tirumala tirupathi devasthanams

టీటీడీ సంచలన నిర్ణయం

Submitted by arun on Sat, 07/14/2018 - 13:23

టీటీడీ చరిత్రలోనే పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 9 నుంచి17 వరకు 9 రోజుల పాటు స్వామివారి దర్శనాన్ని నిలిపివేసింది. తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణపై చర్చించిన పాలక కమిటీ  ఈ నిర్ణయం తీసుకుంది. మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేస్తున్నట్టు సభ్యులు ప్రకటించారు.