shriya

టాలీవుడ్ కుర్ర‌కారును ఓ ఊపుఊపేస్తున్న శ్రియా

Submitted by lakshman on Tue, 01/09/2018 - 15:27

శ్రియా టాలీవుడ్ కుర్ర‌కారును ఓ ఊపుఊపేస్తుంది. 2001లో ఇష్టం సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంద‌రు హీరోల స‌ర‌స‌న యాక్ట్ చేసి స‌త్తాచాటింది. సాధార‌ణంగా మోడ‌లింగ్ నుంచి , ఇత‌ర రంగాల‌నుంచి వ‌చ్చిన హీరోయిన్ అయిదారేళ్లు ఇండ‌స్ట్రీలో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఆ త‌రువాత ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. కానీ శ్రియా అలాకాదు నాటి నుంచి  నేటి హీరోయిన్ల‌తో స‌మానంగా సినిమాలు చేస్తూ స‌వాల్ విసురుతుంది.  రీసెంట్ గా శ్రియా ఫోటో షూటో నిర్వ‌హించింది. ఆ ఫోటో షూట్ తో టాలీవుడ్ ను మ‌రికొన్ని సంవ‌త్స‌రాల‌పాటు త‌న హ‌వా ఏంటో నిరూపించుకునేలా మై సౌత్ డివా క్యాలెండర్ కు ఫోజులు ఇచ్చింది.

15 ఏళ్ల 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి'

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 13:03

కొన్ని సినిమాలు ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. ఏదో రూపంలో గుర్తుండిపోతాయి. అలా నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి'. ఇందులో బాల‌కృష్ణ తండ్రీకొడుకులుగా రెండు పాత్ర‌లు పోషించాడు. ఒక‌టి చెన్న‌కేశ‌వ రెడ్డి కాగా.. రెండోది భ‌ర‌త్‌. ఈ రెండు పాత్ర‌ల్లోనూ వేరియేష‌న్ చూపిస్తూ.. బాల‌య్య చాలా బాగా న‌టించాడు. 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' పాత్ర‌లో ప‌గ‌, ప్ర‌తీకారం తాలుకు ఇంటెన్సిటీ ఎక్కువ‌గా ఉంటే.. కొడుకు భ‌ర‌త్‌ది సిన్సియ‌ర్ పోలీస్ పాత్ర‌. ఈ రెండు పాత్ర‌ల ప‌రంగా బాల‌య్య తీసుకున్న శ్ర‌ద్ధ సినిమాలో స్ప‌ష్టంగా తెలుస్తుంది.