father

కన్న కూతురి వద్దే వడ్డీ వసూలు చేస్తూ..

Submitted by arun on Tue, 07/17/2018 - 13:39

వడ్డీ వ్యాపారులకు తన మన అన్న భేదం ఉండదు. వారికి కావాల్సింది డబ్బే బంధాలు, అనుబంధాలు, మానవత్వాలు అంటూ ఏమీ ఉండవు. కృష్ణా జిల్లా తునికిపాడుకు చెందిన కిలారు హనుమంతరావు తన కూతురు చంద్రలేఖకు 5లక్షలు అప్పు ఇచ్చాడు. 5లక్షల రూపాయలకు వడ్డీల మీద వడ్డీలు వేసి 15లక్షల రూపాయలు వసూలు చేశాడు. అంతటితో హనుమంతరావుకు డబ్బు మీద ఉన్న వ్యామోహం తగ్గలేదు. ఇంకా ఐదు లక్షలు చెల్లించాలంటూ కూతురుకు చెందిన పొలంలో పంట వేసుకోకుండా అడ్డుకున్నాడు. తండ్రి వ్యవహారశైలితో విసుగు చెందిన కూతురు చంద్రలేఖ తండ్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. 

కొడుకు తప్పు చేశాడని తండ్రికి శిక్ష

Submitted by arun on Thu, 04/05/2018 - 15:37

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. టి నర్సాపురం మండలం సాయంపాలెంలో అమానుషం చోటు చేసుకొంది. కొడుకు తప్పుచేశాడన్న కారణంతో తండ్రిని చెట్టుకు కట్టేసి అవమానించారు. మనస్తాపం చెందిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. సాయంపాలెంకు నాగేంద్ర ఓ అమ్మాయిని వేధించాడంటూ గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు. 

హ‌లో అన్న కూతురు..కొట్టిచంపిన క‌సాయి తండ్రి

Submitted by arun on Mon, 01/01/2018 - 16:46

క్ష‌ణికావేశంలో ఓ క‌సాయి తండ్రి క‌న్న‌కూతుర్నిహ‌త్య‌చేశాడు. అ త‌రువాత త‌న‌కేం తెలియ‌దు అన్న‌ట్లు నాట‌క‌మాడాడు. విజ‌య‌వాడ అజిత్ సింగ్ నగర్ లో నివాసముండే రమణ కూతురు కృష్ణ‌వేణి (15) ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతుంది. చ‌దువుల్లో ముందుడే కృష్ణ‌వేణి తెలివైన విద్యార్ధి. అన్నీ పరీక్ష‌ల్లో తోటి విద్యార్ధులతో పోటీప‌డుతు మొదటి రాంక్ సాధించేది. అయితే డిసెంబ‌ర్ 30న  తన తండ్రిసెల్ ఫోన్ లో గేమ్ ఆడుతుండా ఓ రాంగ్ కాల్ వ‌చ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన కృష్ణ‌వేణికి అవ‌త‌లి నుంచి మాట‌లు విన‌క‌పోవ‌డంతో హ‌లో హ‌లో అంటూ ఫోన్ పెట్టేసింది. అయితే కూతురు ఫోన్ మాట్లాడ‌డం గ‌మ‌నించిన తండ్రి ర‌మ‌ణ ఆగ్ర‌హ‌వేశానికి లోన‌య్యాడు.

హీరో విక్రమ్‌ ఇంట విషాదం

Submitted by arun on Mon, 01/01/2018 - 14:52

ప్రముఖ నటుడు విక్రమ్‌ ఇంట విషాదం నెలకొంది. హీరో విక్రమ్‌ తండ్రి వినోద్‌రాజ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. వినోద్‌రాజ్‌ వయసు 80 ఏళ్లు. విక్ర‌మ్ తండ్రి వినోద్ రాజ్ కూడా పలు క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల‌లో న‌టించి అభిమానుల ఆద‌రాభిమానం పొందారు. నృత్య రంగంలోను ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. అయితే ఆదివారం సాయంత్రం 4గం.ల‌కు విక్ర‌మ్ తండ్రి వినోద్ రాజ్ (80) అనారోగ్యంతో క‌న్నుమూశారు. దీంతో విక్ర‌మ్ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు నెల‌కొన్నాయి. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ వినోద్ రాజ్ మృతికి సంతాపం ప్ర‌క‌టిస్తూ, కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేశారు. ఈ రోజు వినోద్ రాజ్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఐఫోన్ కోసం సింగపూర్‌కు

Submitted by lakshman on Sun, 09/24/2017 - 19:23

సింగపూర్: ఐఫోన్ అంటే ఇష్టముండనివారు ఎవరుంటారు..! ఏడాదికొక కొత్త మోడల్‌ను ఆపిల్ కంపెనీ ప్రవేశపెట్టడం ఆలస్యం.. ఆ ఫోన్‌ను ఎప్పుడెప్పుడు చేతిలో చూసుకుంటామా అన్న తాపత్రయం చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ ఆ ఫోన్ విడుదల కాకపోతే వేరే దేశంలో క్యూలో నిలబైడెనా సరే వెనువెంటనే దానిని దక్కించుకోవాలన్న ఆత్రుత ఉంటుంది చాలా మందికి. వ్యాపారవేత్తలూ అందుకు మినహాయింపేమీ కాదు.