంతేవాడ జిల్లాలో భారీ కుట్రకు వ్యూహరచన చేశారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు గుర్తించడంతో మావోయిస్టుల కుట్రభగ్నమైంది. దంతేవాడ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ బలగాలే లక్ష్యంగా  పదడుగులు గొయ్యి తవ్వి భారీగా మందుపాతరలను ఏర్పాటు చేశారు. కాలి బాటలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు భారీ మట్టి కుప్ప కనిపించడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. సమీపంలో భారీ గొయ్యిని పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు ఉండటంతో నిపుణుల సాయంతో నిర్వీర్యం చేశారు.

ఛత్తీస్‌ఘడ్‌లో మావోల ఘాతుకం

Submitted by arun on Thu, 11/08/2018 - 15:26

ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడ సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు బాంబుతో పేల్చారు. బాంబు పేలుడికి నలుగురు జవాన్లు మృతిచెందగా, మరో ముగ్గురు గాయడ్డారు. మరో నాలుగురోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో మావోయిస్టుల దాడి చత్తీస్‌ఘడ్‌లో తీవ్రకలకలం రేపుతోంది. 
 

మావోల దాడి...కంటతడి పెట్టిస్తున్న దూరదర్శన్‌ కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ చివరి మాటలు

Submitted by arun on Wed, 10/31/2018 - 13:37

ఛత్తీస్‌గఢ్‌లో నిన్నటి మావోయిస్ట దాడికి సంబంధించి కీలక వీడియో బయటపడింది. మావోయిస్టుల దాడిలో చనిపోయిన డీడీ న్యూస్‌ కెమెరామెన్‌... కాల్పుల సమయంలో తన తల్లితో వీడియో కాల్‌ మాట్లాడాడు. మావోయిస్టులు దాడి చేశారని...  ఇక్కడి పరిస్ధితులను బట్టి చూస్తే తాను చనిపోతానేమోనన్న భయంగా ఉందని తన తల్లితో చెప్పాడు. అప్పటికే మావోయిస్టుల దాడిలో గాయపడిన కెమెరామెన్‌ అచ్యుతానంద సాహూ... తన తల్లితో మాట్లాడిన చివరి మాటలు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. తమపై దాడి జరిగిన విషయాన్ని చెబుతూ ఆయన తన సందేశాన్ని మొదలుపెట్టారు. ‘‘ఎన్నికల కవరేజీ కోసం నేను దంతేవాడ వచ్చాను. మేము రోడ్డుమార్గంలో వెళ్తున్నాం.

చత్తీస్‌గఢ్‌లో తప్పిన మరో భారీ ప్రమాదం

Submitted by arun on Wed, 10/31/2018 - 10:18

ఛత్తీస్‌గఢ్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలకు తెగబడుతున్న మావోయిస్టులు .. మరో భారీ దాడికి చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుకుమా, నారాయణపూర్ అటవీ ప్రాంతాల్లో భారీగా ల్యాండ్ మైన్స్‌ను పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు10 ల్యాండ్ మైన్స్‌ను వెలికితీసిన పోలీసులు ..అణువణువునా శోధిస్తున్నారు. కూంబింగ్ బలగాలు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా మావోయిస్టులు వీటిని అమర్చినట్టు గుర్తించారు. గత శుక్రవారం ఇక్కడే జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఓ వైపు మావోయిస్టుల దాడులు మరో వైపు కూంబింగ్ బలగాలతో స్ధానిక గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు.  

మావోల మెరుపుదాడి.. దూరదర్శన్ రిపోర్టర్, ఇద్దరు జవాన్లు మృతి

Submitted by arun on Tue, 10/30/2018 - 14:42

ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో కూంబింగ్ బలగాలపై మెరుపు దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లతో పాటు దూరదర్శన్ రిపోర్టర్ మృతి చెందగా మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూ ఉండటంతో ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలించారు. తొలి విడత ఎన్నికల నామినేషన్ల ముగింపు రోజు నుంచి మావోయిస్టులు వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను హతమార్చిన మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి బీజేపీ నేత నంద్ లాల్ ముదాంబీపై కత్తులతో దాడి చేశారు. తాజాగా ఈ ఘటన జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.