Aravinda Sametha

‘అరవింద సమేత’పై చర్చ కోసం వస్తూ అనంతలోకాలకు..

Submitted by arun on Wed, 10/17/2018 - 12:26

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాపై నిరసన తెలిపేందుకు వచ్చిన  రాయలసీమ ఉద్యమకారులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో  ఒకరు చనిపోగా... ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలో రాయలసీమ భాష, జీవితాల్ని కించపరచడాన్ని నిరసిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు వస్తున్న వీరి  వాహనం ప్రమాదానికి గురైంది. ఓ టీవీ చానెల్ డిబేట్ లో పాల్గొనడానికి హైదురాబాద్ వస్తూ మహబూబ‌్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట వద్ద ఈ యువకులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. 
 

త్రివిక్రమ్ క్షమాపణ చెప్పాల్సిందే...‘ఆ సీన్లను తొలగించకుంటే ‘అరవింద’ను అడ్డుకుంటాం’

Submitted by arun on Mon, 10/15/2018 - 16:12

అరవింద సమేత సినిమా రాయలసీమ ప్రజలు మనోభావాలు దెబ్బ తీసేవిధంగా ఉందని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడో సీమలోనున్న ఫ్యాక్షనిజం ఇప్పటికీ ఉన్నట్లు ఈ సినిమాలో చిత్రీకరించారని ఆరోపించింది. సీమ ప్రజలకు  డైరెక్టర్ త్రివిక్రమ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక నుంచి దర్శక నిర్మాతలు రాయలసీమ కరవు, పేదరికంపై సినిమాలు తీయాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు కోరారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఫ్యాక్షన్ సన్నివేశాలు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు.

భారీ ధర పలికిన 'అరవింద సమేత' శాటిలైట్ హక్కులు.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్!

Submitted by arun on Tue, 08/07/2018 - 12:47

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'అరవింద సమేత'.  ప్రకటన రోజు నుండే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తొలిసారి త్రివిక్రమ్, తారక్ లు కలిసి సిసినిమా చేస్తుండటంతో బిజినెస్ సర్కిల్స్ లో కూడా చిత్రంపై హైప్ బాగానే ఉంది. ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ ఏకంగా రూ.23.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏ చిత్ర శాటిలైట్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోలేదు.

‘అరవింద సమేత’ స్టిల్‌ లీక్‌.. వైరల్‌

Submitted by arun on Mon, 07/23/2018 - 11:43

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబందించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలకు ఇదే నిదర్శనం. తాజగా ఈ చిత్రం నుంచి లీకైన స్టిల్ ఒక సోషల్ మీడియాలో భిభత్సం సృష్టిస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోను బట్టి ఈ సినిమాలో ఎంతో ఎమోషన్‌ ఉండబోతుందనేది అర్థమవుతోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా..