hyderabad

హైద‌రాబాద్‌కి ప్రియావారియ‌ర్‌..

Submitted by arun on Fri, 08/24/2018 - 11:35

కేవలం ఒకే ఒక కన్నుగీటుతో దేశమంతా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కేరళ భామ ప్రియా వారియర్  హైదరాబాద్‌కు వచ్చేస్తోంది. ఈ నెల 26న నగరంలో జరిగే 16వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు ఆమె హాజరు కానుంది. ‘బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆమె అందుకునేందుకు ప్రియా హైద‌రాబాద్‌కి వ‌స్తున్న‌ట్టు సంతోషం సినీ మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ విషయమై ప్రియా వారియర్ అధికారికంగా మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. ప‌లువురు సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం.

హైదరాబాద్‌కు పెను ముప్పు తప్పదా?

Submitted by arun on Thu, 08/23/2018 - 11:20

ప్రకృతి విలయాలొచ్చినప్పుడల్లా మనిషికి భూమ్మీద నూకలు చెల్లిపోయాయనుకుంటాం సృష్టి వినాశనానికి సమయం దగ్గరపడిందని భయపడతాం మన పొరపాట్లే మనల్ని కాటేస్తున్నాయని తర్కించుకుని విచారిస్తాం 2013లో ఉత్తరాఖండ్‌ ప్రకృతి విలయతాండవం మరిచిపోకముందే దేవభూమి కేరళ అదే ప్రకృతి కరాళనృత్యానికి కకావికలమయ్యింది.  కొండలు, కొండవాలు ప్రాంతాల సంగతి అటుంచితే మహానగరాల మాటేమిటి మరి? వాటి మనుగడకు ప్రమాదం పొంచి ఉందన్న మాట నిజం. చెట్లు నరికివేస్తూ కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న మహానగరాలకు ముంపు ప్రమాదానికి అతి చేరువలో ఉన్నాయన్నదీ నిజం.

భార్య సీక్రెట్ వీడియోలు ఫోన్‌లో.. ఫోన్ పోవడంతో..!

Submitted by arun on Fri, 08/17/2018 - 12:04

ఫోన్ పోయిన సంఘటన ఓ బాధితుడి కొంపముంచింది. ఫోన్‌లో దాచుకున్న భార్య, భర్తల సన్నిహిత దృశ్యాలు అశ్లీల వెబ్‌సైట్‌లోకి ఎక్కడంతో ఖంగుతిన్నాడు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. ఓ వ్యక్తి 2015లో భార్యతో సంభాషించిన విషయాలను వీడియో రికార్డు చేసి సేవ్‌ చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఫోన్‌ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి వ్యక్తిగత వీడియోలు పోర్న్‌ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. బాధితుడు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా..

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట కలకలం

Submitted by arun on Wed, 08/15/2018 - 15:19

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అన్న తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న మనస్తాపంతో తమ్ముడు ఆత్మహత్యాయత్నం చేశాడు . పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పేసి అతనిని ఆస్పత్రికి అతరలించారు. బాధిత యువకుడికి శరీరమంతా కాలిపోయింది. 80 శాతం కాలిన గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 

రాహుల్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

Submitted by arun on Tue, 08/14/2018 - 17:32

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో  టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం నాడు సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి రాజకీయ  ప్రాధాన్యత లేదని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. దాదాపు మూడు గంటల పాటు రాహుల్‌‌తోనే ఆర్‌.కృష్ణయ్య కలిసి తిరిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ప్రజా చైతన్య బస్సులోకి ఎక్కి వారితో ప్రయాణం చేశారు. ఆర్‌.కృష్ణయ్యను బస్సులోకి కుంతియా ఆహ్వానించారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్‌ను కలిశానని ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. తెలంగాణలోని ఎల్బీనగర్  నుండి టీడీపీ నుండి గత ఎన్నికల్లో ఆర్. కృష్ణయ్య  విజయం సాధించారు. 

కాంగ్రెస్‌తోనే మహిళాభివృద్ధి: రాహుల్

Submitted by arun on Mon, 08/13/2018 - 16:54

నరేంద్ర మోదీ ప్రభుత్వం సామన్య ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన.. రాజేంద్రనగర్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ హాల్‌‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ...‘ మహిళలు ఎదగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వెళితేనే అభివృద్ధి జరుగుతుంది.

మందుబాబుపై పోలీసుల మమకారం.. ఇంతకీ ఏం చేశారంటే

Submitted by arun on Sat, 08/11/2018 - 12:35

హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని ఐదు చోట్ల  ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు బేఖాతర్ చేస్తూ మద్యంతాగి తూలుతున్న మందుబాబుకే కారు స్టీరింగ్ అప్పగించారు. పక్క సీట్లో ట్రాఫిక్ పోలీస్ కూర్చుని కోటీశ్వరుడిపై మమకారం
 చూపించారు. పోలీసుల నిర్వాకంపై జనం విస్మయం చెందారు. 

నా పాటలకు రాయల్టీ ఇస్తే ఎప్పుడో రిటైర్‌ అయ్యేవాడిని: ఎస్పీ బాలు

Submitted by arun on Thu, 08/09/2018 - 11:09

రాయల్టీపై తెలుగు సినీ గాయనీ గాయకులు గళమెత్తారు. ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యంతో పాటు పలువురు గాయనీ గాయకులు హాజరయ్యారు. రాయల్టీ చట్టం ప్రకారం పాటపాడిన గాయనీ గాయకులకు కూడా రాయల్టీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

పిల్లలు బాత్ రూములో... భర్త మృతదేహం పక్కనే ప్రియుడితో రాసలీలలు!

Submitted by arun on Thu, 08/09/2018 - 10:42

భర్తను మర్మంగాలపై తన్ని.. ఆ తర్వాత అతనిపై హిట్ కొట్టి.. గొంతు పిసికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఫిల్మ్ నగర్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ హత్య కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. మొదట తానే స్వయంగా తన భర్తను హత్య చేసినట్లు తెలిపిన దేవిక.. ప్రియుడ్ని కాపాడేందుకే ఇలా చేసినట్లు విచారణలో తేలింది. తన ప్రియుడి కోసం భర్తను దారుణంగా హత్య చేసిందా ఇల్లాలు. వారి పిల్లలు చెప్పిన వివరాలతో కేసును విచారించిన పోలీసులు, 24 గంటల్లోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఆపై ప్రియుడిని, ఆమెను కటకటాల వెనక్కు నెట్టారు.

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన హిజ్రాలు...

Submitted by arun on Wed, 08/08/2018 - 17:50

హైదరాబాద్‌లో హిజ్రాలు రెచ్చిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్.. నార్సింగి పోలీస్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్గురోడ్డు సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది..డబ్బులు అడిగితే ఇవ్వనందుకు వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. హిజ్రాల దాడి నుంచి బాధితుడు పారిపోయేందుకు ప్రయత్నించిగా.. పట్టుకుని దాడి చేశారు. కాళ్లతో తన్నడమే కాకుండా చెప్పులతో చితకబాదారు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హిజ్రాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.