Life Style

ఫేస్ బుక్ మెసెంజర్ లో సరికొత్త ఫీచర్..

Submitted by nanireddy on Sat, 10/06/2018 - 18:57

సోషల్ మీడియా చాటింగ్ దిగ్గజం పేస్ బుక్ మెసెంజర్ తన వినియోగదారులకు మరో నూతన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఆడియో మరియు వీడియో చాటింగ్ అందుబాటులో ఉండగా తాజాగా మెసెంజర్ లో వాయిస్ సౌలబ్యాన్ని కూడా యాడ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా  యూజర్లు మాట్లాడితే అది టెక్స్ట్ మెసేజ్ గా మారుతుంది. దీంతో చాటింగ్ సులువు అవుతుంది. అంతే కాకుండా ఈ ఫీచర్ ఉపయోగించి యూజర్లు తమ ఫ్రెండ్ లో ఎవరికైనా మెసెంజర్ ద్వారా వాయిస్ కాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఈ ఫీచర్ ను ప్రయోగిస్తున్నారని ప్రముఖ టెక్ వెబ్ సైట్ టెక్ క్రంచ్ తెలిపింది. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని..

శరీరం అందంగా కనిపించాలా.. అయితే ఇలా..

Submitted by nanireddy on Thu, 10/04/2018 - 18:56

అందంగా కనిపించాలని ప్రతిఒక్కరికి ఉటుంది. అందుకోసం ఏవేవో క్రీములు వాడతారు. కానీ వాటికంటే ముక్యంగా అందమైన శరీరానికి కావలసింది అనుకూలమైన డైట్ అని వైద్యనిపుణులు అంటున్నారు. ఎవరికైనా కూడా గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటే ముందుగా చెయ్యాల్సిన పని వాటర్ ఎక్కువగా త్రాగడం. అది కూడా రోజుకు 8 నుంచి 12 గ్లాసుల వరకు తీసుకోవాలి. ఎవరైతే బాడీకి తగినంత వాటర్ తీసుకుంటారో వారి స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. నీరు తరువాత శరీరానికి కావలసింది ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటబుల్. ముక్యంగా సిట్రస్ ఫ్రూట్స్..

కొబ్బరినూనెతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం

Submitted by nanireddy on Tue, 10/02/2018 - 21:14

దక్షిణ భారతదేశంలోని వంటకాల్లో ముఖ్యంగా వాడే నూనె కొబ్బరినూనె. కేరళ రాష్ట్రంలో కొబ్బరినూనె వంటకాలు ఎక్కువగా ఉంటాయి. కేరళ తరువాత శ్రీలంక, ఇండోనేషియా సహా మరికొన్ని ఆసియా దేశాల్లోనూ వంటల్లో కొబ్బరి నూనె బాగా వినియోగిస్తారు. ఐతే.. ఈ నూనెలో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి హానికరం అన్నది హార్వర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ ఎపిడిమియాలజిస్ట్ కెరిన్ మిషెల్స్ చెప్తున్న మాట. సాధరణంగా ప్రతి నూనెలోనూ ఈ తరహా గాఢత ఎక్కువగా ఉండే కొవ్వు ఉంటుంది. వేరుసెనగ నూనె, చీజ్ ఇలా మనం తినే చాలా వాటిల్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువే.

చుండ్రు ప్రతిరోజు వస్తుందా.. అయితే ఇలా చేయండి..

Submitted by nanireddy on Thu, 09/27/2018 - 11:04

ఈ ఆధునిక కాలంలో జుట్టు రాలె సమస్య ప్రతి వందమందిలో 80 మందికి ఉంటుంది. జుట్టు రాలడానికి ముఖ్య కారణాల్లో ఒకటి  చుండ్రు సమస్య.. ఈ చుండ్రు సమస్య 

యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్

Submitted by nanireddy on Mon, 09/24/2018 - 10:10

సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్‌ వినియోగదారుల కోసం మరో నూతన ఫీచర్ ను  అందుబాటులోకి తీసుకొచ్చింది. యూట్యూబ్ లో సగటు యూజర్.. ఎంత సమయం గడిపాడో ఫీచర్  ద్వారా తెలుసుకోవచ్చు. యూజర్లు తాము ఎంతసేపు వీడియోలు చూస్తూ గడిపిందీ ఇందులో తెలుపుంతుంది. అంతేకాదు ఒకవేళ సమయానికంటే మించి యూట్యూబ్ లో వీక్షించే వారిని అప్రమత్తం చేసేలా రిమైండర్ కూడా ఇస్తుంది. ఒక్కసారి ఈ రిమైండర్ సెట్ చేసుకుంటే నిర్దేశిత సమయానికల్లా కాసేపు బ్రేక్ తీసుకోమంటూ పాప్ అప్ సందేశం ఇస్తుంది. అలాగే వివిధ యూట్యూబ్ చానెళ్లకు సంబంధించిన నోటిఫికేషన్లు అన్ని ఒకేసారి వచ్చేల ఇందులో సెట్ చేసుకునే సదుపాయం ఉంది.

పురుషుడికి కనీసం 40 మిలియన్ల వీర్య కణాలుండాలట..

