for-imran-khans-oath-ceremony-no-foreign-leaders-to-be-invited-says-pakistans-foreign-office

మేము పాకిస్థాన్ వెళతాం : మాజీ క్రికెటర్లు కపిల్, సిద్దూ

Submitted by nanireddy on Fri, 08/03/2018 - 07:26

ఇటీవల పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికలలో పాక్ మాజీ క్రికెటర్ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తాము హాజరవుతామని భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ లు తెలిపారు. పాకిస్తాన్‌ నూతన ప్రధానిగా ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తానని భారత మాజీ క్రికెటర్‌ కపిల్ దేవ్ అన్నారు. ఇక ఇమ్రాన్‌ ఖాన్‌ కెప్టెన్సీలో 1992లో పాక్‌ జట్టు వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన విషయాన్ని సిద్ధూ ప్రస్తావించారు.