slider

సీబీఎస్ఈ లీకేజీ : మ‌గ్గురు నిందితులు అరెస్ట్

Submitted by lakshman on Sun, 04/01/2018 - 14:07

పేప‌ర్ లీకేజీ కుంభ‌కోణానికి పాల్ప‌డ్డ నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 28 న దేశం మెత్తం జరిగిన మాథ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కొద్ది సేపటి ముందు CBSE చైర్ పర్సన్ అనితా కర్వాల్ కి వాట్సాప్ ద్వారా క్వ‌చ్చ‌న్ పేప‌ర్ లీక్ అయిన‌ట్లు మెయిల్ వ‌చ్చింది.  క్వ‌శ్చ‌న్  పేపర్ ను అటాచ్ చేసి ఈ పరీక్షను రద్దు చేయాలంటూ ఓ విద్యార్ధి తన తండ్రి జీ మెయిల్ అకౌంట్ ద్వారా చైర్మన్ కు విజ్ణప్తి చేశాడు. అయితే ఎగ్జామ్ నిర్ణయించిన సమయానికి యధావిధిగా జరిగినప్పటికీ అదే రోజున CBSE అధికారులు క్రైం బ్రాంచి పోలీసులకు ఈ విషయమై కంఫ్లెయింట్ చేశారు.

వేస‌విలో హుషారెత్తించే స‌బ్జా గింజ‌లు

Submitted by lakshman on Thu, 03/29/2018 - 03:06

సబ్జా గింజలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతాయి. చికెన్ ఫాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కులు వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి కొబ్బరి నీళ్ళలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి  తాగిస్తే ఫలితం ఉంటుది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి.

జ‌న‌సేన‌కు దిలీప్ సుంక‌ర గుడ్ బై..?

Submitted by lakshman on Tue, 03/27/2018 - 20:13

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌గా, ఆ పార్టీ అధినేత త‌రుపున సంద‌ర్భానుసారం వాదించే నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర. అయితే ఆ క‌ల్యాణ్ దిలీప్ జ‌న‌సేన పార్టీకి దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌న‌సేన క్రియాశీల‌క కార్య‌క‌ర్తే కాకుండా ప‌వ‌న్ అభిమానం సంఘం నాయ‌కుడు కూడా. 

టీడీపీ నేతల దుశ్శాసన పర్వం.. దళిత మహిళను వివస్త్రను చేసిన వైనం

Submitted by arun on Wed, 12/20/2017 - 11:26

ఆడదని ఆగలేదు మహిళని మన్నించలేదు బలహీనులని బరితెగించారు పేదవారేనని పేట్రేగిపోయారు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో దుశ్శాసన పర్వం వెలుగు చూసింది జెర్రిపోతుల పాలెంలోని భూ తగాదాలో మహిళపై కొందరు వ్యక్తులు రాక్షసంగా ప్రవర్తించారు సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెరతీశారు. 

తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్..జయ జ్యూస్ తాగుతున్న దృశ్యాలు..!

Submitted by nanireddy on Wed, 12/20/2017 - 11:25

తమిళనాడులో ఆర్కేనగర్ లో రేపు ఉపఎన్నిక జరుగుతుండగా అందరూ ఆ ఎన్నికపై దృష్టిపెట్టారు.. ఇంతలో జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్ వర్గం హఠాత్తుగా అందరికి షాక్ ఇచ్చారు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత... హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విజువల్స్‌ బహిర్గతమయ్యాయి. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన నేతలు...జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను రిలీజ్ చేశారు. ఆర్కే నగర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజువల్స్‌ రిలీజ్ కావడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  జయలలిత మృతి చెందిన ఏడాది తర్వాత విజువల్స్ బయటకు రావడం కలకలం రేపుతోంది.

ఉస్మానియా మార్చురీ శవాలకు దిక్కు లేకుండా పోతోంది..!

