road accident

డివైడర్ ఎక్కిన కారు.. ముగ్గురు మృతి

Submitted by chandram on Tue, 11/13/2018 - 13:41

మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్లున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారు బోల్తాపడి, కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. చనిపోయిన వారు ఒకే కుటుంబానికి చెందినవారు. భార్య, భర్త, 11నెలల చిన్నారి. హుటాహుటిన ఘటన స్థాలనికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 

హైదరాబాద్‌లో విషాదం ... డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్ధిని మృతి

Submitted by arun on Mon, 10/29/2018 - 12:33

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాదం నెలకొంది. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని కాలేజీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో విద్యార్థిని అక్కడిక్కడి చనిపోయింది. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన విద్యార్థులు కాలేజీ బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. జగద్గిరిగుట్టలో నివసించే రమ్య కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈరోజు ఉదయం ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరిన రమ్య.. కూకట్‌పల్లి బస్టాప్‌లో దిగి రోడ్డు దాటుతుండగా అదే కళాశాలకు చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

Submitted by arun on Sat, 10/27/2018 - 15:34

హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది.. సెలవు రోజుకావడంతో సాఫ్ట్‌వేర్‌ దంపతులు రమ్య, ప్రవీణ్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై చిలుకూరి బాలాజీ ఆలయానికి బయలుదేరారు. అయితే గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తా వద్ద ఓ లారీ వీరి వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమ్య అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.
 

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Submitted by arun on Mon, 10/22/2018 - 17:04

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు దగ్గర టాటా మ్యాజిక్‌‌ను టిప్పర్‌ ఢీకొనడంతో టాటా మ్యాజిక్ లో ఉన్న 8 మంది మృతి ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు విశాఖ జిల్లా మాకవారిపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. కాకినాడలో బంధువుల గృహప్రవేశానికి హాజరై, తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పిఠాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Submitted by arun on Wed, 10/17/2018 - 09:18

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం పెద్దహోతురు సమీపంలో ... కర్నూలు నుంచి ఎలార్తి దర్గాకు వెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 21 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.
 

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Submitted by arun on Fri, 09/28/2018 - 15:52

కుమ్రం భీం జిల్లా జైనూర్‌ మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేగంగా వస్తున్న ఐచర్‌ వ్యాన్‌ ఓ చిన్నారిని ఢీ కొట్టడంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాన్‌ ముందు చక్రాల కింద నలిగి బాలుడు మృతిచెందాడు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో వ్యాన్‌ను అడ్డగించారు. తర్వాత దానికి నిప్పంటించారు. మంటల్లో వ్యాన్‌ తగులబడిపోయింది. దీంతో జైనూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

కొండగట్టు ఘాట్‌రోడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం...32 మంది మృతి

Submitted by arun on Tue, 09/11/2018 - 12:45

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 32మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. సుమారు 60మందితో ప్రయాణిస్తున్న బస్సు కొండగట్టులోని ఘాట్ రోడ్డులోకి వచ్చిన వెంటనే, ఒక్కసారిగా బోల్తా పడింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే ఘాట్ రోడ్డు నుంచి బస్సు పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతంలో పడిపోయింది.

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

Submitted by arun on Mon, 09/10/2018 - 09:23

హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు పాదచారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు లింగపల్లి నుంచి కోఠి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం...8 మంది మృతి, 30 మందికి గాయాలు

Submitted by arun on Sat, 09/01/2018 - 10:03

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం సమీపంలోని మామందూరు రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఎదురుగా వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణీకులను గ్యాస్ కటర్‌ల సాయంతో బయటకు తీసిన పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. 
 

డేంజర్ యాక్సిడెంట్స్

Submitted by arun on Fri, 08/10/2018 - 15:37

వాహనాల రద్దీ పెరగడంతో రోడ్డుపైకి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పాదాచారులు రోడ్డు దాటాలంటే హడలిపోతున్నారు. వాహనాలు మెరుపు వేగంతో దూసుకురావడంతో రెప్పపాటులో ఘోర ప్రమాదాలు జరిగిపోతున్నాయి. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో కొంత మంది ప్రాణాలు కోల్పోతే చాలామంది తీవ్ర గాయాపడి ఇబ్బందిపడుతున్నారు.