Sachin Tendulkar

ధోని వేటుపై సచిన్‌ ఏమన్నాడంటే..

Submitted by arun on Sat, 11/03/2018 - 11:57

టీమిండియా మాజీ కెప్టెన్‌, మహేంద్ర సింగ్‌ ధోనిని టీ20ల నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ విషయంపై  సెలక్షన్‌ కమిటీ ఛీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు ధోని టీ20 కెరీర్‌ ముగియలేదని స్పష్టంచేశారు. కాగా తాజాగా క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇదే అంశంపై స్పందిస్తూ, మీడియాతో సచిన్ మాట్లాడుతూ సెలక్టర్ల ఆలోచనేంటో అర్థం కావడం లేదని డ్రెస్సింగ్‌ రూంలో ఏం జరిగిందో తనకు తెలియదు కానీ, ఏ వ్యూహం, నిర్ణయాలు తీసుకున్న దేశానికి ఉపయోగపడేలా ఉండాలని టెండూల్కర్ స్పష్టం చేశాడు.

ఒక్కసారి మాత్రమే డకౌట్

Submitted by arun on Mon, 10/15/2018 - 12:58

రంజీ ట్రోఫీ క్రికెట్ కెరీర్లో సచిన్ టెండూల్కర్ చాల బాగా ఆడేవాడు.. మొత్తం అతని రంజీ ట్రోఫీ క్రికెట్ కెరీర్లోనే ఒక్కసారి మాత్రమే డకౌట్ అయ్యాడని మీకు తెలుసా! క్రికెట్ దేవుడు అని పిలవబడే  సచిన్ టెండూల్కర్ అతని మొత్తం రంజీ ట్రోఫీ క్రికెట్ కెరీర్లో ఒక్కసారి మాత్రమే డకౌట్ చేసిన యువ బౌలర్ భువనేశ్వర్ కుమార్. శ్రీ.కో.
 

సచిన్ టెండూల్కర్ 58 మరియు 75 స్కోర్లు

Submitted by arun on Thu, 10/04/2018 - 13:50

సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఎన్నో రికార్డ్లు సృష్టించాడు... అయితే అతను తన వంద రన్స్ లోపు రకరకల స్కోర్ చేసాడు.. తను చేయానివి రెండు సంఖ్యలే వున్నాయని మీకు తెలుసా! అవి ఏంటంటే... 58 మరియు 75 స్కోర్లు (100 కంటే తక్కువ) మాత్రమే... సచిన్ అతని మొత్తం కెరీర్లో ఈ రెండు స్కోర్ మాత్రం చేయలేదు. శ్రీ.కో.

సచిన్ టెండూల్కర్ రికార్డుల దేవుడు

Submitted by arun on Mon, 10/01/2018 - 16:46

సచిన్ టెండూల్కర్, క్రికెట్ అభిమానులకి దేవుడు, అతని పేరులో 5 ప్రపంచ రికార్డులు ఉన్నాయని మీకు తెలుసా! అవి ఎంతలంటే.. ముందుగా.. వన్డేలలో అత్యధిక పరుగులు - 18,426, టెస్ట్లలో అత్యధిక పరుగులు - 15,921, వన్డేలలో అత్యధిక వందలు - 49, టెస్ట్లలో అత్యధిక వందలు - 51, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు – 34357. ఇలా ఎన్నో గొప్ప విషయాలను సాదించాడు.. మన సచిన్. శ్రీ.కో.
 

సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు

Submitted by arun on Sat, 09/15/2018 - 17:00

మీకు తెలుసా! సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు, 1987 టెస్ట్ సీరీసు కన్నా ముందు ఒక ప్రదర్శనా మ్యాచ్లో భారతదేశం మరియు పాకిస్తాన్ ఆడాయి,  ఇమ్రాన్ ఖాన్ జట్టు నాయకుడు గా వున్నా ఆ ప్రదర్శన పోటీలో,పాకిస్తాన్  ఫీల్డర్లు గ్రౌండ్లో తక్కువ ఉండటం వల్ల, మన సచిన్ పాకిస్తాన్ టీం తరఫున ఫీల్డింగ్ చేసాడట. అప్పుడు సచిన్ వయస్సు 13 ఏళ్ల మాత్రమే. శ్రీ.కో.
 

