Anjan Kumar Yadav

అజార్ వెనక ఆయన హ్యాండ్ ఉందంటున్న సీనియర్లు

Submitted by arun on Tue, 07/17/2018 - 11:51

ఎన్నికల మాటేమోగానీ కాంగ్రెస్ లో అప్పుడే సీట్ల పంచాయతీ  మొదలైంది నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. మాజీ కెప్టెన్ అజారుద్దీన్  సికింద్రాబాద్ ఎంపీ స్థానం ఆశించడంతో చర్చ కాస్తా రచ్చగా మారింది.

సికింద్రాబాద్‌ నుంచే పోటీ చేస్తున్నా: అంజన్‌కుమార్

Submitted by arun on Mon, 07/16/2018 - 16:49

తానుండగా సికింద్రాబాద్‌ నుంచి మరెవరూ పోటీచేయరని.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో తానే చేయి గుర్తుపై సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అజారుద్దీన్ వెనుక రాష్ట్ర క్యాడర్‌కు చెందిన వ్యక్తులున్నారని ఆరోపిస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్‌. సోమవారం ఇందిరా భవన్‌లో జరిగిన నగర కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ఈ రోజు రసాభాస చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ‘హెచ్‌ఎంటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సికింద్రాబాద్‌ నుంచి తానే పోటీచేస్తానని స్పష్టంచేశారు.

రసాభాసగా గ్రేటర్ కాంగ్రెస్ నాయకుల సమావేశం

Submitted by arun on Mon, 07/16/2018 - 15:32

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. సికింద్రాబాద్ ఎంపీ స్థానం విషయంలో వివాదం తలెత్తింది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని అజారుద్ధీన్ ప్రకటించడంతో వివాదం తలెత్తింది. దీంతో సమావేశంలో అంజన్‌కుమార్ యాదవ్ అనుచరులు అజారుద్ధీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంత సర్ధిచెప్పినా కార్యకర్తలు వినలేదు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తాను సికింద్రాబాద్‌ వీడేది లేదంటూ అంజన్ స్పష్టం చేశారు. దమ్ముంటే హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. అయితే అంజన్‌ మాట్లాడుతుండగానే సీనియర్ నేత వీహెచ్ సమావేశం నుంచి వెళ్లిపోయారు.