road accident

హైదరాబాద్‌ ఐఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Fri, 03/02/2018 - 17:17

సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జహీరాబాద్‌ నుంచి పటాన్‌ చెరు వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న కారు డివైడర్ ను దాటి బస్సును ఢీ కొట్టింది. ప్రమాద స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇటు బస్సు కూడా రోడ్డుపక్కకు దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. మృతులంతా ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌కు చెందిన వారని తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. బస్సు కూడా ధ్వంసమైంది. 

రెండు కార్లు ఢీకొని ఏడుగురి మృతి

Submitted by arun on Wed, 02/21/2018 - 09:50

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొనడంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 44 వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. అతివేగంతో వస్తున్న ఓ కారు.. డివైడర్ పైకెక్కి.. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. 

బ్రేకింగ్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సతీమణికి గాయాలు...

Submitted by arun on Wed, 02/07/2018 - 11:45

రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య యశోదా బెన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందారు. కోటా-చిత్తోడ్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఆమెను చిత్తోడ్‌లో ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందనీ... వైద్యులు ఆమెకు చికిత్సి అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Sun, 01/14/2018 - 12:11

పండగపూట  పొగమంచు ఓ ఇంట విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లాలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో తమిళనాడు రాష్ట్రంలోని వేళంగిని దేవాలయానికి వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎన్టీఆర్ నగర్ దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు మృతిచెందారు. కాగా... సమాచారమందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. 

గద్వాలలో ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

Submitted by arun on Mon, 01/08/2018 - 11:25

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం బోల్తా పడి  ఐదుగురు చనిపోయారు 15కి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులంతా జిన్నింగ్‌మిల్లులో పనిచేసి తిరుగు ప్రయాణంలో ఉండగా ధరూర్‌-గోనుపాడు గ్రామాల మధ్య ప్రమాదం జరిగింది. మృతులు చిన్నపాడు, యమునోనిపల్లికి చెందినవారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ..స్వల్సంగా గాయపడిన వారికి గద్వాల ప్రభుత్వాసుపత్రిలోనూ చికిత్స అందిస్తున్నారు. 

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ విషాదం

Submitted by arun on Sun, 01/07/2018 - 14:10

మద్యం మత్తులో ఓ వ్యక్తి 3 కుటుంబాల్లో విషాదం నింపాడు. ఫూటుగా మద్యం తాగి వేగంగా కారు నడిపిన విష్ణువర్ధన్ స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువతులను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో జరిగిన ఈ ప్రమాదంలో మస్తానీ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో అమ్మాయి అనూషకు బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ప్రియ అనే యువతికి కాలు విరిగింది. ప్రస్తుతం ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  మృతురాలు మస్తానీ స్వస్థలం తాడేపల్లిగూడెంగా గుర్తించారు. మరో ఇద్దరు యువతుల వివరాలు తెలియాల్సి ఉంది.

జూబ్లీహిల్స్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూష బ్రెయిన్ డెడ్

Submitted by arun on Sun, 01/07/2018 - 11:03

జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 యాక్సిడెంట్‌లో మరో యువతికి బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూషకు.. బ్రెయిన్ డెడ్ అయినట్లు అపోలో హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు. మరో యువతి ప్రియకు.. కాలు విరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదంలో మస్తానీ అనే యువతి.. స్పాట్‌లోనే మృతి చెందింది.

డైమండ్ హౌస్ దగ్గర జరిగిన ఈ యాక్సిడెంట్‌.. హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు గుర్తించారు. యువతి స్కూటీని ఢీకొట్టిన తర్వాత.. నిందితుడు విష్ణువర్ధన్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. భయంతో.. వేగంగా కారు నడపడంతో కిలోమీటర్ దూరంలోనే డివైడర్‌కు ఢీకొట్టాడు. 

పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీ కొన్న బైకర్‌

Submitted by arun on Tue, 12/26/2017 - 11:34

అతి వేగం మరొకరి ప్రాణం తీసింది. మద్యం సేవించి వాహనం నడపవద్దని హెచ్చరించిన యువత మారడం లేదు. పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు స్వల్ప గాయాలతో బటటపడ్డారు. సికింద్రాబాద్‌ బోయిగూడకు చెందిన అనీష్‌ భార్గవ్ స్నేహితుడు వంశీతో కలిసి బంజారాహిల్స్‌ వైపు బైక్‌పై బయలుదేరాడు. స్పోర్ట్స్‌ బైక్‌పై వేగంగా వెళ్తూ పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పైన ఉన్న డివైడర్‌ను ఢీ కొన్నాడు. ప్రమాదంలో అనీష్‌ భార్గవ్‌ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు వంశీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Submitted by arun on Mon, 12/25/2017 - 10:16

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాంచీపురం జిల్లా అచ్చిరపాకం దగ్గర కారు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రోడ్డుకు పక్కన ఆగివున్న కారును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగం అధికంగా ఉండటంతో కారు ధ్వంసమైంది. చనిపోయిన వారిలో ఓ చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.