సచిన్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు..!

Submitted by arun on Tue, 09/11/2018 - 13:09

తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పిన శ్రీరెడ్డి.. ఇటీవల కోలీవుడ్ ప్రముఖులపై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. కాగా, ఇప్పుడు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల‍్కర్‌ను టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరొకసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఇక్కడ సచిన్‌ను రొమాంటిక్‌ వ్యక్తిగా పేర్కొన్న శ్రీరెడ్డి..  ఆ దిగ్గజ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ ఉంటాడని కొత్త వివాదానికి తెరలేపారు.

సచిన్ కు నిద్రలో నడిచే అలవాటు ఉంది.. రాత్రిళ్లు గదంతా తిరిగి....  

Submitted by arun on Mon, 08/06/2018 - 16:11

క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లస్టర్  సచిన్ టెండూల్కర్ కు నిద్రలో లేచి అలవాటు ఉందని దాదా, సౌరభ్ గంగూలి తెలిపారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. టెస్టులకు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు గంగూలి. ఈ సందర్భంగా  ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’ కార్యక్రమంలో భాగంగా దాదా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.  ముఖ్యంగా గతంలో క్రికెటర్ గా ఇంగ్లండ్ టూర్ లో ఉన్నప్పుడు సచిన్ కు, తనకు మధ్య జరిగిన ఓ  సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు గంగూలి.

‘సచిన్‌ రాముడైతే.. నేను హనుమంతుడిని’

Submitted by arun on Sat, 06/09/2018 - 17:55

టీమిండియా మాజీ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లకు సంబంధించిన ఓ ఫొటో బాగా అలరిస్తోంది. తాజాగా సెహ్వాగ్‌ ఆ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ... 'సచిన్‌ రాముడైతే.. నేను హనుమంతుడిని' అని పేర్కొన్నారు. దానికి క్యాప్షన్‌గా.. ‘దేవుడితో ఉన్నప్పుడు..అతని పాదాల వద్ద ఉండటం బాగుంది.’  అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు ఫిదా అయిన అభిమానులు.. అద్భుతమైన జోడి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఓ అభిమానైతే ఏకంగా ‘సెహ్వాగ్‌ జీ.. మీరు సచిన్‌ నెంబర్‌ను మీ మొబైల్‌లో గాడ్‌జీ అని సేవ్‌ చేసుకున్నారా? దయచేసి సమాధానం ఇవ్వండి’ అని ప్రశ్నించాడు.

ఫైన‌ల్ మ్యాచ్‌ను ఆమెతో క‌లిసి చూశా: స‌చిన్‌

Submitted by arun on Tue, 05/29/2018 - 15:10

ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌ను మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ ఓ ప్రముఖురాలితో కలిసి వీక్షించినట్లు ట్విటర్‌ ద్వారా తెలిపాడు. ఇంతకీ ఆమె ఎవరు అనే కదా మీ సందేహం. ఇంకెవరు ఆమే ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌. గ‌త ఆదివారం చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్‌ను ఓడించి చెన్నై జ‌ట్టు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌ను ల‌తా మంగేష్క‌ర్‌తో క‌లిసి చూసిన‌ట్టు స‌చిన్ ట్విట‌ర్ ద్వారా తెలిపాడు. `ల‌తాదీదీతో క‌లిసి ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ వీక్షించా.

రాజ్యసభకే వన్నె తెచ్చిన మాస్టర్ సచిన్ టెండుల్కర్

Submitted by arun on Mon, 04/02/2018 - 16:18

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ మరోసారి తన పెద్దమనసును చాటుకొన్నాడు. ప్రపంచ మేటి క్రికెటర్ గా మాత్రమే కాదు రాజ్యసభ సభ్యుడిగా కూడా భారత పార్లమెంట్ కే వన్నె తెచ్చాడు. పెద్దల సభలో సభ్యుడిగా ఆరేళ్ల తన ఇన్నింగ్స్ ను ఘనంగా ముగించాడు. కోట్లకు పడగలెత్తిన పార్లమెంట్ సభ్యులకే ఆదర్శంగా నిలిచాడు.