Submitted by nanireddy on Wed, 09/19/2018 - 20:25

మహిళలు గర్బం దాల్చాలంటే పురుషుడు కనీసం 40 మిలియన్ స్పెర్మ్స్ విడుదల చేయాల్సి ఉంటుందని ఆధ్యనాలు చెబుతున్నాయి. స్పెర్మ్ కౌంట్ 20 మిలియన్ల కన్నా అధికంగా ఉన్నప్పుడు దానిని నార్మల్ కౌంట్‌గానే పరిగణిస్తారు వైద్యులు. కానీ స్పెర్మ్ కౌంట్ విపరీతంగా తగ్గితే పిల్లలు పుట్టే ఆవకాశం ఉండకపోవచ్చు అని అంటున్నారు. స్పెర్మ్ కౌంట్ తగ్గటానికి ప్రధాన కారణాలు మద్యం తాగడం, పొగత్రాగడం అలాగే నిద్ర తక్కువగా పోవడం వంటివి.. ముఖ్యంగా మద్యం మరియు పొగత్రాగడం వలన మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొగాకు, గుట్కాల్లోని నికోటిన్ వీర్య కణాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

నాన బెట్టిన ఖర్జూరం తింటే ఉపయోగాలెన్నో

Submitted by nanireddy on Wed, 09/19/2018 - 20:16

నాన బెట్టిన ఖర్జూరం తింటే ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు కొందరు నిపుణులు.  రోజు రెండు, లేక మూడు ఖర్జూర పండ్లను నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఈ గుజ్జుని రెండు స్పూన్లు పిల్లలకు తినిపిస్తే కడుపు ఉబ్బరం తగ్గి విరేచనం సాఫీగా అవుతుంది. అలాగే  మలబద్దకంతో బాధ పడే పెద్దవారికి సైతం ఇది బాగా పనిచేస్తుంది.  ఖర్జూర పండులో ఉండే ఇనుము, కాల్షియం శరీరానికి మేలు చేస్తుంది. నానబెట్టిన ఖర్జూర పండు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్యమెంటో చూడండి.. 

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేస్తే సరి..

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 18:08

గుప్పెండంత గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండి మనుగడ సాగిస్తాడు.  నిరంతరం పనిచేసే గుండె ఓ క్షణం అలసి పోయిందంటే ఊపిరి ఆగిపోతుంది. మరి అలాంటి గుండెని పదిలంగా కాపాడుకోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాలి. రోజు మంచి ఆహారంతో పాటు, వ్యాయామం ఖచ్చితంగా ఉండాలి. వీటి తోపాటు రోజు  గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే.. మంచిదని కొందరు పరిశోధకులు తమ పరిశోధనలో తేల్చారు.  రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

అందం కోసం ఆ క్రీములు వాడుతున్నారా..? ఇక అంతే..

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 17:52

అందంగా కనిపించాలని ప్రతిఒక్కరికి ఉంటుంది.  ప్రస్తుతం ట్రెండ్‌ అంతా అందం చుట్టే తిరుగుతోంది. 16 ఏళ్ల అమ్మాయి నుంచి అరవై ఆరేళ్ళ ఏళ్ల బామ్మ వరకు.. అందరికి ఒకటే తపన. అదే.. అందంగా కనిపించాలని. అందుకు తగ్గట్టే మార్కెట్‌లో రకరకాల ఇల్లీగల్‌ క్రీముల పుట్టుకొస్తున్నాయి. వాటిని విక్రయిస్తూ..  జనాల్లో క్యాష్‌ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. కేవలం అందం కోసమే మార్కెట్లో కోట్లలో వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఆ ఇల్లీగల్‌ క్రీముల వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిదని అంటున్నారు వైద్యనిపుణులు. దీనికి కారణం లోలోపల చర్మాన్ని పాడు చేసే డేంజరస్‌ స్టెరాయిడ్స్‌ వాటిలో నిక్షిప్తమై ఉంటాయని అంటున్నారు.

పిల్లల్లో బరువు తగ్గాలంటే ఇలా..

Submitted by nanireddy on Tue, 09/11/2018 - 17:22

సాదరంగా వయసును బట్టి పిల్లల శరీర ఆకృతిలో మార్పు ఉంటుంది. కానీ కొంతమంది వయసుతో పనిలేకుండా  విపరీతమైన బరువు పెరుగుతారు. అది వంశపారంపర్యం కావొచ్చు.. శరీర అవయవాల్లో మార్పు  కావొచ్చు.. మాములుగానే చిన్నపిల్లలలో జీర్ణప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. దాంతో వారికి ఆకలి ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఇదిలావుంటే చాలా మంది తలిదండ్రులు తమ పిల్ల‌లు బ‌రువు ఎక్కువగా ఉన్నార‌ని మ‌థ‌న‌ప‌డుతుంటారు. అయితే వారికీచక్కటి ఉపాయాలు చెబుతున్నారు శాస్త్రవేత్తలు..చిన్నపిల్లలు ఆహారాన్ని  నెమ్మదిగా నమిలి తింటే లావు కారని చెపుతున్నారు. ప్రతి ముద్దను 30 సెకన్లపాటు బాగా నమలాలంటున్నారు. దీనివల్ల పిల్లలకు కడుపు నిండినట్టు ఉంటుందిట.