Payal Rajput

‘ఆర్‌ఎక్స్‌ 100’ నా జీవితాన్నేమార్చేసింది

Submitted by chandram on Mon, 11/12/2018 - 13:06

"ఆర్ఎక్స్ 100" మూవీతో నాకంటూ ఒక ప్రత్యేకగుర్తింపును తీసుకొచ్చిందని హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తెలిపారు. అమలాపురంలో దుర్గాస్‌ స్పైసీ ట్రీట్‌ రెస్టారెంట్‌’పాయల్ ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాయల్ మాట్లాడుతూ ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వస్తున్నయని, అలాగే హీరో రవితేజ నటించే చిత్రంతో పాటు ఇంకో చిత్రంలో కూడా నటిస్తున్నానని వెల్లడించారు. తన హింది టీవీ సిరియల్స్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిగా గుర్తింపుతోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని పాయల్ రాజ్ పుత్ తెలిపారు.

బంపర్ ఆఫర్ కొట్టేసిన 'ఆర్‌ఎక్స్‌ 100' హీరోయిన్

Submitted by arun on Sat, 11/03/2018 - 10:49

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్నిచేసిన పాయల్‌ రాజ్‌పుత్‌. పాయల్ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడు. కాగా పాయల్‌ తెలుగులో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశారు. రెండో సినిమాతోనే మాస్‌ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం కొట్టేశారు. ‌రవితేజ హీరోగా వి ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. టి. రామ్‌ నిర్మాత. ఇందులో ఓ కథానాయికగా 'నన్ను దోచుకుందువటే 'ఫేం నభా నటేష్‌ కనిపించనున్నారు. ఇప్పుడు మరో కథానాయికగా పాయల్‌ను దర్శక, నిర్మాతలు ఎంచుకున్నారు. ఆమె అయితే ఈ పాత్రకు బాగా సరిపోతారని వారు భావించారట.

కాస్టింగ్ కౌచ్‌పై `ఆర్ఎక్స్ 100` హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Submitted by arun on Mon, 08/20/2018 - 11:29

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై అనేక మంది హీరోయిన్లు స్పందిస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కొత్త హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా కామెంట్స్ చేసింది. పైగా, ఈమెను కూడా ఓ వ్యక్తి పడక గదికి రమ్మని పిలిచినట్టు చెప్పింది. కానీ, తాను కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేసింది. హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌కు నాలుగు రోజుల కింద‌ట కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం ఎదురైంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.`నాకు క‌థ న‌చ్చితే సినిమా కోసం ఏమైనా చేస్తాను. కానీ, బ‌య‌ట మాత్రం కాదు. సినిమాలో అన్ని ముద్దులు పెట్టాన‌ని బ‌య‌ట కూడా ముద్దులు పెడ‌తాన‌ని అనుకుంటున్నారా?

ఆర్ ఎక్స్ 100 మూవీ రివ్యూ

Submitted by arun on Thu, 07/12/2018 - 11:22

టైటిల్ : ఆర్‌ఎక్స్‌ 100
జానర్ : రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌, రావు రమేష్, రాంకీ
సంగీతం : చైతన్‌ భరద్వాజ్‌
నేపథ్య సంగీతం : స్మరన్‌
దర్శకత్వం : అజయ్‌ భూపతి
నిర్మాత : అశోక్‌ రెడ్డి గుమ్మకొండ