hen

గాలిలో ఎగిరిన కోడి

Submitted by arun on Tue, 08/07/2018 - 16:06

సాధారణంగా పక్షులు గాలిలో చాలాసేపు ఎగరగలుగుతాయి, కానీ కోడి ఎక్కువగ భూమి పైనే వుంటుంది, అయితే కోడి గాలిలో ఎగిరినప్పుడు ఎంత సేపు ఎగరగలదు అని చూసినప్పుడు, ఒక కోడి యొక్క పొడవైన గాలిలో ఎగిరే రికార్డ్  13 సెకన్లు మాత్రమే. శ్రీ.కో.
 

Tags

మద్యం మత్తులో ఓ యువకుడు...బతికున్న కోడినే...

Submitted by arun on Wed, 08/01/2018 - 17:38

మద్యం మత్తులో ఓ యువకుడు జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. మరి దారుణంగా బతికున్న కోడిని పీక్కుతున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం ఆర్వోబీ రోడ్డులో మంగళవారం జరిగింది. ఇద్దరు యువకులు సమీపంలోని కోళ్ల దుకాణంలో కోడిని కొనుగోలు చేయగా, మద్యం అతిగా సేవించడంతో ఆర్వోబీకి వెళ్లే రోడ్డు పక్క ఓ యువకుడు కిందపడిపోయాడు. మరో యువకుడు చేతిలో ఉన్న కోడిని అలాగే పీక్కుతిన్నాడు. దీన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్‌గా మారింది.
 

Tags