Yatra Movie

''యాత్ర'' సినిమాలో ఆ పాత్ర ఎవరికి?

Submitted by arun on Mon, 10/01/2018 - 15:27

పెద్ద పెద్ద నాయకుల జీవిత కథల ఆధారంగా ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి, అలాగే తెలుగులో ఇప్పుడు ఎన్టీఆర్ గారి జీవిత కథతో వస్తున్డగానే.. మరో మహానేత….దివంగత నేత, వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ''యాత్ర'' సినిమా కూడా వస్తుంది.. ఈ సినిమా షూటింగ్ చాల వరకు ఇప్పటికే పూర్తి అయ్యింది అని అంటున్నారు.. అయితే ఈ చిత్రంలో వైఎస్సార్ తనయుడు, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఒక మిలియన్ డాలోర్ ప్రశ్నలా అందరిలో ఆసక్తిని పెంచుతుంది...  ఈ సినిమా దర్శకుడు మహి.వి రాఘవ్ .

‘యాత్ర’ ఫస్ట్ సాంగ్...

Submitted by arun on Sun, 09/02/2018 - 12:06

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. వైఎస్ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి కనిపించ‌నుండ‌గా, వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసారు. అయితే ఈ రోజు వైఎస్ఆర్ 9వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా స‌మ‌రశంఖం అనే సాంగ్ విడుద‌ల చేసింది చిత్ర బృందం.

వైఎస్‌ జగన్‌ పాత్రలో ఆ హీరోనా?

Submitted by arun on Wed, 07/25/2018 - 14:49

టాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందుతున్న బ‌యోపిక్స్‌లో యాత్ర ఒకటి. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది. జూన్ 20న చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, వైఎస్ ఆర్ పాత్ర పోషిస్తున్న మ‌మ్ముట్టికి సంబంధించిన సన్నివేశాల‌ని చిత్రీక‌రించారు. యాత్ర సినిమా కోసం మహి వి రాఘవ ముఖ్య పాత్రలని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.