komatireddy rajagopal reddy

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్‌

Submitted by arun on Fri, 09/21/2018 - 16:23

టీ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు రేపిన చిచ్చు మరో మలుపు తిరిగింది. కుంతియాతో పాటు ఇతర నేతలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ కమిటీలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేసిన కమిటీలన్నీ బ్రోకర్లతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వార్డు మెంబర్స్‌గా కూడా గెలవలేనోళ్లను కమిటీలో వేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కుంతియా రాష్ట్ర కాంగ్రెస్‌కు పట్టిన పెద్ద శని అంటూ ధ్వజమెత్తారు. కమిటీల ఏర్పాటుపై తాను ఫోన్‌లో కుంతియాను నిలదీశానన్నారు.

అక్కడి నుంచే తెలంగాణకు రెండో సీఎం

Submitted by arun on Mon, 07/16/2018 - 17:18

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేసిన సోనియా రుణాన్ని తీర్చుకునే సమయం వచ్చిందని, కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ తగాదాలు ఉంటే కేసీఆర్ బలపడతారని, అందరం ఒక్కటైతే, కేసీఆర్ పరార్ అవడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి కావచ్చు. టీఆర్ఎస్‌లో మాత్రం అయితే కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే సీఎం అవుతారు.