girl

సెక్స్ కు ఒప్పుకోని యువ‌తి దారుణ హ‌త్య

Submitted by arun on Mon, 02/19/2018 - 14:50

ఫేస్‌బుక్ పరిచయం.. ఆ పరిచయం కాస్తా ముదిరి స్నేహమవడం.. ఆ స్నేహం ముదిరి ముప్పుగా పరిణమిస్తుందనడం మరోసారి తేలింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. 20 ఏళ్ల యువతిని హత్య చేశాడు. లైంగిక చర్యకు ఆ అమ్మాయి నిరాకరించడంతో అత్యంత కర్కశంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని నలసొపారాలో ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగింది. ముంబైలోని వాసి ప్రాంతానికి చెందిన అంకిత (20) న‌ల‌సోపార ప్రాంతానికి చెందిన హ‌రిదాస్‌కు ఫేస్‌బుక్ ద్వారా కొన్ని నెల‌ల క్రితం ప‌రిచ‌య‌మైంది. మాట‌ల‌తో మాయ చేసి ఆమెతో హ‌రిదాస్ స్నేహం కొనసాగించాడు.
 

ఆడ పిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాక్

Submitted by arun on Mon, 02/05/2018 - 16:48

ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకే భర్త కరెంట్ షాక్ ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే చోటు చేసుకుంది. పెనమలూరులోని పెద్దగుడి ప్రాంతానికి చెందిన ఎస్. రాజారత్నం.. అదే ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే యువతిని ప్రేమించి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఈ వ్యక్తికి గతంలోనే వివాహమైంది. మొదటి భార్యకు విడాకులిచ్చి.. ప్రశాంతిని పెళ్లి చేసుకున్నాడు. 

ప్రేమ వివాహం చేసుకుందని గుండు గీయించారు!

Submitted by arun on Wed, 01/24/2018 - 11:59

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌‌పర్తిలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురుపైనే తల్లిదండ్రులు కర్కశత్వానికి ఒడిగట్టారు. కూతుర్ని కిడ్నాప్‌‌ చేసి అత్యంత అమానవీయంగా గుండు గీయించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హసన్‌పర్తి పోలీసులు యువతి తల్లిదండ్రులు, సోదరులు, వదినలను అదుపులోకి తీసుకున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్‌, బాధిత యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది నచ్చని యువతి తల్లిదండ్రులు కన్నకూతురినే కిడ్నాప్‌‌చేసి కర్కశంగా ప్రవర్తించారు. 

ప్ర‌దీప్ కారులో ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రంటే

Submitted by arun on Sun, 01/07/2018 - 16:21

న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంక‌ర్ ప్ర‌దీప్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో కారులో ప్ర‌దీప్ తో పాటు మ‌రో ముగ్గురు ప్ర‌యాణించారు. అందులో ఇద్ద‌రు అమ్మాయిలు. ఒక అబ్బాయి  ప్ర‌దీప్. మ‌రి  ప‌క్క‌నే ఉన్న ఆ  అమ్మాయిలు ఎవ‌రు అని నెటిజ‌న్లు ఒక‌టే చ‌ర్చించుకుంటున్నారు. అయితే వారిలో స‌గం క‌వ‌ర్ అయిన ఫోటోని చూసి  శ్రీముఖి అని కొంద‌రు గెస్ చేశారు.  ఆఫోటో పై వ‌స్తున్న రూమ‌ర్ల‌ను ఖండించిన శ్రీముఖి తాను కాద‌ని తేల్చేసింది. ఒక‌రు అప్ క‌మింగ్  హీరోయిన్ అని, మ‌రికొంద‌రు ప్ర‌దీప్ డీప్ ల‌వ్ లో ఉన్నాడ‌ని ఊహాగానాలు చేశారు. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా కదిలిన బాలిక

Submitted by arun on Sat, 12/30/2017 - 19:21

విజయవాడ నగరంలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలిక ప్రాణాలతో ఉండగానే మృతిచెందినట్టు వైద్యులుల ధ్రువీకరించారు. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 

వింత వివాహాం.. ముగ్గురు యువతులను పెళ్లి చేసుకున్న మరో యువతి

Submitted by arun on Tue, 12/26/2017 - 14:32

కడప జిల్లా జమ్మలమడుగులో నమ్మలేని నిజం ఒకటి బయటపడింది. అది వింటే మిమ్మల్ని మీరే కొన్ని నిమిషాల పాటు నమ్మలేరు. నమ్మేందుకు ఎంత ట్రై చేసినా మీ మనసు ఒప్పుకోదు. అసలు ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని మిమ్మల్ని మీరే ఒకటికి పది సార్లు ప్రశ్నించుకుంటారు.

ముందు ఆ నిజమేంటో చెప్పండి టెన్షన్‌తో చచ్చిపోతున్నాం అని మీరనుకుంటున్నా తెలిశాక మాత్రం టెన్షన్ ఫ్రీ అయిపోతారు. భుజంపై టవల్ వేసుకొని అమాయకంగా కనిపిస్తున్న అమ్మాయిదే ఈ కేసులో కీ రోల్. అమ్మాయా అని అవాక్కవకండి. అచ్చం అబ్బాయిలా ఉన్నా అచ్చు గుద్దిన అమ్మాయే ఈమె. 18 ఏళ్ల రమాదేవి ఏకంగా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించింది.

అదృశ్య‌మైన బాలిక రాళ్ల మ‌ధ్య శవంగా క‌నిపించింది

Submitted by lakshman on Tue, 09/12/2017 - 17:11

హైద‌రాబాద్ః న‌గ‌రంలోని అమీన్‌పూర్‌లో దారుణం జ‌రిగింది. ఇంటి నుంచి క‌నిపించ‌కుండా పోయిన‌ 17ఏళ్ల బాలిక అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. చాందిన్ జైన్ అనే బాలిక సెప్టెంబ‌ర్ 9న మియాపూర్‌లోని ఇంటి సమీపంలో అదృశ్య‌మైంది. సెప్టెంబ‌ర్ 11 సాయంత్రం అమీన్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ స‌మీపంలో రాళ్ల మ‌ధ్య శవంగా క‌నిపించింది. త‌మ కూతురు క్షేమంగా ఇంటికి తిరిగొస్తుంద‌ని భావించిన త‌ల్లిదండ్రులు గుర్తుప‌ట్టలేని స్థితిలో ఆమె క‌నిపించ‌డంతో క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ఆమె మృత‌దేహం క‌నిపించిన తీరును ప‌రిశీలించిన పోలీసులు.. హ‌త్యకు గురైన‌ట్లు అనుమానిస్తున్నారు.