Submitted by nanireddy on Wed, 12/20/2017 - 10:52

శవం శివంతో సమానంగా గౌరవించే సంస్కృతి మనది.. బతికున్నప్పుడు ఎలా ఉన్నా.. చనిపోయిన వ్యక్తిని గౌరవిస్తుంటాం.. అయితే ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలకూ దిక్కు లేకుండా పోతోంది. శవాలను సకాలంలో పోస్టుమార్టం నిర్వహించక పోవడమే కాకుండా.. ఉన్నవాటికి రక్షణ కల్పించలేకపోతున్నారు సిబ్బంది.. ఫలితంగా పందికొక్కులు, ఎలుకలు శవాలను పీక్కుతింటున్నాయి. డంపింగ్‌ రూమ్‌లో భారీగా శవాలు పేరుకుపోవడం.. ప్రధాన రహదారికి ఆనుకుని మార్చురీ ఉండటంతో కుక్కలు శవాల కాళ్లు, చేతులు పీక్కుతిన్న ఘటన గతంలో సంచలనం సృష్టించాయి.. 

ఆ ఎన్నికకు సిద్ధంగా లేని జగన్..?

Submitted by nanireddy on Tue, 12/19/2017 - 12:37

ప్రజల కష్టాలు , నష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని వారికి అండగా నిలవాలని వీలైనంత త్వరగా రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. పాదయాత్ర ప్రస్తుతం సజావుగా సాగుతున్న ఆ పార్టీకి కొత్తగా ఎన్నికల భయం పట్టుకుందని అంటున్నారు.. నాలుగునెలల కిందట పార్టీకి నంద్యాల ఉపఎన్నిక రూపంలో వచ్చిన ఉప్పెన అంత ఇంతా కాదు ఆ ఎన్నిక తరువాత చాల మంది వైసీపీని వీడారు.. మరికొంతమంది కీలక నేతలు క్యూ లో ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది.. 

చేతులారా నాశనం చేసుకున్న కాంగ్రెస్..!

Submitted by nanireddy on Tue, 12/19/2017 - 11:43


నిన్న హిమాచల్ , గుజరాత్ లోని ఎన్నికల ఫలితాలు చూస్తే రెండు పార్టీలమధ్య అధికారం దోబూచులాడిందనే చెప్పాలి.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా నైతికంగా ఓటమి చెందిందని కొందరు రాజకీయ నేతలు అంటుంటే, కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నా రాహుల్ స్వయంకృతాపరాధం వలెనే పార్టీ ఓటమి చెందిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.. హిమాచల్ రాజకీయాలు ఎలా ఉన్నా గుజరాత్ లో మాత్రం బీజేపీ కొంత ఎదురుగాలి వీచిందనే చెప్పాలి.. పార్టీకి మొదటినుంచి వెన్నుదోన్నుగా నిలుస్తూ వస్తున్న పటేళ్లు ఈసారి బీజేపీకి దూరంగా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.. 

'నమో' కు నయా వందనం అంటున్న దేశ ప్రజలు..!

Submitted by nanireddy on Mon, 12/18/2017 - 15:00

బీజేపీ ఖాతాలోకి మరో రెండు రాష్ట్రాలు వచ్చి చేరాయి.. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో ఆ పార్టీ స్పష్టమైన  ఆధిపత్యాన్ని ప్రదర్శించి అధికారం చేజిక్కించుకుంది.. గుజరాత్ లో అయితే ఏకంగా ఆరుసార్లు అధికారం చేపట్టి రికార్డు సృష్టించింది.. అంతేకాదు గుజరాత్ లో మూడుసార్లు వరుసగా అధికారం చేపట్టిన పార్టీగా చరిత్రకెక్కింది.. 2002 నుంచి  ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీకి తాజాగా ఈ ఎన్నిక హాట్రిక్ అన్న ముద్ర పడింది..

కేంద్ర మంత్రి పదవికి త్వరలో జేపీ నడ్డా రాజీనామా..?

Submitted by nanireddy on Mon, 12/18/2017 - 13:07

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవికి జగత్ ప్రకాష్ నడ్డా రాజీనామా చేస్తారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకున్న ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి చెందటంతో, ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం చేయాలనీ బీజేపీ అధిష్టానం భావిస్తునంట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది.. దీనిపై కొద్దీసేపటి  క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నడ్డాతో ఫోనులో మాట్లాడారనే వార్త చక్కర్లు కొడుతుంది.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారం దిశగా అడుగులు వేస్తున్న వేళ ఆ పార్టీకి ధుమాల్ ఓటమి షాక్ ఇచ్చిందనే చెప్పాలి..