handloom

సుందర్‌రావు కూతుర్ని: అనసూయ

Submitted by arun on Sat, 07/28/2018 - 10:26

పోచంపల్లిలో సినీనటి, ప్రముఖ యాంకర్‌ అనసూయ సందడి చేశారు. చేనేత దినోత్సవ సంబురాల్లో భాగంగా యార్రమాద వెంకన్న నేత ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లిలో  చేనేత కళాకారులకు సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యాంకర్, నటి అనసూయ పాల్గొన్నారు. ఈసందర్భంగా అనసూయ భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నేత కార్మికుల పనితనాన్ని అనసూయ గమనించారు. ఈక్రమంలో ప్రముఖ చేనేత కళాకారుడు చిలువేరు రామలింగం ఒక్క కుట్టు లేకుండా నేసిన మూడు కొంగుల చీరను చూసిన అనసూయ సంబ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఆయన కళాత్మక సృష్టి అద్భుతమని ఆమె పొగిడారు.