daughter

కన్న కూతురి వద్దే వడ్డీ వసూలు చేస్తూ..

Submitted by arun on Tue, 07/17/2018 - 13:39

వడ్డీ వ్యాపారులకు తన మన అన్న భేదం ఉండదు. వారికి కావాల్సింది డబ్బే బంధాలు, అనుబంధాలు, మానవత్వాలు అంటూ ఏమీ ఉండవు. కృష్ణా జిల్లా తునికిపాడుకు చెందిన కిలారు హనుమంతరావు తన కూతురు చంద్రలేఖకు 5లక్షలు అప్పు ఇచ్చాడు. 5లక్షల రూపాయలకు వడ్డీల మీద వడ్డీలు వేసి 15లక్షల రూపాయలు వసూలు చేశాడు. అంతటితో హనుమంతరావుకు డబ్బు మీద ఉన్న వ్యామోహం తగ్గలేదు. ఇంకా ఐదు లక్షలు చెల్లించాలంటూ కూతురుకు చెందిన పొలంలో పంట వేసుకోకుండా అడ్డుకున్నాడు. తండ్రి వ్యవహారశైలితో విసుగు చెందిన కూతురు చంద్రలేఖ తండ్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. 

భర్తకు కూతురితో పెళ్లి చేసిన భార్య

Submitted by arun on Thu, 07/05/2018 - 12:47

వావివరసలు మరిచిన ఓ తండ్రి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతిరినే పెళ్లాడాడు. అంతేకాకుండా ఆమెను గర్భవతిని కూడా చేశాడు. అయితే తనకు అల్లా ఆదేశించడం వల్లే ఇలా చేశానని ఇందులో తన తప్పేమి లేదని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలో చోటుచేసుకుంది.

షాకింగ్: మహిళా కానిస్టేబుల్ కూతురిపై డీసీపీ అత్యాచారం

Submitted by arun on Thu, 06/28/2018 - 11:45

మహారాష్ట్ర ఔరంగబాద్ లో దారుణం జరిగింది. కంచే చేను మేసింది. తన దగ్గర పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కూతురిని డీసీపీ రేప్ చేశారు. 23 ఏళ్ల యువతికి మంచి జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికి ఈ దారుణానికి పాల్పడ్డాడు.  ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. డీసీపీ రాహుల్‌ శ్రీరామ్ పై  ఔరంగాబాద్‌ ఎండీసీ పోలీస్‌ స్టేషన్‌లో  కేసు నమోదైంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్‌ శ్రీరామ్‌ను అభ్యర్థించింది మహిళా కానిస్టేబుల్‌. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు.

అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

Submitted by arun on Wed, 06/27/2018 - 11:41

"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.

"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి

ఉగ్ర కాల్పుల్లో గాయపడి పండంటి బిడ్డకు జన్మ

Submitted by arun on Mon, 02/12/2018 - 10:44

రెండ్రోజుల క్రితం జమ్ము కశ్మీర్ సుంజ్వాన్ ఉగ్రదాడిలో గాయపడిన గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఆర్మీ కార్టర్స్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో.. రైఫిల్‌మ్యాన్ నజీర్‌ అహ్మద్‌తోపాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. 35 వారాల గర్భిణి అయిన ఆమెను హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో సైనిక ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. సత్వారీలోని మిలటరీ ఆసుపత్రిలో సిజేరియన్ చేసిన తర్వాత ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

ఐఫోన్ కోసం సింగపూర్‌కు

Submitted by lakshman on Sun, 09/24/2017 - 19:23

సింగపూర్: ఐఫోన్ అంటే ఇష్టముండనివారు ఎవరుంటారు..! ఏడాదికొక కొత్త మోడల్‌ను ఆపిల్ కంపెనీ ప్రవేశపెట్టడం ఆలస్యం.. ఆ ఫోన్‌ను ఎప్పుడెప్పుడు చేతిలో చూసుకుంటామా అన్న తాపత్రయం చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ ఆ ఫోన్ విడుదల కాకపోతే వేరే దేశంలో క్యూలో నిలబైడెనా సరే వెనువెంటనే దానిని దక్కించుకోవాలన్న ఆత్రుత ఉంటుంది చాలా మందికి. వ్యాపారవేత్తలూ అందుకు మినహాయింపేమీ కాదు.