jio-phone-exchange-offer

జియో బంపర్ ఆఫర్.. మరో ఫోన్ ఉచితం..

Submitted by nanireddy on Thu, 07/19/2018 - 06:50

టెలికాం దిగ్గజం జియో తమ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మానుసూన్ హంగామా పేరుతో ఈ నూతన ఆఫర్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో బాగంగా పాత జియో ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో మార్చుకుని కొత్త ఫోన్‌ను పొందే సదుపాయాన్ని కల్పించింది. పాత జియో ఫోన్‌ను మార్చుకుని.. రూ. 501 చెల్లిస్తే కొత్త జియో ఫోన్‌ను ఇవ్వనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించగా ఈ ఆఫర్ జూలై 21 సాయంత్రం 5.00 గంటల నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్‌ కోసం మై జియో యాప్‌లో గానీ, జియో అధికారిక వెబ్‌సైట్‌లో గానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంస్థ సూచించింది. అంతేకాదు రూ. 501 చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది.