pv sindhu

స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాక్

Submitted by arun on Tue, 10/16/2018 - 16:50

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు పెద్ద షాక్. ఎన్నో అంచనాలతో డెన్మార్క్ ఓపెన్‌లో బరిలో దిగిన సింధు తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. డెన్మార్క్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలిరౌండ్లోనే ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు పోటీ ముగిసింది. కోపెన్ హాగన్ వేదికగా జరిగిన తొలిరౌండ్ పోటీలో చైనా ప్లేయర్ చెన్ యూఫే చేతిలో సింధు 17-21, 21-16, 18-21తో ఓటమి చవిచూసింది. తొలిగేమ్ ను 17-21తో చేజార్చుకొన్న సింధు రెండో గేమ్ ను 21-16తో సొంతం చేసుకోడం ద్వారా సమఉజ్జీగా నిలిచింది. అయితే నిర్ణయాత్మక ఆఖరి గేమ్ ను యూఫే 21-18తో నెగ్గడం ద్వారా 2-1 విజయంతో రెండోరౌండ్లో అడుగుపెట్టింది.

Tags

ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధు.. ఏడాదికి 60 కోట్లు

Submitted by arun on Thu, 08/23/2018 - 09:28

ఆట పరంగానే కాదు ఆదాయార్జనలోనూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అదరగొడుతోంది. ఫోర్బ్స్‌ ప్రకారం ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్స్‌ ద్వారా ఆమె సంపాదన ఏడాదికి 60 కోట్లట.  అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక మొత్తాన్ని ఆర్జిస్తున్న మహిళా క్రీడాకారుల్లో ఆమె టాప్‌ టెన్‌లో ఉన్నారట. ఫోర్బ్స్ వెలువరించిన జాబితా ప్రకారం సింధుకు ఏడో స్థానం దక్కగా అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరినా విలియమ్స్‌కు అగ్రస్థానం దక్కింది. 

పీవీ సింధుకి కేసీఆర్ సర్కారు షాక్.!

Submitted by arun on Fri, 07/13/2018 - 11:26

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. తనకు అదనంగా స్థలం ఇవ్వాలని కోరిన విన్నపాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చిది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధుకు అప్పట్లోనే తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ భరణి లేఅవుట్‌లో దాదాపు రూ.15 కోట్ల విలువైన 1000 గజాల స్థలంతో పాటు రూ.5 కోట్ల నగదును ఆమెకు అందజేసింది. అయితే.. తనకు ఇచ్చిన భూమి పక్కనే ఉన్న 398 గజాల స్థలం కూడా కావాలంటూ ఆమె కొన్నాళ్ల క్రితం సర్కారుకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఆమె విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది.

భారత బ్యాడ్మింటన్ క్వీన్స్ కు వేర్వేరుగా శిక్షణ

Submitted by arun on Tue, 06/05/2018 - 18:24

ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న మాట...భారత బ్యాడ్మింటన్ క్వీన్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులకు అతికినట్లు సరిపోతుంది. ఈ ఇద్దరికీ వేర్వేరుగా శిక్షణ ఇవ్వాలని చీఫ్ కోచ్ గోపీచంద్ నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్లో మాత్రమే కాదు ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో ఇద్దరూ ఇద్దరే. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం సింధు 3వ ర్యాంకులో ఉంటే..సైనా నెహ్వాల్ మాత్రం పదో ర్యాంకులో కొనసాగుతోంది.

సైనా వర్సెస్ పీవీ సింధూ...

Submitted by arun on Sat, 04/14/2018 - 13:00

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం క్రీడాభిమానులకు పండగే. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణీలు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. కానీ, ఎవరికి ఏ పతకం దక్కుతుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. 2010లో బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించిన సైనా... గాయాల కారణంగా 2014 గ్లాస్గో కామన్వెల్త్‌లో నిరాశగా వెనుదిరిన సంగతి తెలిసిందే.

పీవీ సింధు పేరును పద్మభూషణ్‌‌కు ప్రతిపాదించిన క్రీడా శాఖ

Submitted by lakshman on Mon, 09/25/2017 - 17:52

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో సత్తా చాటి రజత పతాక విజేతగా నిలిచిన పీవీ సింధు పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించినట్లు కేంద్ర క్రీడా శాఖ తెలిపింది. ఈ సంవత్సరం ధోనీ తర్వాత పద్మభూషణ్‌ అవార్డులకు ప్రతిపాదించిన క్రీడాకారిణి పీవీ సింధునే కావడం విశేషం. పద్మభూషణ్ పురస్కారం అనేది దేశంలోనే అత్యున్నత్త పురస్కారాల్లో మూడవది. అలాంటి అవార్డుకు సింధు పేరును క్రీడా శాఖ ప్రతిపాదించడంపై ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కొరియా ఓపెన్ సిరీస్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాను ఓడించి సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.