hyderabad

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన హిజ్రాలు...

Submitted by arun on Wed, 08/08/2018 - 17:50

హైదరాబాద్‌లో హిజ్రాలు రెచ్చిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్.. నార్సింగి పోలీస్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్గురోడ్డు సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది..డబ్బులు అడిగితే ఇవ్వనందుకు వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. హిజ్రాల దాడి నుంచి బాధితుడు పారిపోయేందుకు ప్రయత్నించిగా.. పట్టుకుని దాడి చేశారు. కాళ్లతో తన్నడమే కాకుండా చెప్పులతో చితకబాదారు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హిజ్రాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హిట్‌తో బొద్దింకల్ని చంపొచ్చు. కానీ భర్తనే కడతేర్చింది ఓ కసాయి భార్య

Submitted by arun on Tue, 08/07/2018 - 17:49

హిట్‌తో బొద్దింకల్ని చంపొచ్చు. కానీ భర్తనే కడతేర్చింది ఓ కసాయి భార్య. నిత్యం వేధిపులకు గురిచేస్తున్నాడన్న కోపంతో... మైకంలో ఉన్న భర్త నోట్లో హిట్‌ కొట్టింది. అంతే అపస్మారక స్థితిలోకి వెళ్లిన జగన్‌ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే కుటుంబ కలహాలే ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.

భర్త నోట్లో 'హిట్‌' కొట్టి చంపేసింది..

Submitted by arun on Tue, 08/07/2018 - 10:27

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో భార్య భర్తను చంపేసింది. బస్తీలో కొంతకాలంగా భార్య దేవిక, భర్త జగన్‌ కలిసి నివసిస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో కానీ, రాత్రి ఫుల్‌గా తాగొచ్చాడు జగన్‌. ఈ క్రమంలో మత్తులో ఉన్న జగన్‌ నోట్లో హిట్‌ కొట్టి మరీ చంపేసింది దేవిక. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ గొడవలతోనే హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితమే గుంటూరు జిల్లా మాచర్ల నుండి దంపతులిద్దరూ హైదరాబాద్‌కి వచ్చారు.

వేదిక తీసిన ప్రాణాలు

Submitted by arun on Fri, 08/03/2018 - 14:24

కూకట్పల్లి ప్రవేటు స్కూల్ వేదికగా పోయెను,

పిల్లల భవిష్యత్తు, తల్లితండ్రుల్లు తల్లడిల్లెను,

కరాటే సాధన చేస్తుంటే కూలెనట ఆ స్టేజ్,

అర్దరాత్రి మందు సేవలు

Submitted by arun on Fri, 08/03/2018 - 14:13

ఇక వారాంతం వస్తే,

బారుల్లో పబ్బుల్లో దోస్తీ,

అర్దరాత్రి ఒంటిగంట వరకు మస్తీ,

ఇది ఇస్తుంది ఖజానాకి జాస్తి,

ఆ తర్వాత రోడ్లపై కుస్తీ,

ఇది ప్రభుత్వాలకి పట్టిన సుస్తీ. శ్రీ.కో.

హైదరాబాద్‌ చింతల్‌లో దారుణం...టీచర్‌పై యాసిడ్ దాడి

Submitted by arun on Fri, 08/03/2018 - 13:00

హైదరాబాద్‌ చింతల్‌లో దారుణం జరిగింది. ఓ టీచర్‌పై దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని  చింతల్‌లో  జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.  తీవ్ర గాయాలపాలైన  ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మందుబాబులకు గుడ్ న్యూస్

Submitted by arun on Fri, 08/03/2018 - 10:15

మందుబాబులకు కిక్కించే వార్త ఇది జీహెచ్ఎంసీ పరిధి బార్లలో ఇక రాత్రి ఒంటి గంట వరకు మందుకొట్టొచ్చు ఇది కేవలం శుక్ర, శనివారం మాత్రమే.  జీహెచ్ఎంసీతోపాటు దాని పరిధిలోని ఐదు కిలోమీటర్లలో ఉన్న బార్లకే పరిమితం అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

సొంత ఇంటికే కన్నం...భర్త దగ్గర రూ.41 లక్షలు కాజేసిన భార్య

Submitted by arun on Tue, 07/31/2018 - 11:15

అతడికి ఇద్దరు భార్యలు. రెండో భార్యకే భర్త ఆస్తులు కూడబెడుతున్నాడని మొదటి భార్య అసూయపడేది. తీవ్ర అభద్రతాభావానికి లోనైంది. చివరకు ఇంట్లోనే ఆమె భారీ చోరీ చేసింది. ఈ మిస్టరీ కేసును పోలీసులు చేధించారు. హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు సుధ. రెండో భార్యకే భర్త ఆస్తులు కుడబెడుతున్నాడని సుధ మధనపడేది. ఇటీవల వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తి సాయంతో నారాయణ ఇల్లు కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నాడు. 41 లక్షల రూపాయలను ఇంట్లో తెచ్చి పెట్టాడు. భర్త ఇంట్లోలేని సమయంలో మొదటి భార్య 41 లక్షల రూపాయలను కొట్టేసింది. 

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Submitted by arun on Sat, 07/28/2018 - 07:17

తెలంగాణ సర్కార్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ అయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలపై ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే 3వ తేదీకి వాయిదా వేసింది ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు.