Nagari

రోడ్డు మీద నాట్లేసిన రోజా

Submitted by arun on Wed, 09/19/2018 - 14:38

నగరి ఎమ్మెల్యే రోజా వరినాట్లు వేసింది. కూలీలతో కలిసి సరదాగా నాట్లు వేశారనుకుంటే తప్పులో కాలేసినట్లు.   చిత్తూరు జిల్లా మేళపట్టు గ్రామంలో  నిన్న కురిసిన వర్షాలకు రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ఎమ్మెల్యే రోజా.... వినూత్న రీతిలో రోడ్లపైనే నాట్లు వేసి నిరసన తెలిపారు. రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా  మేళపట్టు గ్రామంలో పర్యటించిన రోజా అక్కడి రోడ్ల దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ వీధిలోనే పరిస్థితి ఇంతదారుణంగా ఉంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన.. త్వరలో...

Submitted by arun on Tue, 07/24/2018 - 15:28

వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో త్వరలోనే 'వైయస్సార్ అన్న' పేరుతో క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. అందుకే, ప్రజల కోసం తానే సొంతంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నానని చెప్పారు. 10మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు ఇచ్చామని, నగరి ప్రభుత్వాస్పత్రిలో, హాస్టళ్ళలో, బాలికల జూనియర్‌ కాలేజీలో ఆర్‌వో ప్లాంట్లు, కూలర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారు

Submitted by arun on Mon, 07/23/2018 - 16:42

వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి, జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో వ్యాపారులకు తోపుడు బండ్లను ఈరోజు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన మీద నమ్మకంతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి టిక్కెట్‌ ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరి ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. నగరి ప్రజల రుణం జీవితంలో మర్చిపోలేనని చెప్పారు.